5-స్టార్ సేఫ్టీ, 34 కి.మీ మైలేజ్, 6.84 లక్షల ధర.. బంగారం లాంటి కారును కొనడానికి కస్టమర్లు వెనుకాడుతున్నారు!
దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు మారుతీ సుజుకీ (Maruti Suzuki)కి సెడాన్ విభాగంలో కీలకం అయిన డిజైర్ (Dzire) మరోసారి అమ్మకాల గణంకాలతో వార్తల్లో నిలిచింది. ఆకట్టుకునే డిజైన్, ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమైమన ప్రమాణాలు, మంచి మైలేజ్ కలిగిన ఈ కారుకు సంబంధించిన సేల్స్ వివరాలు వెల్లడయ్యాయి. ఇది దేశీయంగా అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ ఫ్లాగ్‌షిప్ సెడాన్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. మార్చి 2025లో మారుతీ సుజుకీ డిజైర్ 15,460 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసింది. త సంవత్సరం ఇదే నెలలో అంటే మార్చి 2024లో 15,894 యూనిట్లతో పోలిస్తే, ఈ సారి అమ్మకాలు 3 శాతం తగ్గాయి. ఏడాది ప్రాతిదికన చూస్తే ఇది స్వల్ప తగ్గుదల అని చెప్పవచ్చు.
స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, డిజైర్ మార్కెట్లో తన పట్టును మాత్రం కొనసాగిస్తుంది. మోడరేట్ డిజైన్, బడ్జెట్‌కు అనుగుణంగా ఉండే ధర, ఆకట్టుకునే ఫీచర్స్ కారణంగా ఎన్ని మోడళ్లు ఉన్నప్పటికి దీనికి ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతానికి, డిజైర్ అమ్మకాల్లో కొంత తగ్గుదల కనిపించింది. కానీ దీని వెనుక ఉన్న స్పష్టమైన కారణాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే కొద్ది రోజుల్లో తిరిగి అమ్మకాలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.

గడిచిన కొన్ని నెలలగా మార్కెట్లో అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే డిజైర్ సగటున ప్రతినెలా 12 వేల కంటే ఎక్కువ సేల్స్‌ను నమోదు చేస్తూనే ఉంది. ఫిబ్రవరి 2025లో 4,694 యూనిట్లు అమ్ముడుపోయాయి, అలాగే, జనవరిలో 15,383 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. అదే విధంగా గత ఏడాది చూసినట్లయితే 2024 డిసెంబర్ నెలలో 16,573 యూనిట్లు, నవంబర్‌లో 11,779 యూనిట్లు, అక్టోబర్‌లో 12,698 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
సగటు కంటే తక్కువగా వచ్చిన నెలల్లో కూడా అమ్మకాలు దాదాపు పదివేలకు దగ్గరగా ఉండటం, ఈ కార్‌కు ఉన్న బ్రాండ్ వ్యాల్యూని స్పష్టంగా చూపుతోంది. కొత్త ఫీచర్లు, వేరియంట్లు తీసుకువచ్చే ప్రణాళికలతో మారుతీ సుజుకీ మళ్లీ డిజైర్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఈ కారు కొనుగోలుదారులకు రూ. 6.84 లక్షల నుంచి టాప్ ఎండ్ వేరియంట్ రూ.10.19 లక్షల వరకూ (ఎక్స్-షోరూమ్) ఉంది.

ఈ సెడాన్‌లో ఐదు మంది కలిసి సౌకర్యంగా ప్రయాణించడానికి 5 సీటింగ్ కెపాసిటీ ఉండటంతో, కుటుంబ ప్రయాణాలకైనా, రోజు ఆఫీస్ లేదా ఇతర పనులు చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతే కాదు, వీకెండ్ ట్రిప్స్ లేదా సెలవు దినాల్లో పెద్దగా లగేజీ తీసుకెళ్లడానికి డిజైర్‌లో 382 లీటర్ల బూట్ స్పేస్ కూడా అందించడంతో దూర ప్రాంతా ప్రయాణాలు చేసే వారికి మరింత కంఫర్టబుల్‌గా ఉంటుంది.
ఇక ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 1.2 లీటర్ పేట్రోల్, CNG వేరియంట్లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను వేరియంట్‌ను బట్టి ఇంజిన్‌కు జోడించారు. మైలేజ్ విషయంలో మాత్రం ఈ కారు కస్టమర్లను బాగా ఆకట్టుకుంటుంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 24.79 నుండి 25.71 కిలోమీటర్లు, అదే CNG వేరియంట్ కిలోకు 33.73 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

మారుతీ డిజైర్ బ్లూయిష్ బ్లాక్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, మాగ్మా గ్రే వంటి కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇంటీరియర్‌లో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, సన్‌రూఫ్, ఆటో AC, కంఫర్టబుల్ సీట్లు వంటివి ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఇది క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొందింది. ఇది 6 ఎయిర్‌బ్యాగులు, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లతో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








