ఈ పాపులర్ సెడాన్ కారు ధరను కూడా పెరిగింది.. దీన్ని కొనాలంటే మరింత చెమట తీయాల్సిందే!

భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మారుతి సుజుకి సంస్థ పేరు అందరికీ సుపరిచితమే. తరతరాలుగా ఈ కంపెనీ వాహనాలు వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తున్నాయి. గతేడాది ఈ సంస్థ నుంచి భారత మార్కెట్లో డిజైర్ పేరుతో చిన్న సెడాన్ కారు లాంచ్ అయింది. ఎక్సలెంట్ స్టీల్ స్ట్రెంత్తో వచ్చిన ఈ కారు వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. అలాగే ఈ కారు క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ కూడా సాధించి ఔరా అనిపించింది. అంతేకాకుండా మంచి మైలేజీ అందించడం కూడా ఈ కారు మరో ప్రత్యేకత. కానీ ఇప్పుడు మారుతి సంస్థ ఈ డిజైర్ మోడల్‌కు సంబంధించి‌ వినియోగదారులకు ఒక షాక్ ఇచ్చింది. దీని ధర పెంచుతున్నట్లు ప్రకటించింది.

మారుతి సుజుకి సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో డిజైర్ కొనాలనుకునే వినియోగదారులను నిరాశకు గురి చేసిందని చెప్పవచ్చు. గత కొంతకాలంగా తమ అన్ని మోడళ్ల ధరలను పెంచుకుంటూ వస్తున్న ఈ సంస్థ ఇప్పుడు డిజైర్ ధరను కూడా పెంచేసింది. దీని ధర ఎంత పెరిగింది. ఎందుకు పెంచారనే విషయాన్ని ఇక్కడ చూద్దాం.

Maruti Suzuki Dzire Price

మారుతి డిజైర్ కారులోని వేరియంట్‌ను బట్టి దాదాపు రూ.10,000 మేర ధర పెరిగింది. దీంట్లోని VXi AMT, ZXi AMT వేరియంట్ల ధరలు రూ.10,000 పెరగగా.. ZXi+AMT, ZXi CNG మ్యాన్యువల్, VXi CNG మ్యాన్యువల్, VXi మాన్యువల్, LXi మ్యాన్యువల్ ధరలు రూ.5,000 మేర పెరిగాయి.

అయితే ఇందులోని ZXi+ మ్యాన్యువల్ వేరియంట్ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. ఈ పెరిగిన ధరలను కలుపుకొని చూస్తే ఈ సెగ్మెంట్లో డిజైర్ కారు.. హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్, టాటా టిగోర్ కార్లకు పోటీ ఇస్తుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 6.84 లక్షల నుంచి రూ.10.19 లక్షల మధ్య ఉంది.

Maruti Suzuki Dzire Price Hiked

ప్రస్తుతం డిజైర్ కారులో ఎలాంటి అప్డేట్స్ లేవనే చెప్పాలి. ఈ కారు Z12E, త్రీ-సిలిండర్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT ఆటోమెటిక్ గేర్ బాక్స్ ఆప్షన్‌తో జోడించి ఉంటుంది. ఇది 82 bhp పవర్, 112 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీంట్లో idle Start/Stop ఫీచర్ ఉంటుంది. పెట్రోల్‌తో 25.71 కి.మీ మైలేజీని అందిస్తుంది.

ఇక దీంట్లో ఎక్కువ మైలేజ్ కావాలని కోరుకునేవారు CNG వేరియంటును ఎంచుకోవచ్చు. అయితే CNGతో నడిచి ఎప్పుడు పర్ఫామెన్స్ కాస్త తగ్గుతుంది. కానీ ఇది 33.73 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. ఈ డిసైడ్ కారు స్టైలిష్ లుక్‌తో వస్తుంది. అందువల్ల ఈ కారుని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు.

Maruti Suzuki Dzire Price Hiked

చాలామంది ఈ డిజైర్ కారును Audi of Maruti అని పిలుస్తుంటారు. ఇందులో 9-అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, వైర్లెస్ యా‌పిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, కనెక్టెడ్ కార్ ఫీచర్స్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ AC vents, రియర్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయి.

ఇక సేఫ్టీ విషయానికి వస్తే పైన చెప్పుకున్నట్లుగా ఈ కారు క్రాష్ టెస్టులో ఫైవ్ స్టార్ రేటింగ్‌ని సాధించింది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, హిల్‌హోల్డ్ అసిస్ట్, ABS, EBD, బ్రేక్ అసిస్ట్, అన్ని సీట్లకు త్రీ-పాయింట్ సీట్ బెల్ట్స్, INSOFIX మౌంట్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. ఈ కారు అడల్ట్ సేఫ్టీలోనూ 5-ఫైవ్ స్టార్ రేటింగ్ సొంతం చేసుకోగా.. చైల్డ్ సేఫ్టీ విషయంలో 4-స్టార్ రేటింగ్ సాధించింది.

More from DriveSpark

Article Published On: Monday, February 17, 2025, 18:34 [IST]
English summary
Maruti suzuki dzire price hiked in india check new price details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+