లీటరుకు 25 కి.మీ మైలేజ్ ఇచ్చే మారుతీ కారునే కోరుకుంటున్న జనాలు.. గత నెలలో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌

ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగానే కాకుండా ఇండియాలో కార్ల వాడకం బాగా పెరిగింది. మార్కెట్లో వరుసగా కొత్త కొత్త మోడళ్లు విడుదల అవుతున్న తరుణంలో కస్టమర్లు ఎంతో ఆసక్తిగా తమకు నచ్చిన దాన్ని కొనుగోలు చేయడానికి షోరూమ్‌ల ముందు క్యూ కడుతున్నారు. SUVలు, సెడాన్‌లు, హ్యాచ్‌బ్యాక్‌ల అమ్మకాలు ఆశించిన మేరకు ఉంటున్నాయి. అయితే ప్రస్తుతం సెడాన్‌లను కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు వీటి సేల్స్ డేటా చూస్తే తెలిసిపోతుంది. దీనికి గల కారణాలు తెలియనప్పటికి కస్టమర్లు ఇతర సెగ్మెంట్‌పై ఎక్కువ ఆసక్తి చూపించడం కారణంగా నెల నెలా సెడాన్ కార్ల విక్రయాలు తగ్గుతున్నాయి. తాజాగా వచ్చిన డేటా ప్రకారం, ఇండియాలో 2025 జనవరి నెలలో సెడాన్ విక్రయాలు తగ్గాయి. దేశంలో లభిస్తున్న సెడాన్‌లు చాలా వరకు కస్టమర్లకు బడ్జెట్ ధరలోనే లభిస్తున్నప్పటికి గత నెలలో తక్కువగా ఈ విభాగం కార్లను కొనుగోలు చేయడం గమనార్హం.

ఒకసారి 2025 జనవరి నెలలో జరిగిన సెడాన్ సేల్స్‌ను చూసినట్లయితే మొత్తం 32,332 యూనిట్లు అమ్ముడుపోయాయి. అయితే దీనికి ముందు ఏడాది 2024 జనవరి నెలలో మొత్తం 33,851 సెడాన్ల సేల్స్ జరిగాయి. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే 1,519 యూనిట్లు తక్కువ అమ్ముడుపోయాయి. గత నెలలో అత్యధికంగా సెడాన్ కార్ల విక్రయాలను నమోదు చేసిన వాటిలో మారుతీ సుజుకీ డిజైర్ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలవడం గమనార్హం.

Sedan Cars Sales List In January 2025

2025 జనవరి నెలలో మారుతీ సుజుకీ డిజైర్ సేల్స్ సంఖ్య 15,383గా ఉంది. అదే, 2024 ఏడాది ఇదే నెలలో ఈ కారు 16,733 యూనిట్ల విక్రయాలను నమోదు చేయడం విశేషం. అయితే ఏడాది లెక్కన ఇవి 1,350 యూనిట్లు తగ్గాయి. సమీక్ష నెలలో అమ్ముడైన మొత్తం సెడాన్ కార్లలో మారుతీ డిజైర్ వాటా దాదాపు సగం వరకు ఉంది. ఎక్కువ మందికి కస్టమర్లకు డిజైర్ ఫేవరెట్ మోడల్‌గా ఉంది.

ఈ లెక్కన దేశంలో జనవరి నెలలో సెడాన్‌లను కొనుగోలు చేసిన ఇద్దరిలో ఒకరు డిజైర్‌ను ఎంచుకున్నారు. దీని తరువాత గత నెలలో సెడాన్ సేల్స్‌లో హ్యుందాయ్ ఆరా రెండవ అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా స్థానాన్ని సంపాదించుకుంది. 2024 జనవరిలో దీని అమ్మకాలు 5,516 యూనిట్లు కాగా, ఏడాది కాలంలో గత నెలలో సేల్స్ 5,388 యూనిట్లుగా ఉన్నాయి. సంవత్సరం ప్రాతిపదికన 128 యూనిట్లు తగ్గాయి.

Honda Amaze Sedan Car Sales In January 2025

తరువాత స్థానంలో హోండా కంపెనీ అమేజ్ మోడల్ ఉంది. 2025 జనవరి నెలలో సెడాన్ సేల్స్‌లో ఇది 3,591 యూనిట్లతో గత ఏడాది కంటే మరింత ఎక్కువ అమ్మకాలను సాధించింది. 2024 జనవరి ఇది 3,000 విక్రయాలను కూడా నమోదు చేయలేదు. వీటి తర్వాత గత నెలలో సెడాన్ విక్రయాల్లో 1,795 యూనిట్లతో 4వ స్థానంలో ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, 1,510 యూనిట్లతో 5వ స్థానంలో స్కోడా స్లావియా కార్లు నిలిచాయి.

ఇక మిగిలిన స్థానాల విషయానికి వస్తే, గత నెలలో 1,484 యూనిట్ల అమ్మకాలతో 6వ స్థానంలో టాటా టిగోర్, 1,477 కార్ల అమ్మకాలతో 7వ స్థానంలో హ్యుందాయ్ వెర్నా, 768 యూనిట్లతో 8వ స్థానంలో మారుతీ సుజుకీ సెడాన్ సియాజ్, 739 యూనిట్లతో 9వ స్థానంలో హోండా సిటీ సెడాన్, చివరగా 10వ స్థానంలో 197 యూనిట్లతో టయోటా క్యామ్రీ స్థానాన్ని సంపాదించుకున్నాయి.

2025 January Sedan Sales Report

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య ఏమిటంటే: భారతదేశంలో SUVలతో పోలిస్తే సెడాన్‌ల అమ్మకాలు తగ్గముఖం పడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 10 సెడాన్ మోడల్స్ బడ్జెట్ ధరలో కొనుగోలుకు ఉన్నాయి. సెడాన్ కార్ల అమ్మకాలు నెల నెలా తగ్గుతున్నప్పటికి మారుతి సుజుకి డిజైర్ అమ్మకాలు మాత్రం సానుకూలంగానే ఉన్నాయి. ఇతర కంపెనీలు తమ సెడాన్ విక్రయాలను పెంచడంపై దృష్టి సారించాయి. రానున్న రోజుల్లో వీటి సేల్స్ కూడా పెరిగే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, February 24, 2025, 12:30 [IST]
English summary
Maruti suzuki dzire is the top selling car in january 2025 sedan sales list
Read more on: #auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+