దేశమంతా ఎదురుచూస్తోన్న కారు వచ్చేస్తుంది.. 500 కి.మీ రేంజ్‌తో పక్కా గేమ్ చేంజర్
కొత్త మారుతి సుజుకి (Maruti Suzuki) ఇ-విటారా (e Vitara) భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ SUVల విభాగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. ఈ మోడల్‌ను డిసెంబర్ 2న అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం, దీంతో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎదురు చూస్తున్న కొనుగోలుదారుల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం నెలకొంది. మారుతి దీనిని తన అత్యంత కీలక EVగా మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. ఇప్పటివరకు వచ్చిన లీకులు, టీజర్లు, రిపోర్ట్లు చూసినప్పుడే ప్రజల్లో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ SUV ధరను సాధ్యమైనంత పోటీగా ఉంచే ప్రయత్నం చేస్తోంది మారుతి. ఎలక్ట్రిక్ వాహనాలు సాధారణంగా ఎక్కువ ఖరీదైనవిగా భావించినప్పటికీ, ఇ-విటారా ధరను సుమారు రూ.17 లక్షల నుంచి రూ.22.50 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యగా నిర్ణయించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి.
ఇది ఈ సెగ్మెంట్‌లోని ప్రీమియం ఫీచర్లు ఉన్న ఇతర EVలతో పోలిస్తే మంచి ప్రత్యామ్నాయంగా ఎదగడంలో సహాయపడుతుంది. కొత్త ఇ-విటారాను మారుతి మూడు వేరియంట్లలో డెల్టా, జీటా, ఆల్ఫాలలో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ప్రతి వేరియంట్‌లోనూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఫీచర్లు అమర్చనున్నారు. డిజైన్, సేఫ్టీ, బ్యాటరీ రేంజ్ మంచి డ్రైవింగ్ అనుభవంగా మారుతి దీన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కుటుంబాలకు, రోజువారీ ప్రయాణాలకు సరిగ్గా సరిపోయేలా తీర్చిదిద్దినట్లు అంచనా.

ఇతర EVలకు పోటీనిచ్చేలా, రేంజ్ పరంగా కూడా మంచి సంఖ్యను అందించనున్నట్లు సమాచారం. ఛార్జింగ్ వేగం, మోటార్ పనితీరుపై వినియోగదారులలో ఉన్న ఆసక్తి మరింత పెరుగుతోంది. మొత్తంగా చూస్తే, మారుతి ఇ-విటారా మార్కెట్లోకి వచ్చిన వెంటనే EV సెగ్మెంట్‌లో గట్టి పోటీని సృష్టించే అవకాశాలు ఉన్నాయి. మారుతి సుజుకి ఇ-విటారా పనితీరు పరంగా కూడా ఎవరూ తక్కువ అంచనా వేయలేని విధంగా రూపొందించబడింది.
ఇందులో అందించే పవర్‌ట్రెయిన్ పూర్తిగా కొత్తది, శక్తివంతమైనది. కంపెనీ ఈ SUVను రెండు విభిన్న బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో 49 kWh, 61 kWhలలో మార్కెట్‌లోకి తెస్తోంది. ఈ రెండింటూ దూర ప్రయాణాలకు, రోజువారీ డ్రైవింగ్‌కు సరిపడేలా అధిక సామర్థ్యంతో రూపొందించబడ్డాయి. పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉన్న వేరియంట్ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కి.మీ వరకూ రేంజ్ అందిస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇది ప్రస్తుతం మధ్యస్థ ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో చాలా గొప్ప సంఖ్య. రేంజ్ గురించి ఆందోళన పడే వినియోగదారులకు ఇది పెద్ద ప్లస్ పాయింట్‌గా మారుతుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇ-విటారా మరింత ఇంప్రెసివ్‌గా కనిపిస్తుంది. సాధారణ హోం ఛార్జర్‌తో ఈజీగా ఉపయోగించుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించినప్పుడు, బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు చేరేందుకు కేవలం 50 నిమిషాలే పడుతుంది.
కొత్త మారుతి సుజుకి e-Vitara కేవలం పనితీరులోనే కాదు, భద్రతా ప్రమాణాల్లో కూడా అత్యంత మెరుగైన స్థాయిని అందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ SUVకు Euro NCAP నుండి 4-స్టార్ భద్రతా రేటింగ్ రావడం దీని సేఫ్టీ స్టాండర్డ్స్ ఎంత బలంగా ఉన్నాయో స్పష్టంగా చూపిస్తుంది. కుటుంబాలు ముఖ్యంగా చూసే భద్రత అంశాల్లో ఇ-విటారా ఎలాంటి రాజీ పడనిందుకు ఇది పెద్ద నిదర్శనం.

ప్రయాణికుల రక్షణను దృష్టిలో పెట్టుకుని మారుతి ఈ కారు లో 7 ఎయిర్‌బ్యాగ్‌లు అమర్చింది, ఇది ఈ సెగ్మెంట్‌లో అరుదుగా కనిపించే ఫీచర్. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కారు స్థిరంగా నిలిచేలా ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వ్యవస్థలు సమర్థంగా పనిచేస్తాయి. అంతేకాకుండా, డ్రైవర్ సేఫ్టీని మరింతగా పెంచే ADAS వంటి ఇతర ఫీచర్స్ ఇందులో లభిస్తాయి.


Click it and Unblock the Notifications








