34 కి.మీ మైలేజ్, ఫుల్ ట్యాంక్‌తో 1800 కి.మీలు.. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్! ఏళ్లుగా జనాలు పిచ్చిగా కొంటున్నారు

ఈ ఏడాది జనవరి నుండి జూన్ వరకు, భారత ఆటోమొబైల్ రంగంలో మరోసారి SUVలదే ప్రభుత్వం అని రుజువైంది. ఇటీవల విడుదలైన అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో SUVలు, హ్యాచ్‌బ్యాక్‌లు, MPVలు, సెడాన్‌లు కూడా చోటు దక్కించుకున్నాయి. అయితే, SUVల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. మొత్తం 6 SUVలు ఈ జాబితాలో స్థానం సంపాదించాయి. ఈ SUVలలో హ్యుందాయ్ క్రెటా తనదైన స్టైలిష్ డిజైన్, ఫీచర్లు, విశ్వసనీయతతో కొనుగోలుదారులను ఆకట్టుకుంది.

మారుతి సుజుకి బ్రెజ్జా, ఫ్రాంక్స్ తమ మైలేజ్, బ్రాండ్ ట్రస్ట్, ధరల కారణంగా జాబితాలో నిలిచాయి. టాటా నెక్సాన్, టాటా పంచ్ వంటి దేశీయ బ్రాండ్‌లు కూడా వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంటూ ముందంజలో ఉన్నాయి. మరోవైపు, మహీంద్రా స్కార్పియో దాని మాస్ అప్పీల్, మస్క్యులర్ రూపకల్పన వల్ల SUV లవర్స్‌కి ప్రత్యేకంగా కనెక్ట్ అయ్యింది.

Maruti Suzuki Dzire

హ్యాచ్‌బ్యాక్ కేటగిరీలో కూడా మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ రెండు కార్లతో జాబితాలో చోటు దక్కించుకుంది. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ అనేవి సిటీ డ్రైవ్‌కు అనువైన మోడళ్లుగా, ఖర్చు తగ్గించి ఎక్కువ మైలేజ్ అందించే కార్లుగా కొనుగోలుదారుల హృదయాల్లో స్థిరపడ్డాయి. అయితే, ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అంశం.. సెడాన్ కార్ల అమ్మకాలు తగ్గుతూ ఉన్నప్పటికీ, మారుతి సుజుకి డిజైర్ (Maruti Dzire) ఈ జాబితాలో నిలిచింది.

ఇది భారత వినియోగదారుల్లో ఇంకా సెడాన్ కార్లకు మద్దతు ఉన్నదనే సంకేతాన్ని ఇస్తోంది. డిజైర్ స్టైలిష్ డిజైన్, మంచి మైలేజ్ వంటి లక్షణాలతో మొదటి ఎంపికగా నిలుస్తోంది. ఆరు నెలల కాలంలో (జనవరి - జూన్ 2025), మారుతి సుజుకి డిజైర్ 96,101 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో 93,811 యూనిట్ల కన్నా 2,290 కార్లు ఎక్కువ, అంటే 2 శాతం వృద్ధి.

Maruti Suzuki Dzire Sales

ఇది సాధారణంగా చూస్తే చిన్న సంఖ్యలా అనిపించినా, అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో దీన్ని 3వ స్థానంలో నిలిపింది. మొదటి రెండు స్థానాల్లో వ్యాగన్ ఆర్, హ్యుందాయ్ క్రెటా నిలిచాయి. మూడవ స్థానంలో డిజైర్ ఉంది. వృద్ధి అదే రీతిలో కొనసాగితే, 2025 ముగిసే నాటికి డిజైర్ ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించవచ్చు. దీని వెనక ప్రధాన కారణాలు, ఆకర్షణీయమైన డిజైన్, మైలేజ్ ఉన్నాయి.

ముందుగా ధర విషయానికి వస్తే, డిజైర్ ఒక అందుబాటులో ఉండే సెడాన్. ఎంట్రీ లెవల్ వేరియంట్ కేవలం రూ.6.84 లక్షలు, ఇక టాప్ వేరియంట్ ధర రూ. 10.19 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఈ ధర శ్రేణిలో ఈ స్థాయి ఫీచర్లు, పనితీరు అందించడం నిజంగా ప్రశంసనీయం. ఇంజిన్ పరంగా చూసుకుంటే, ఇందులో 1.2-లీటర్ Z సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది పెట్రోల్‌తో పాటు CNG వేరియంట్లో కూడా అందుబాటులో ఉంది.

Maruti Suzuki Dzire Price

ఇది 5 స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో ఇది ప్రతి డ్రైవర్‌కు అనుకూలంగా తయారైంది. ముఖ్యంగా మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ వేరియంట్ లీటరుకు 24.79 కిలోమీటర్లు వరకు,CNG వేరియంట్ కిలోకు 33.73 కిలోమీటర్లు వరకు ఇస్తుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో బాధపడుతున్న వారు ఈ కారును హాయిగా కొనుగోలు చేయవచ్చు. ఇది గ్లోబల్ NCAP, భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లలో పూర్తి 5-స్టార్ రేటింగ్ పొందింది.

More from DriveSpark

Article Published On: Sunday, July 20, 2025, 8:00 [IST]
English summary
Maruti suzuki dzire january to june 2025 sales 2 percent growth details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+