బైకుతో పాటు సమానంగా మైలేజ్.. దీని కోసం ఒక్క నెలలో 20 వేల మంది మారుతి షోరూమ్‌ ముందు క్యూ

ఇటీవలి కాలంలో ప్రపంచం SUVలవైపు మొగ్గుచూపుతున్న తరుణంలో... అందరికీ సరిపోయే డిజైన్, బడ్జెట్, మైలేజ్ వంటి అంశాలతో ఒక సెడాన్ మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire). దేశీయ కార్ల మార్కెట్‌లో SUVల డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతున్నప్పటికీ, డిజైర్ సెడాన్ మోడల్ మాత్రం తన ప్రత్యేకతను నిరూపించుకుంటూ ముందు వరుసలో కొనసాగుతోంది. SUVల హవాకే టఫ్ కాంపిటీషన్ ఇస్తూ, ఈ సెడాన్ మోడల్ వినియోగదారుల హృదయాల్లో తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకుంది. 2025 జూలై నెలలో దీనిపై ప్రజల్లో ఉన్న విశ్వాసం ఇంకా బలపడినట్లుగా అమ్మకాల సంఖ్య స్పష్టంగా సూచిస్తోంది. అసలు విషయానికొస్తే, జూలై 2025లో మారుతి డిజైర్ దేశవ్యాప్తంగా 20,895 యూనిట్లు అమ్ముడుపోయింది.

అంతకు ముందు నెల అయిన జూన్‌లో 15,484 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయింది. అంటే ఒకే నెలలో దాదాపు 5,400 యూనిట్లకు పైగా పెరుగుదల జరిగిందన్న మాట. ఈ కారు సేల్స్ పెరగడానికి ప్రధాన కారణం, డిజైర్ అందించే స్పోర్టీ లుక్స్, విశాలమైన ఇంటీరియర్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం, ఇంకా మారుతి సుజుకి నెట్‌వర్క్ మీద ఉన్న నమ్మకం.. ఇవన్నీ కలిసి డిజైర్‌ను మార్కెట్లో తిరుగులేని బెస్ట్ సెల్లింగ్ సెడాన్‌గా నిలబెట్టాయి.

Maruti Suzuki Dzire Sedan July 2025 Sales

SUVల హవా నడుస్తున్నా కూడా, ఈ సెడాన్ అగ్రస్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఇది డిజైర్ సామర్థ్యాన్ని, ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మళ్లీ నిరూపిస్తోంది. తక్కువ ధరతో లభించే ఈ కారును కొనుగోలు చేయడం చాలా మందికి తేలికగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో డిజైర్ ధర రూ.6.84 లక్షల నుంచి రూ.10.19 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉంది. ఈ ధరలో వస్తున్న డిజైర్ మోడల్స్ వినియోగదారుడి బడ్జెట్‌కు అనుగుణంగా అనేక వేరియంట్లలో లభిస్తుంది.

ప్రధానంగా అందుబాటులో ఉన్న వేరియంట్లను చూసినట్లయితే ఇది ఎంట్రీ లెవల్ వేరియంట్, బేసిక్ అవసరాలకే సరిపడేలా LXI, ఎక్కువ ఫీచర్లతో, వినియోగదారులకు మధ్యస్థ ఎంపికగా VXI , ఇంకా ఎక్కువ ఫీచర్లు, డిజైన్, టెక్నాలజీతో ఫుల్ ప్యాకేజీగా ZXI వేరియంట్లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. ఈ వేరియంట్లలో ప్రతి ఒక్కటీ తనదైన విలువను కలిగి ఉండి, బడ్జెట్‌ను బట్టి ఎవరైనా సులభంగా ఒక డిజైర్ మోడల్‌ను ఎంపిక చేసుకోగలుగుతారు.

Maruti Suzuki Dzire Sales

కొత్త డిజైర్ రెండు శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ ఎంపికలతో వస్తోంది, ఇవి వినియోగదారులకు బలమైన పెర్ఫార్మెన్స్‌తో పాటు మైలేజీలోనూ మంచి స్థాయిని అందిస్తున్నాయి. మొదటిది, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఇది 82 PS పవర్, 112 Nm టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది. ఈ ఇంజిన్ ప్రతి రోజూ డ్రైవింగ్‌కి సరిపడేలా మంచి పనితీరు అందిస్తుంది.

మరొకటి 1.2-లీటర్ CNG ఇంజిన్ ఉంది. ఇది 70 PS పవర్, 102 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వెర్షన్ ప్రత్యేకంగా మైలేజ్‌కి ప్రాధాన్యత ఇచ్చే వారికి అనువైనది. కంపెనీ ప్రకారం, ఇది 24 నుంచి 33 కి.మీ/లీటర్ వరకు మైలేజ్‌ను అందించగలదు. ఇంకా, డిజైర్‌కు 37 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం ఉంది. దీని వల్ల దూర ప్రయాణాలకు తరచూ ఇంధనం నింపాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది.

Maruti Suzuki Dzire Sedan

More from DriveSpark

Article Published On: Tuesday, August 5, 2025, 12:10 [IST]
English summary
Maruti suzuki dzire sedan july 2025 sales report 20895 units details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+