ఈ ప్రత్యేకమైన డిజైన్‌కు 15 ఏళ్లు.. ఇప్పటికీ బోర్ కొట్టడం లేదు.. ఇండియా మోస్ట్ పాపులర్ మారుతీ ఈకో
దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) భారత్‌లో సేల్స్ పరంగా మొదటి స్థానంలో ఉంటుంది. 2024 ఏడాదిలో కంపెనీ టాప్ సెల్లింగ్‌గా నిలిచింది. దశాబ్దాల కాలంగా మారుతీ ఇండియాలో కార్లను విక్రయిస్తూ ప్రతి గ్రామానికి చేరుకుంది. గతంలో విడుదల అయిన చాలా మోడళ్లకు ఇప్పటికి కూడా డిమాండ్ తగ్గడం లేదు. కంపెనీ తన ఉత్పత్తులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ మార్కెట్లోకి లాంచ్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టిన ఒక మోడల్‌కు దేశంలో ఇప్పటికి డిమాండ్ తగ్గకపోవడం గమనార్హం. అదే మారుతీ సుజుకీ ఈకో (eeco). ఈ కారు మొదటగా 2010 జనవరిలో విడుదల అయింది. అప్పటి నుంచి కూడా ఇది అమ్మకాల్లో ప్రతి ఏడాది ఎప్పటికప్పుడు దూసుకుపోతుంది.
సాధారణంగా ఇండియాలో ఫ్యామిలీ కార్లు మంచి ఆదరణ ఉంటుంది. అదే తరుణంలో ఈ ఈకో కారుకు కూడా డిమాండ్ ఉంది. ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం, మారుతీ సుజుకీ ఈకో లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 12 లక్షల (1.2 మిలియన్) అమ్మకాలను నమోదు చేసింది. 15 ఏళ్ల కాలంలో ప్రతి ఏడాది కూడా ఈ కారు సగటున 80 వేల సేల్స్‌ను నమోదు చేయడం గమనార్హం.

ఇది రెండు కుటుంబాలకు అత్యుత్తమైన ఆప్షన్. కుటుంబం అంతా కలిసి లాంగ్ జర్నీలు, టూర్లకు ప్లాన్ చేసే వారికి ఈ కారు బాగా సరిపోతుంది.5, 7 సీటర్ ఆప్షన్‌లో మంచి పెర్ఫామెన్స్ ఇచ్చే కారు. మారుతీ సుజుకీ ఈకో భారతీయ మార్కెట్లో కేవలం రూ.5.32 లక్షల ధరకే కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది ప్రారంభ ధర మాత్రమే. అదే దీనిలో టాప్ వేరియంట్ ధర రూ.6.58 లక్షల వరకు ఉంది.
ఈ ధరలన్నీ ఎక్స్ షోరూమ్‌వి. మధ్యతరగతి ప్రజలు కొనగలిగే అందుబాటు ధరలో లభించడం వలన దేశంలో చాలా మంది ఈ కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. అందుకే సేల్స్ పరంగా మారుతీ అత్యుత్తమైన మోడల్‌గా స్థానం సంపాదించింది. ఒక్క ధర విషయంలోనే కాకుండా పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఇది 7 సీట్లతో పాటు, 5 సీట్లతో కూడా లభిస్తుంది. దీంతో కస్టమర్లు వారి అవసరాల మేరకు సీటింగ్‌ను ఎంచుకుంటున్నారు.

మారుతీ సుజుకీ ఈకో(eeco) 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 81 PS పవర్, 104.4 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు జత చేశారు. ఇది లీటర్ పెట్రోల్‌కు దాదాపు 19.71 కి.మీల వరకు మైలేజ్ ఇస్తుంది. అలాగే CNG ఆప్షన్‌లో లభిస్తున్న ఈకో కారు 1.2-లీటర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జోడించారు.
CNG ఆప్షన్‌లో 72 PS పవర్, 95 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. కిలో ఇంధనానికి 26.78 కిమీ మైలేజీని ఇస్తుంది. ఈ కారు ఇండియాలో మంచి సేల్స్ సాధించడానికి ప్రధానంగా మైలేజ్ కూడా ఒక కారణంగా ఉంది. ముఖ్యంగా మైలేజ్ విషయానికి సంబంధించి, ఇది ARAI సంస్థ నుంచి ధృవీకరణ అందుకుంది.

డ్రైవ్ స్పార్క్ వ్యాఖ్య: మారుతీ సుజుకీ ఈకో (eeco)15 ఏళ్ల తర్వాత కూడా అమ్మకాల్లో ఇతర మోడళ్లకు గట్టిపోటీని ఇస్తూ దూసుకుపోతుండటం అంటే సాధారణ విషయం కాదు. తక్కువ ధర, అద్భుతమైన మైలేజ్, మెరుగైన పర్ఫామెన్స్, ఎక్కువ సీటింగ్ వంటి కారణాల వల్ల ఇది ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకుంటుంది.


Click it and Unblock the Notifications








