33 కి.మీ మైలేజ్, 6 లక్షల ధర, 5-స్టార్ సేఫ్టీ.. ఈ కారు అంటే జనాలకు పిచ్చి.. ఇప్పటికీ నంబర్ 1
దేశీయ అతిపెద్ద వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki)కి చెందిన ప్రసిద్ధ సెడాన్ డిజైర్ (Dzire) ఢిల్లీ నుంచి గల్లీ వరకు రోడ్లపై కనిపించే మోడల్. ఎప్పుడో 2008లో మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి, డిజైర్ తనను తాను పదే పదే తిరిగి నిరూపించుకుంటూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే ట్రెండ్ కొనసాగుతోంది. మే నెల ముగియగానే ఈ సెడాన్‌కు సంబంధించిన అమ్మకాలు విడుదలయ్యాయి. సేల్స్ నివేదిక ప్రకారం, గత నెలలో డిజైర్ ఏకంగా 18,084 యూనిట్లను విక్రయించి టాప్ 10 కార్ల జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఇది కేవలం విక్రయాల గణాంకం మాత్రమే కాదు, ఇది వినియోగదారుల నమ్మకం, విశ్వాసానికి ఒక ప్రమాణం. 2025 మే నెలలో, ఈ ప్రాముఖ్యమైన సెడాన్ తన ప్రాచుర్యాన్ని మరోసారి రుజువు చేసుకుంది.
గత ఏడాది మే నెలలో ఈ మోడల్ అమ్మకాలు 16,061 యూనిట్లుగా ఉండగా, ఈ ఏడాది అది 13 శాతం పెరుగుదలతో 18,000కు పైగా మార్క్‌ను దాటేసింది. సాధారణంగా డిజైర్ మోడల్ భారతీయ పేద, మధ్య తరగతి వారికి బాగా ఇష్టమైన కారు. అందుబాటు ధరలో లభిస్తూ, మంచి పనితీరు, పెట్టిన డబ్బులకు సరిపోయే మైలేజ్ ఇవ్వడం వంటి అంశాల కారణంగా ఏళ్లుగా అందరి అభిమానాలను పొందుతుంది.

ఇది మారుతీ సుజుకీ కూడా ఊహించనంత పెద్ద విజయమే. 2025 సంవత్సరంలో మారుతీ సుజుకీ డిజైర్ తన మార్కెట్‌ను బాగానే పెంచుకుంది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు డిజైర్ సాధించిన విక్రయాల గణాంకాలు చూస్తే, ఈ సెడాన్ ఎంతగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిందో స్పష్టంగా తెలుస్తుంది. జనవరిలో 15,383 యూనిట్లు, ఫిబ్రవరిలో 14,694 యూనిట్లు, మార్చిలో 15,460 యూనిట్లు, ఏప్రిల్‌లో 16,996 యూనిట్లు అమ్ముడుపోయింది.
డిజైర్ నెలనెలా కనీసం 15,000 యూనిట్ల మార్క్‌ను దాటేసింది. అంటే, నెలకు సగటున దాదాపు 16,000 యూనిట్లు అమ్ముడవుతూ అద్భుతమైన మార్కెట్‌ను నిలబెట్టుకుంది. భారతీయ మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌కి ఇది సరిపోయేలా ఉండటం, డిజైర్‌కు మునుపటి నుంచి ఉన్న మైలేజ్ ట్రస్ట్‌ను కొనసాగించడమే కాకుండా, లేటెస్ట్ డిజైన్‌తో ఆకర్షణీయంగా తయారవడం కూడా ప్రధాన కారణాలుగా నిలిచాయి.

అంతే కాదు, గ్లోబల్ NCAP నుండి పొందిన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ డిజైర్‌ను మరింత నమ్మకమైన కుటుంబ కారుగా నిలబెట్టింది. ఇవాళ్టి వినియోగదారులు కేవలం లుక్స్‌కే కాకుండా, సురక్షిత ప్రయాణానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, ఈ రేటింగ్ ఓ గేమ్-చేంజర్‌గా పనిచేసింది. పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్‌ను కాకపోయినా, ఫ్యూయల్ ఎఫిషియన్సీ పరంగా డిజైర్ దాని విభాగంలో అగ్రగామిగా నిలుస్తోంది.
అంతేకాదు, మారుతీ సుజుకీ సర్వీస్ నెట్‌వర్క్ విస్తృతంగా ఉండటంతో, ఎక్కడైనా మెకానిక్, విడి భాగాలు లభించడమూ వినియోగదారుల భరోసాను మరింత పెంచాయి. పేరుకే సెడాన్ కానీ ధర విషయంలో మాత్రం ఎంతో అనుకూలంగా ఉండే కార్. దేశంలోని సాధారణ మధ్య తరగతి కుటుంబం కూడా సులభంగా కొనుగోలు చేయవచ్చు. దీని ప్రారంభ ధర రూ.6.84 లక్షల నుండి రూ. 10.19 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.

ఈ కారులోఐదుగురు ప్రయాణీకులు కూర్చునేలా 5 సీటర్ ఉండటంతో కుటుంబ ప్రయాణాలకైనా, రోజువారీ ఉపయోగానికైనా ఇదొక సరైన ఎంపిక. పవర్ ట్రెయిన్ విషయానికొస్తే, ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు CNG వెర్షన్‌లో అందుబాటులో ఉంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో పాటు 5-స్పీడ్ AMT (ఆటోమేటిక్) గేర్‌బాక్స్ ఎంపికను కూడా కలిగి ఉంది. పెట్రోల్ మోడల్ 24 కిమీలు, సీఎన్జీ వెర్షన్ 33 km/kg మైలేజ్ ఇస్తుంది.


Click it and Unblock the Notifications








