మారుతీ సుజుకీ నుంచి ఫస్ట్ ఈవీ వచ్చేస్తోంది.. ఈ ఎలక్ట్రిక్ కారుతో మార్కెట్ సీన్ మొత్తం మారిపోవాల్సిందే!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. అందరూ ఖర్చులు కలిసొస్తాయని ఎక్కువగా ఈవీలవైపు మళ్లుతున్నారు. అనేక వాహన తయారీ సంస్థలు కూడా కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలతో ముందుకు వస్తున్నాయి. అయితే.. భారత మార్కెట్లో ఎంతో సుపరిచితమైన మారుతీ సుజుకీ మాత్రం.. ఈవీల విషయంలో కాస్త వెనుకంజలో ఉందని చెప్పవచ్చు. అయితే.. ఈ సంస్థ నుంచి త్వరలోనే ఓ కొత్త ఈవీ మార్కెట్లోకి రాబోతోంది. అదే మారుతీ సుజుకీ ఇ- విటారా మోడల్ కారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ కారు లాంఛ్‌కు ముహూర్తం సమీపించింది. ఇంకో నెలలోనే దీన్ని వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురానుందీ సంస్థ. ఈ ఈవీలో ఉండే ఫీచర్లు, రేంజ్ తదితర విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఈ మారుతీ సుజుకీ ఇ-విటారాను డెల్టా, జెటా, ఆల్ఫా అనే మూడు వేరియంట్లలో తీసుకురానుంది మారుతీ సుజుకీ సంస్థ. అలాగే దీంట్లో ఎన్నెన్నో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు జోడించి తీసుకురానుంది. ఈ ఈవీని భారత్‌లోనే కాకుండా యూరప్, జపాన్ సహా వంద అంతర్జాతీయ మార్కెట్లో లాంఛ్ చేయాలని ప్లాన్ చేస్తోందీ సంస్థ. దీంట్లో బేస్ వేరియంట్ డెల్టా కారులో 18- అంగుళాల అలాయ్ వీల్స్, ఆటో LED హెడ్ లైట్స్ ఉన్నాయి.

Maruti Suzuki E Vitara Electric Vehicle

ఇంకా LED DRLs, LED టెయిల్ లైట్స్ వంటివి దీని ఎక్స్‌టీరియర్‌కు అదిరే లుక్‌ను అందిస్తాయి. ఇక ఈ డెల్టా వేరియంట్ కారు లోపల... రెండు రంగుల ఆప్షన్లలో ఫ్యాబ్రిక్ సీట్ కవర్స్ ఉంటాయి. డోర్ ప్యానెల్స్ పైన సాఫ్ట్- టచ్ మెటీరియల్ వంటివి దీనికి స్లీక్ యాంబియెన్స్ అందిస్తాయి. అలాగే దీంట్లోని స్లైడింగ్, రిక్లైనింగ్ రియర్ సీట్లు.. ప్రయాణికులకు సంతోషకరమైన జర్నీని, సౌకర్యాన్ని అందిస్తాయి.

ఈ ఇ-విటారాలోని డెల్టా వేరియంట్‌లో సేఫ్టీ ఫీచర్లు కూడా భారీగానే ఉన్నాయి. దీంట్లో 7 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. డ్రైవర్ కోసం knee ఎయిర్ బ్యాగు కూడా ఉంటుంది. అలాగే దీంట్లో ముందువైపు, వెనుకవైపున పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. ESP, రెయిన్- సెన్సింగ్ వైపర్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి కూడా ఉంటాయి. వీటి వల్ల ప్రయాణికులకు మంచి రక్షణ దొరుకుతుంది.

Maruti Suzuki E Vitara

ఇ- విటారా డెల్టా వేరియంట్‌లో 10.25- అంగుళాల డిజిటల్ ఇన్స్టుమెంట్ క్లస్టర్, 10.1- అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం వంటివి ఉంటాయి. వైర్లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కూడా ఈ కారు సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో PM 2.5 ఎయిర్ ఫిల్టర్, అలాగే ముందు వెనుక వైపున USB Type-A, Type-C ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి.

ఇక దీంట్లో జెటా వేరియంట్ విషయానికి వస్తే.. వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి. ఇది 61.1 kWh LFP బ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది. దీంట్లోని పవర్‌ఫుల్ పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్ 128kW (172 hp) పవర్, 192.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కి.మీ. రేంజ్ అందించగలదు.

E Vitara Electric Vehicle Is Expected To Launch In A Month

ఈ కారులో టాప్ వేరియంట్ అయిన ఆల్ఫాలో.. సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 10-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ ఫర్ డ్రైవర్ వంటి ఎక్స్‌క్లూజివ్ ఫీచర్లు ఉంటాయి. దీని ఇంటీరియర్.. సింథెటిక్ లెదర్, ఫ్యాబ్రిక్ అప్‌హోల్‌స్టరీ స్లీక్ బ్లెండ్ లుక్‌తో ఉంటుంది.

అలాగే ఇందులో అడ్వాన్స్‌డ్‌ సౌండ్ సిస్టం అయిన సబ్ వూఫర్‌తో వస్తుంది. ఈ ఆల్ఫా వేరియంట్‌లో ఫ్రంట్ ఫాగ్ లైట్స్, చుట్టు చూడటానికి 360- డిగ్రీ కెమెరా సిస్టం, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ADAS) వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉంటాయి.

డ్రైవ్ స్పార్క్ వ్యాఖ్య: ఈవీ ల్యాండ్ స్కేప్‌లో మారుతీ సుజుకీ ఇ- విటారాలోని ఫీచర్ల కారణంగా దీన్ని పవర్ ఫుల్ బోల్డ్ వెహికిల్ అని చెప్పవచ్చు. అడ్వాన్స్‌డ్ సేఫ్టీ సిస్టం, లగ్జరీయస్ ఇంటీరియర్స్, పవర్ ఫుల్ పవర్ ఆప్షన్స్, లీడింగ్- ఎడ్జ్ టెక్నాలజీ వల్ల భారత మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇది తన సత్తా చాటనుంది.

More from DriveSpark

Article Published On: Saturday, February 8, 2025, 7:20 [IST]
English summary
Maruti suzuki e vitara electric vehicle is set to launch with enhanced features and range
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+