మారుతి సుజుకి డిజైర్ కారుకు కష్టకాలం... ఈ లెక్కలు చూస్తే టాటా, హుందాయ్‌లు చాలా హ్యాపీ ఫీల్ అవుతాయేమో!

భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో.. దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి పేరు ఎంతో ప్రత్యేకం. తమ బ్రాండ్ నుంచి వచ్చిన వాహనాలతో తరతరాలుగా వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తోందీ సంస్థ. అయితే సేఫ్టీ స్టాండర్డ్స్ విషయంలో ఈ సంస్థ కార్లు గతంలో విమర్శలు ఎదుర్కొన్నాయి. ఆ విమర్శలకు సమాధానం చెబుతూ.. మారుతి సుజుకి డిజైర్ కారు సేఫ్టీలో ఔరా అనిపించింది. గ్లోబల్ ఎన్‌క్యాప్(G NCAP) క్రాష్ టెస్టులో ఈ కారు ఫైవ్-స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. అంతటి ఘన చరిత్ర కలిగినప్పటికీ.. ఈ డిజైర్ కారు ప్రస్తుతం కష్ట కాలాన్ని ఎదుర్కొంటోంది. ఇంతకీ అసలు వివరాలు ఏంటంటే..

2025 జనవరి అమ్మకాల్లో మారుతి సుజుకి డిజైర్ కారు.. మార్కెట్లో డీలా పడింది. జనవరి నెల‌కు సంబంధించి సేల్స్ రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. రిపోర్టు ప్రకారం.. జనవరి నెలలో భారత మార్కెట్లో 15,383 డిజైర్ కార్లను మారుతి సుజుకి సంస్థ విక్రయించింది.

Maruti Suzuki Dzire January sales

అయితే 2024లో ఈ సంఖ్య 16,773 గా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 8 శాతం తగ్గుదల కావడం గమనార్హం. ఇక జనవరి నెలలో టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లలో డిజైర్ కారు 9వ స్థానానికి పరిమితమైంది. అయితే రానున్న రోజుల్లో మళ్లీ ఈ కారు సేల్స్ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎందుకంటే ఇది ఒక సేఫ్ కార్ అని చెప్పొచ్చు. అలాగే ఇది మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ధరలో ఉంటుంది. అంతేకాకుండా ఈ కారు మంచి మైలేజ్‌ని కూడా అందించగలదు. దాంతో పాటు ఇందులో ఫీచర్లు కూడా చాలానే ఉన్నాయి. ఈ కారణాల రీత్యా సుజుకి డిజైర్ కారు.. మళ్లీ తన సత్తా చాటే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.

Maruti Suzuki Dzire January sales

భారత మార్కెట్లో ప్రస్తుతం ఈ కారు ఎక్స్-షోరూం ధర రూ.6.84 లక్షల నుంచి రూ.10.19 లక్షల మధ్య ఉంది. దీంట్లోని CNG వేరియంట్ కారు 33.73km/kg మైలేజీ అందించగలదు. మారుతి డిజైర్ ప్రస్తుతం ఉన్న 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజిల్ 4-సిలిండర్ ఇంజిన్లతో పనిచేస్తుంది.

పెట్రోల్ ఇంజిన్ 6000 rpm వద్ద 82 bhp, 4200 rpm వద్ద 113 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇక డీజిల్ ఇంజిన్ 4000 rpm వద్ద 74 bhp, 2000 rpm వద్ద 190 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజిన్లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా AMT గేర్‌బాక్స్‌తో జత చేసి ఉంటాయి.

Maruti Suzuki Dzire January sales

ఈ కారులో మిగతా అన్ని వేరియంట్లతో పోల్చితే CNG వేరియంట్ అధిక మైలేజీ అందిస్తుంది. అలాగే దీంట్లో 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, వైర్లెస్ సెల్ ఫోన్ చార్జర్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇంకా మరెన్నో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఈ కార్లలో కలవు. అందువల్ల ఈ కారుని జనాలు ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: మారుతి సుజుకి డిజైర్ కారు సేల్స్ ప్రస్తుతం తగ్గినప్పటికీ ఇది తాత్కాలికమే. ఈ కారు హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ వంటి కార్లకు భారత మార్కెట్లో పోటీ ఇస్తుంది. టాక్సీ ప్లేయర్స్‌తో పాటు, మంచి ఫ్యామిలీ కారు కోసం చూస్తున్నట్లైతే ఇది సరిపోతుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, February 11, 2025, 7:20 [IST]
English summary
Maruti suzuki dzire 2025 january sales report 8 percent down full details are here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+