అందరి ఫేవరెట్ మారుతీ మొదటి ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ స్టార్ట్..! ఎంత చెల్లించాలో తెలుసా?
ఇండియాలో సాంప్రదాయ పెట్రోల్, డీజిల్, cng వాహనాల వాడకం క్రమంగా తగ్గుముఖం పట్టేలా ఉంది. వీటికి ప్రత్నామ్యాయంగా ఎలక్ట్రిక్ కార్స్ సందడి చేస్తున్నాయి. కొత్తగా కార్లను కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తున్న చాలా మందిలో ఎక్కువగా ఈవీలను సొంతం చేసుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువ బ్యాటరీ రేంజ్, ఫాస్ట్ ఛార్జ్ కలిగిన మోడళ్ల గురించి మార్కెట్లో తెలుసుకుని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కస్టమర్లలో ఈవీలపై మంచి ఆదరణ ఉండటంతో తయారీదారులు కూడా ఎలక్ట్రిక్ మోడళ్లను విడువల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే దేశీయంగా, అంతర్జాతీయంగా దిగ్గజ వాహన కంపెనీలుగా ఉన్నటువంటి టాటా మోటార్స్, హ్యుందాయ్, ఇతర విదేశీ సంస్థలు అధునాతన బ్యాటరీలతో కూడిన కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే భారత్‌లో అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉన్న మారుతీ సుజుకీ (Maruti Suzuki) మాత్రం ఇంకా వెనుకబడి ఉంది.
అయితే కంపెనీ ఈ ఏడాది నుంచి ఈవీ సెగ్మెంట్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది. దీంతో మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల పరంగా తీవ్రమైన పోటీ నెలకొంది. మారుతీ ఇటీవల తన మొట్టమొదటి ఈవీ ఇ విటారా(eVitara) కారును విడుదల చేసి మార్కెట్ వర్గాలను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. కారు చూడటానికి సరికొత్తగా కనిపిస్తుంది. పెట్రోల్, డీజిల్, cng అమ్మకాల్లో నెం.1 స్థానంలో ఉన్న మారుతీ ఇకపై ఈవీలో కూడా సత్తాను నిరుపించుకోనుంది.

తాజాగా దేశరాజధాని ఢిల్లీలో ఆరు రోజుల అత్యంత ఘనంగా జరిగిన ఆటో ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో మారుతీ తన మొదటి ఈవీ కారు ఇ విటారాను లాంచ్ చేసింది. దీన్నా సొంతం చేసుకోవడానికి చాలా మంది కస్టమర్లు ఎదురుచూస్తున్నారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఇ విటారాకు సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. అయితే ఇవి అధికారిక బుకింగ్స్ మాత్రం కావు. మారుతీ వీటి బుకింగ్స్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు.
డీలర్‌షిప్‌ల స్థాయిలో మాత్రమే బుకింగ్స్‌ను తెరిచినట్టు తెలుస్తుంది. కొన్ని ఏరియాల్లో డీలర్లు కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌ను గమనించి రూ.25వేల వరకు ముందస్తు అడ్వాన్స్ చెల్లింపుతో బుకింగ్స్ చేస్తున్నారు. అధికారిక బుకింగ్స్‌ను మాత్రం మారుతీ సుజుకీ త్వరలో ప్రారంభించబోతుంది. దేశంలో రోజురోజుకు ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న సమయంలో మారుతీ ఇ విటారా కారుతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. మారుతీ ఇ విటారాలో 49kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.

ఇది సింగిల్ ఛార్జ్‌తో 350 నుంచి 400 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. రెండో బ్యాటరీ 61kWh ప్యాక్ కూడా చాలా శక్తివంతమైనది. ఇవి లిథియం ఐరన్-ఫాస్ఫేట్ బ్యాటరీలు. ఈ ఎలక్ట్రిక్ కారు సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 500 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. మారుతీ ఇ విటారాలో వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, లోపల పెద్ద 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటివి ఉన్నాయి.
ప్రయాణికుల భద్రత కోసం ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, మొదటి స్థాయి-2 ADAS, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి ఉంటాయి. ఈ కారును దేశంలోని మారుతీ సుజుకీకి చెందిన గుజరాత్ ప్లాంట్‌లో చేశారు. లోకల్‌గా విక్రయిస్తూనే, ఇతర దేశాల్లో కూడా అమ్మకానికి ఎగుమతి చేయబోతన్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








