మార్కెట్లోకి మారుతి సంచలన కారు లాంచ్.. ఇ-విటారాతో ఆట మారబోతుంది! ఏకంగా 5-స్టార్ సేఫ్టీతో ఎంట్రీ!

మారుతి సుజుకి (Maruti Suzuki) భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ విప్లవానికి నాంది పలికే విధంగా ఇ-విటారా (e-vitara)ను డిసెంబర్ 2న గురుగ్రామ్‌లో ఘనంగా ఆవిష్కరించింది. ఎన్నో నెలలుగా ఆటో లవర్స్ ఎదురు చూసిన ఈ కారు, దేశంలోనే అగ్రస్థానాన్ని దక్కించుకున్న మారుతి నుండి వచ్చిన మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ SUV కావడం వల్ల ప్రత్యేక ఆకర్షణగా మారింది. భారత ఎలక్ట్రిక్ కార్ల ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఈ మోడల్, డిజైన్ నుంచి టెక్నాలజీ వరకు ప్రతీ అంశంలో వినియోగదారుల అంచనాలకు మించి అందించడమే లక్ష్యంగా రూపొందించబడింది. కొత్త తరం సుజుకి అంతర్జాతీయ EV ప్లాట్‌ఫామ్ అయిన HEARTECT-e ఛాసిస్‌పై తయారైన ఇ-విటారా, ఎలక్ట్రిక్ కార్లకు అవసరమైన బలమైన నిర్మాణం, తక్కువ బరువు, మెరుగైన ఎనర్జీ ఎఫిషెన్సీని అందిస్తుంది.

ఈ ప్లాట్‌ఫాం కారణంగా కారు డ్రైవింగ్ డైనమిక్స్ మరింత స్మూత్‌గా మారడంతో పాటు, బ్యాటరీ ప్లేస్‌మెంట్ సురక్షితంగా, సమతుల్యంగా ఉండేలా ఇంజినీర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రత్యేకంగా గమనించాల్సింది, ఈ SUVలో ఉపయోగించిన LFP (లిథియం-ఐరన్-ఫాస్ఫేట్) బ్యాటరీలు. ఇవి ప్రపంచ ప్రఖ్యాత చైనా బ్రాండ్ BYD నుండి దిగుమతి. LFP బ్యాటరీలు అధిక భద్రత, దీర్ఘకాలిక జీవితం, ఎక్కువ చార్జింగ్ సైకిల్స్‌కి ప్రసిద్ధి.

Maruti Suzuki E Vitara Launched India And Its Received 5 Star Safety Rating In Bncap

భారత వాతావరణ పరిస్థితులకు ఇవి అత్యంత అనువైనవి కావడం వల్ల, మారుతి ఈ సాంకేతికతను ఎంచుకోవడం వినియోగదారుల నమ్మకాన్ని మరింత పెంచుతోంది. మారుతి సుజుకి ఇ-విటారా కేవలం డిజైన్, టెక్నాలజీతోనే కాదు... ప్రదర్శనలో కూడా తన సత్తా చూపించేలా రెండు శక్తివంతమైన బ్యాటరీ ఎంపికలతో భారత మార్కెట్లో ప్రవేశించింది. ఈ ఎలక్ట్రిక్ SUVలో 49 kWh, 61 kWh అనే రెండు విభిన్న బ్యాటరీ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి.

వినియోగదారుల అవసరాలను బట్టి నగర ప్రయాణాలకో, లేదా పెద్ద దూరాల హైవే ట్రిప్స్‌కో ఏది కావాలన్నా సరిగ్గా సరిపోయేలా వీటిని డిజైన్ చేశారు. టాప్-ఎండ్ 61 kWh బ్యాటరీ వేరియంట్ ఈ-విటారాను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఒకే ఛార్జ్‌పై 500 కి.మీ వరకు రియల్-వరల్డ్ రేంజ్ ఇస్తుందని మారుతి హామీ ఇస్తోంది. అంతేకాదు, అధికారికంగా ARAI ధృవీకరించిన రేంజ్ 543 కి.మీ, అంటే రేంజ్‌పై నమ్మకంగా దీన్ని తీసుకువెళ్లవచ్చు.

Maruti Suzuki E Vitara Launched India And Its Received 5 Star Safety Rating In Bncap

దీనికి తోడు, ఈ వేరియంట్ 172 bhp పవర్‌ను విడుదల చేస్తుంది. ఫ్రంట్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో కలిపి ఇవ్వబడిన ఈ శక్తి, సిటీ రోడ్లలోనూ, ఓపెన్ హైవేల్లోనూ మంచి అనుభూతిని అందిస్తుంది. అదే సమయంలో చిన్నదైన 49 kWh బ్యాటరీ వేరియంట్ కూడా తక్కువేమీ కాదు. ఇది రోజువారీ సిటీ కమ్యూటింగ్‌కి మరింత అనువైనదిగా రూపొందించబడింది. ఈ వేరియంట్ 142 bhp పవర్ మరియు 189 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

ఇ-విటారా కేవలం బయట గట్స్‌ గల ఎలక్ట్రిక్ SUV మాత్రమే కాదు... లోపలికి అడుగుపెట్టిన క్షణం నుంచే ఇది ప్రీమియమ్ సౌకర్యాలతో నిండిన ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మారుతి సుజుకి ఈ మోడల్ ఇంటీరియర్‌ను పూర్తిగా కొత్త తరహాలో, అంతర్జాతీయ EV ప్రమాణాలకు తగినట్టుగా మలిచింది. డ్యాష్‌బోర్డ్ మధ్యలో ఆకర్షణగా నిలిచేది 10.1-అంగుళాల పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.

Maruti Suzuki E Vitara Launched India And Its Received 5 Star Safety Rating In Bncap

దానికి తోడు, డ్రైవర్ ముందున్న 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వేగం నుంచి బ్యాటరీ హెల్త్ వరకు అన్ని వివరాలను ఆధునిక గ్రాఫిక్స్‌తో చూపిస్తూ డ్రైవింగ్‌ను మరింత ఇంట్యూటివ్‌గా మార్చుతుంది. లగ్జరీ విషయంలో కూడా ఇ-విటారా వెనక్కి తగ్గలేదు. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు పొడవైన ప్రయాణాల్లో అలసటను గణనీయంగా తగ్గిస్తుంది.

మరో కీలక విషయం ఏమిటంటే ఇది, భారత్ Ncap క్రాష్ టెస్ట్‌లో ఏకంగా 5 స్టార్ రేటింగ్ పొందింది. అధికారక లాంచ్‌కు ముందే ఈ రేటింగ్ పొంది, అంచనాలను మరింత పెంచింది. భారత్ NCAP డేటా ప్రకారం, E-Vitara పెద్దల భద్రతలో 32 పాయింట్లలో 31.49 పాయింట్లు, పిల్లల భద్రతలో 49 పాయింట్లలో 43 పాయింట్లు సాధించింది. ఈ రేటింగ్‌లు డెల్టా, జీటా, ఆల్ఫాతో సహా అన్ని వేరియంట్‌లకు వర్తిస్తాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, December 2, 2025, 20:41 [IST]
English summary
Maruti suzuki e vitara launched in india and its received 5 star safety rating in bncap
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+