భారతదేశం మొత్తం ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తుంది.. దీనికి అంత డిమాండ్ ఎందుకో?

దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) భారతదేశంలో పేద, మధ్య తరగతి వినియోగదారులకు అనుకూలంగా ఉండే విధంగా కార్లను విడుదల చేయడంలో ఎప్పుడు కూడా ముందు స్థానంలో ఉంటుంది. ఇప్పటి వరకు సంప్రదాయ ఇంధన మోడళ్లను లాంచ్ చేసిన కంపెనీ క్రమంగా తన ఫోకస్‌ను ఎలక్ట్రిక్ వాహనాలపై పెట్టింది. ఈ నేపథ్యంలో 2025 ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో మారుతీ తన తొలి ఎలక్ట్రిక్ SUV ఇ-విటారాని ఆవిష్కరించింది. సురక్షితమైన నిర్మాణం, అత్యాధునిక ఫీచర్లతో ఈ కారు మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవీ వంటి కార్లకు గట్టి పోటీగా నిలవనుంది. మారుతీ సరికొత్త ఎలక్ట్రిక్ కారు భారత మార్కెట్లో అమ్మకాల పరంగా కొత్త సంచలనాలకు తెర లేపే అవకాశం ఉంది.

ఈ ప్రసిద్ధ కారును రాబోయే వారాల్లో అధికారికంగా ప్రారంభించబోతున్నారు. ఇ-విటారాను మొదటగా 2024లో ఇటలీలోని మిలన్‌లో ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు. ఆ తరువాత ఇండియా 2025 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. దీన్ని సుజుకి మోటార్ గుజరాత్ (SMG) ప్లాంట్‌లో ఉత్పత్తి చేసి దేశీయ వినియోగదారులకు విక్రయిస్తూనే అదే సమయంలో ఇక్కడి నుంచే ఇతర దేశాలకు సైతం ఎగమతి చేయనున్నారు. ఈ కారును జపాన్, యూరోపియన్, దక్షిణ అమెరికాల్లో కూడా విక్రయించనున్నారు.

Maruti suzuki E Vitara

2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఇవీఎక్స్(eVX) కాన్సెప్ట్ ఆధారంగా అభివృద్ధి చేసిన ఈ ఎలక్ట్రిక్ SUV, అదిరిపోయే డిజైన్, అధునాతన ఫీచర్లతో రాబోతోంది. ఇది Y-ఆకారపు DRL లతో LED హెడ్‌లైట్లు, ముందు భాగంలో ఇంటిగ్రేటెడ్ ఫాగ్ ల్యాంప్‌లు, బలమైన సిల్వర్ స్కిడ్ ప్లేట్‌లతో కూడిన బ్లాక్డ్-అవుట్ బంపర్‌ సెటప్ ఉంటుంది. ఈ కారు సైడ్ ప్రొఫైల్‌లో స్టైలిష్‌గా బ్లాక్ క్లాడింగ్‌తో రూపొందించబడింది.

ఇది 18-అంగుళాల ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్‌తో కూడిన అధునాతన లుక్‌ని అందిస్తుంది. వెనుక భాగంలో ఒక ప్రీమియం బ్లాక్ కలర్ బంపర్, కారును మరింత స్పోర్టీ, సరికొత్తగా కనిపించేలా చేయడంలో LED టెయిల్‌లైట్ డిజైన్ బాగా ఆకట్టుకుంటుంది. దీని డిజైన్ ఎరోడైనమిక్ సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా రూపొందించబడింది. ఇ విటారా కారు రెండు బ్యాటరీ ఎంపికలు 48.8 kWh, 61.1 kWh ప్యాక్‌లతో అందుబాటులో ఉంటుంది.

Maruti suzuki E Vitara Will Be Launch Soon

రెండు బ్యాటరీ ఆప్షన్లతో పాటు, శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ సెటప్‌ను కూడా అందిస్తుంది. 49kWh చిన్న బ్యాటరీ ప్యాక్ 142 bhp పవర్, 192.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడింది. ఇది సిటీ డ్రైవింగ్, రోజువారీ వాడకానికి సరిపోయే పెర్ఫామెన్స్‌ను అందిస్తుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ 61kWh బ్యాటరీ వెర్షన్ 172 bhp పవర్, 192.5 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది.

ఈ మోడల్ 2WD (రియర్-వీల్ డ్రైవ్) కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది. పూర్తి ఛార్జ్‌తో ఈ కారు 500 కి.మీల కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఆల్-వీల్ డ్రైవ్ సెటప్ అందుబాటులో ఉండగా, భారత మార్కెట్లో కస్టమర్లకు ఫ్రంట్-వీల్ డ్రైవ్ సిస్టమ్ లభించనుందని తెలుస్తుంది. ఈ ఇ-విటారా వీల్‌బేస్ పొడవు 2,700 మిమీగా ఉంది. ఇది GNCAP క్రాష్ టెస్ట్‌లలో బాగా పనిచేస్తుందని అంచనాలు ఉన్నాయి.

Maruti suzuki E Vitara Will Be Launch Soon In India

మారుతీ తన ఎలక్ట్రిక్ కారులో అదిరిపోయే ఫీచర్స్‌ను అందించింది. ఇది డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, స్మార్ట్‌ఫోన్‌లను కేబుల్ లేకుండా ఛార్జ్ చేయడానికి వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా కెమెరా, సేఫ్టీ కోసం లెవల్-2 ADAS, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, March 29, 2025, 7:20 [IST]
English summary
Maruti suzuki e vitara will be launch soon in india battery range and all top things
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+