5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందిన మారుతీ మోడల్‌కు పెద్ద యాక్సిడెంట్.. కాంక్రీట్ రాయిని ఢీకొట్టిన డిజైర్
భారతదేశంలో తక్కువ ధరలో మధ్యతరగతి వినియోగదారులు కొనగలిగే కార్లను విడుదల చేయడంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India)కు చెందిన దిగ్గజ మోడల్ డిజైర్ (Dzire) ఇటీవల యాక్సిడెంట్‌కు గురయ్యింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం కొంత దెబ్బతింది. ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, కారులో ఎంత మంది ఉన్నారనే విషయం గురించి ఎలాంటి వివరాలు తెలియనప్పటికీ లోపల కూర్చున్న ప్రయాణికులంతా కూడా సురక్షితంగా ఉన్నారని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ కథనంలో మారుతీ డిజైర్ యాక్సిడెంట్ గురించి ప్రముఖంగా చర్చించడానికి ప్రధాన కారణం, గ్లోబల్ NCAP నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించిన మారుతీ తొలి కారుగా గుర్తింపు పొందిన డిజైర్ ప్రమాదంలో దాని ముందు కుడి భాగం బాగా దెబ్బతింది. దీంతో ఇప్పుడు దీని నాణ్యత గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది.
ఈ యాక్సిడెంట్ గురించిన పూర్తి వివరాలు తెలియనప్పటికీ దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. కొత్త మారుతీ సుజుకీ డిజైర్ ఒక కాంక్రిట్‌ను ఢీ కొట్టినట్లు వీడియోను చూస్తే అర్థం అవుతుంది. ఈ యాక్సిడెంట్‌లో కారు కుడివైపున ఉన్నటువంటి భాగం దెబ్బతింది. అలాగే ఎడమ వైపు భాగంలో ఇంధనం నింపే స్థలంలో కూడా కొంత దెబ్బతింది. బయట ప్రాంతంలో డ్యామేజ్ అయినప్పటికి లోపల ఏం కాలేదని తెలుస్తుంది.

లోపల ఎయిర్‌బ్యాగులు తెరుచుకున్నట్లు వీడియోలో చూడవచ్చు. దీన్ని బట్టి కొత్త మారుతీ డిజైర్ ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగుల పనితీరు మెరగ్గానే ఉందని అర్ధం అవుతుంది. ఈ కారణంగానే లోపల కూర్చున్న ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని తెలుస్తుంది. ఇటీవల క్రాష్ టెస్ట్‌లో మంచి రేటింగ్ పొందిన డిజైర్ దాని బాడీ నిర్మాణంలో నాణ్యత విషయంలో సాటిలేని మోడల్. అప్‌డేట్ అయిన కొత్త డిజైర్ గత ఏడాది నవంబర్ 11న విడుదల అయింది.
ఇటీవల గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన మారుతీ సుజుకీ తొలి కారుగా కొత్త డిజైర్ నిలిచింది. ఈ సెడాన్ భారతీయ మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న మోడల్. ప్రపంచవ్యాప్తంగా వాహనాల సేఫ్టికి సంబంధించి నిర్వహించిన గ్లోబల్ NCAPలో డిజైర్ కారును అన్ని విధాలుగా పరీక్షించగా, అన్నింటిలో కూడా మెరుగైన పెర్ఫామెన్స్ కనబరిచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది.

ఈ కారు సేఫ్టీ ప్రమాణాలపై కంపెనీ ఎంతో నమ్మకం పెట్టుకుంది. అందుకే ఈ యాక్సిడెంట్లో బయటి భాగం మాత్రమే దెబ్బతినడాన్ని చూడవచ్చు. ఇక క్రాష్ టెస్ట్ విషయానికి వస్తే, పెద్దల రక్షణకు సంబంధించి 34కి 31.24 స్కోర్ చేసి 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది, అలాగే పిల్లల రక్షణలో 42కి 39.20 స్కోర్ చేసి 4-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఈ కొత్త డిజైర్ కారులో డజన్ల కొద్దీ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.
కొత్త మారుతీ సుజుకీ డిజైర్ 6 ఎయిర్‌బ్యాగులతో వచ్చింది. ఇంకా EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి సేఫ్టీ ఫీచర్స్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం కొత్త మారుతీ సుజుకీ డిజైర్ సెడాన్ రూ. 6.84 లక్షల నుంచి రూ. 10.19 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు కొనుగోలుకు లభిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








