నెలకు రూ.9,600తో మారుతి డిజైర్! ఇండియాలో ప్రతి ఊర్లో కనిపించే కారును తక్కువ EMIతో సొంతం చేసుకోండి

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎప్పుడు చూసినా పోటీ తీవ్రంగానే ఉంటుంది. కానీ ఆ పోటీని మట్టికరిపిస్తూ, నిరంతరం అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చిన కంపెనీ మారుతి సుజుకి. ఈ బ్రాండ్‌కి ఉన్న ప్రజాదరణ అంతా దాని నమ్మకమైన కార్ల ద్వారానే వచ్చింది. వాటిలో ముఖ్యంగా మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) మధ్యతరగతి కుటుంబాల కలల కారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది సరసమైన ధరలో, సొగసైన లుక్‌తో పాటు, అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఫీచర్లను అందిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరపు తొలి ఆరు నెలల్లోనే డిజైర్ తన సత్తాను చాటింది. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు మొత్తం 1,08,006 యూనిట్లు అమ్ముడవడంతో ఇది మరోసారి మార్కెట్లో తన ఆధిపత్యాన్ని రుజువు చేసింది.

ఇటీవలి జీఎస్టీ తగ్గింపు కారణంగా డిజైర్ తక్కువకు వస్తోంది. ఇప్పుడు దీని ధర రూ. 6.26 లక్షల నుండి రూ. 9.31 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ ధర, అందులో లభించే ఫీచర్లు, మారుతి సుజుకి నమ్మకమైన సర్వీస్ నెట్‌వర్క్‌ను పరిగణనలోకి తీసుకుంటే, డిజైర్ నిజంగా ఒక విలువైన కొనుగోలు అని చెప్పక తప్పదు. కొత్త కస్టమర్ల కోసం ఈ కారు గురించిన EMI వివరాలు ఈ కథణంలో చూద్దాం.

Maruti Suzuki Dzire Sedan Onroad Price And Emi Details

ముందుగా LXi (పెట్రోల్) వేరియంట్ గురించి మాట్లాడితే, ఆన్-రోడ్ ధర రూ. 7.65 లక్షలు. కస్టమర్ రూ. 3 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన రూ. 4.65 లక్షల మొత్తానికి రుణం పొందవచ్చు. 9 శాతం వడ్డీ రేటుతో, 5 సంవత్సరాల పాటు నెలవారీ EMI సుమారు రూ. 9,600 ఉంటుంది. తక్కువ EMIతో ఈ కారు అందుబాటులో ఉండటం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది.

VXi (పెట్రోల్) వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 8.73 లక్షలు. రూ. 3 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన రూ. 5.73 లక్షల మొత్తానికి రుణం పొందవచ్చు. 9 శాతం వడ్డీ రేటుతో, 5 సంవత్సరాల పాటు నెలవారీ EMI సుమారు రూ. 11,900 అవుతుంది. ఈ వేరియంట్ మరింత కంఫర్ట్, టెక్నాలజీ ఫీచర్లను కలిగి ఉండటం వల్ల ఎక్కువ మంది వినియోగదారులు దీనిని ఎంచుకుంటున్నారు.

Maruti Suzuki Dzire Sedan Onroad Price And Emi Details

ఇక ప్రీమియం వేరియంట్ అయిన ZXI Plus AMT (పెట్రోల్) ఆన్-రోడ్ ధర రూ. 10.45 లక్షలు. రూ. 3 లక్షల డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేస్తే, మిగిలిన రూ. 7.45 లక్షల మొత్తానికి రుణం తీసుకోవచ్చు. 9 శాతం వడ్డీ రేటుతో, 5 సంవత్సరాల పాటు నెలవారీ EMI సుమారు రూ. 15,400** ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, టాప్-ఎండ్ ఫీచర్లను కోరుకునే కస్టమర్లకు ఇది సరైన ఎంపికగా ఉంటుంది.

VXi CNG వేరియంట్‌ ఆన్-రోడ్ ధర రూ.9.69 లక్షలు. రూ.3 లక్షల డౌన్ పేమెంట్‌తో, మిగిలిన రూ.6.69 లక్షల మొత్తానికి రుణం తీసుకోవచ్చు. దీని EMI సుమారు రూ.13,800 ఉంటుంది. ZXI CNG వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 10.83 లక్షలు. రూ. 3 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి, మిగిలిన రూ. 7.83 లక్షల మొత్తానికి, 9 శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాల EMI సుమారు రూ.16,200.

Maruti Suzuki Dzire Sedan Onroad Price And Emi Details Check Here

మారుతి డిజైర్ మైలేజ్ పరంగా 24 నుండి 33 కి.మీ.ల మధ్య అందిస్తుంది, ఇది సాధారణ బైక్‌లు లేదా ఇతర కారు మోడళ్లతో పోల్చితే బెస్ట్ అనొచ్చు. వేగాన్ని చూస్తే, డిజైర్ గరిష్ట వేగం 160 కి.మీ.ల వరకు చేరుతుంది, అలాగే 0-100 కి.మీ.ల వేగాన్ని సుమారు 12 సెకన్లలో చేరుకుంటుంది. పైన పేర్కొన్న EMI వివరాలు ప్రాంతాలను బట్టి మారుతాయి, కాబట్టి, పూర్తి వివరాల కోసం షోరూమ్‌లో సంప్రదించగలరు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 28, 2025, 14:17 [IST]
English summary
Maruti suzuki dzire sedan onroad price and emi details check here
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+