ఎదురుచూపులకు ఇక బ్రేక్ పడ్డట్లే!.. మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారు షోరూమ్‌లకు వచ్చేసింది!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో అనేక వాహన తయారీ సంస్థలు తమ ఈవీలతో పోటీ పడుతున్నాయి. అయితే దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి మాత్రం ఇంకా ఈ రేసులోకి ఎంట్రీ ఇవ్వలేదు. కానీ త్వరలోనే తమ తొలి ఎలక్ట్రిక్ వాహనం అయిన ఇ-విటారాను లాంచ్ చేసి పోటీ పెంచేందుకు సిద్ధమవుతోంది. మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ వాహనమైన ఇ-విటారా కారును దేశవ్యాప్తంగా అన్ని డీలర్‌షిప్‌లలో లాంచ్ చేయనుంది. దీని ద్వారా ఈవీ సెగ్మెంట్‌లో తమ సత్తా చాటాలని ఈ సంస్థ భావిస్తోంది. ఈ కారు విశేషాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం
e-Vitara కారును ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో 2025లో పరిచయం చేయగా.. మార్చి నెలలో దీన్ని వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని మారుతి సంస్థ భావిస్తోంది. ఈ కారును దేశీయంగా విక్రయించడంతోపాటు విదేశాలకూ ఎగుమతి చేయనుంది. ఈ కారు ధర వివరాలు లాంచింగ్ సమయంలోనే వెల్లడించే అవకాశం ఉంది.

మారుతి సుజుకి సంస్థ ఇ-విటారా కారును పరిచయం చేయడమే కాకుండా.. 2026 నాటికి విస్తృతమైన ఈవీ చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీని ద్వారా తమ బ్రాండ్ సత్తా చాటాలని ఆశిస్తోంది. భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ఈ సంస్థకు ఉన్న నిబద్ధతను ఇది చాటుతోంది. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేని ఈవీల వినియోగాన్ని అందించడమే కాకుండా.. ఈ సెగ్మెంట్లో టాప్ స్థానానికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మారుతి సుజుకి ఇ-విటారా కారును అధునాతన ఫీచర్లు జోడించి తీసుకువచ్చారు. ఇందులో LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, Y-Shaped LED డే టైం రన్నింగ్ లైట్స్, ఫ్రంట్ ఫ్లాగ్ లైట్స్ ఉంటాయి. ఈ ఫీచర్లన్నీ కలిసి ఈ కారుకు మెరుగైన డిజైన్‌ను అందిస్తాయి.

ఈ ఇ-విటారా కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లతో ఉంటుంది. అది 49 kWh, 61kWh. ఈ రెండు బ్యాటరీలు వేర్వేరు పవర్ ఔట్‌పుట్స్ అందిస్తాయి. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందించగలవు. ఇది 7kW AC చార్జింగ్, 70kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.
దీంట్లోని 49 kWh బ్యాటరీ ప్యాక్.. ఫ్రంట్ axle-mounted ఎలక్ట్రిక్ మోటార్‌తో అనుసంధానించి ఉంటుంది. ఇది 142 bhp పవర్, 192.2 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో దీంట్లోనే 61kWh బ్యాటరీ ప్యాక్.. 171 bhp పవర్, 192.5 nm గరిష్టటార్క్ ఉత్పత్తి చేస్తుంది. వీటితో ఈ కారు స్ట్రాంగ్ పర్ఫామెన్స్ ఉంటుందని చెప్పవచ్చు.
ఈ ఎలక్ట్రిక్ వాహనంలో ట్రెడిషనల్ రేడియేటర్ గ్రిల్ లేకపోవడం వల్ల ఈ కారుకు విభిన్నమైన ఫ్రంట్-ఎండ్ లుక్ లభిస్తుంది. ఈ కారు పక్క భాగం బ్లాక్ క్లాడింగ్‌తో ఉంటుంది. ఇది 18 అంగుళాల aerodynamically efficient అలాయ్ వీల్స్‌తో వస్తుంది. అందువల్ల సైడ్ డిజైన్‌లో ఇది అదరగొడుతుంది.
వెనకవైపు.. స్లిమ్ బ్లాక్ బంపర్, LED టైల్ లైట్స్ పాలిష్‌డ్ బ్లాక్ స్ట్రిప్‌తో ఉండి మంచి ఎక్స్టీరియర్ లుక్ అందిస్తాయి. అలాగే ఈ కారు లోపల ఉన్న ఫీచర్లను పరిశీలిస్తే.. ఇది 2- స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-స్క్రీన్ సెటప్ డ్యాష్ బోర్డుతో ఉంటుంది. దీంట్లో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి.
ఈ కారులో రెక్టాంగులర్ AC vents, ఆటో డిమ్మింగ్ IRVM, సెమీ లెదర్ సీట్ ప్యాడింగ్, వైర్లెస్ ఫోన్ చార్జర్ వంటివి కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ కారులో పనోరమిక్ సన్‌రూఫ్, 10- way అడ్జస్టబుల్ డ్రైవర్స్ సీట్, వెంటిలేటెడ్ సీట్స్, 7 ఎయిర్ బ్యాగులు సేఫ్టీ కోసం ఉంటాయి. అలాగే ఇది 360 డిగ్రీ సరౌండెడ్ వ్యూ కెమెరా, అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టం (ADAS)తో వస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: ఈ ఇ-విటారా కారు రెండు మోడ్స్‌తో పనిచేసే అవకాశం ఉన్నందున ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో.. మారుతి సుజుకి నెంబర్ వన్ స్థానంలో ఉండాలని భావిస్తోంది. డీలర్ షిప్‌లలో ఈ కారు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. దీని కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు. ఈ కారుకు సంబంధించి మరింత సమాచారం త్వరలోనే లాంచ్ సందర్భంగా తెలుస్తుంది.


Click it and Unblock the Notifications








