ఫుల్ ట్యాంక్ చేస్తే 1700కు పైగా కిలోమీటర్లు.. ధర రూ.5 లక్షలు.. గత నెలలో ఎంతమంది కొన్నారంటే?
భారతీయ మధ్యతరగతి కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మారుతీ సుజుకీ నుంచి విడుదలైన ప్రసిద్ధ మోడల్ ఈకో (EECO) సాధారణంగా కుటుంబ ప్రయాణాలతో పాటు, వ్యాపార అవసరాలు రెండింటికీ బాగా ఉపయోగపడుతుంది. ఈ కారు బడ్జెట్ ధరలో లభిస్తూ, తక్కువ మెయింటనెన్స్, అందుబాటులో ఉన్న పెద్ద సీటింగ్ సామర్థ్యం వంటి కారణాలతో కస్టమర్లలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా కంపెనీ నుంచి విడుదలైన అమ్మకాల నివేదిక ప్రకారం, దీనికి మార్కెట్లో డిమాండ్ క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీనికి ప్రత్యమ్యాయంగా కొత్త మోడళ్లు విడుదల కావడం, కస్టమర్ల ఇష్టాల్లో మార్పులు రావడం. కొత్త టెక్నాలజీ అప్‌డేట్స్ లేకపోవడం వంటి కారణాలతో ఈకో వాహనానికి ఆదరణ క్రమంగా తగ్గుతోంది. ఇటీవల విడుదలైన అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, మార్చి నెలలో కూడా ఈ ట్రెండ్ కొనసాగినట్టే కనిపిస్తోంది.
ఒకప్పుడు హాట్‌సేలింగ్ మోడల్‌గా ఉన్న కారు ఇప్పుడు మార్కెట్‌లో ఇబ్బంది పడుతంది. నివేదిక ప్రకారం, మారుతీ ఈకో 2025 మార్చి నెలలో 10,409 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసింది. 2024 మార్చితో పోలిస్తే 13.40 శాతం తగ్గుదల కావడం గమనార్హం. గత సంవత్సరం ఇదే సమయంలో ఈ కారును 12,019 మంది కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం మొదటి రెండు నెలల్లోనూ ఈకో అమ్మకాల్లో పరిస్థితి అంతగా మర్పు రాలేదు.

2025 జనవరిలో 11,250 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగా, ఫిబ్రవరిలో 11,493 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాది డిసెంబర్, నవంబర్, అక్టోబర్ నెలల్లో కూడా ఇదే తరహా విక్రయాలు చోటు చేసుకున్నాయి. డిసెంబర్‌లో 11,678 యూనిట్లు, నవంబర్‌లో 10,589 యూనిట్లు, అక్టోబర్‌లో 11,653 యూనిట్ల మారుతీ ఈకో అమ్మకాలు నమోదయ్యాయి. కంపెనీ నుంచి ఇప్పటివరకు అమ్మకాలు తగ్గుదలకు సంబంధించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
కానీ మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈకోలో ట్రెండ్‌కు అనుగుణంగా వినియోగదారులను ఆకట్టుకునే లేటెస్ట్ ఫీచర్స్ లేకపోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. వినియోగదారుల అభిరుచులు మారుతున్న ఈ రోజుల్లో, అధునాతన టెక్నాలజీ ఫీచర్లను అందించలేకపోవడం వలన కస్లమర్లు ఇతర మోడళ్ల వైపుయ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, మారుతి ఈ పరిస్థితిని గుర్తించి, ఇటీవల ఈకో కారును 6 ఎయిర్‌బ్యాగ్‌లతో అప్‌గ్రేడ్ చేసింది.

ఈ సేఫ్టీ ప్రమానాలను అందించడం వల్ల కస్టమర్లకు దీనిపై ఆసక్తి పెరిగి అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రానున్న రోజుల్లో కొత్త అప్‌డేట్స్, ఫీచర్లతో ఈ మోడల్ వస్తే, మళ్లీ మెరుగైన అమ్మకాల సంఖ్యలను చేరే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం మారుతీ ఈకో రూ. 5.44 లక్షల నుంచి రూ. 6.70 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
ఇది 5 లేదా 7 సీటర్ ఆప్షన్‌లో లభించడం వల్ల చిన్న నుంచి పెద్ద కుటుంబాలకు సరిపోతుంది. అంతేకాదు, ఇది ప్రయాణికులే కాదు, సామాను రవాణా చేసే వారికి కూడా ఉపయోగపడేలా, 275 లీటర్ల నుంచి 540 లీటర్ల వరకు సామర్థ్యం కలిగిన స్టోరేజ్ స్పేస్‌ను కలిగి ఉంది. ఇది పెట్రోల్, CNG వేరియంట్లలో లభిస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ వేరియంట్ 19.71 కిలోమీటర్లు ఇస్తుంది.

CNG వేరియంట్ 26.78 కిలోమీటర్లు అందిస్తుంది. ఇది శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంది. 1.2-లీటర్ పెట్రోల్, CNGతో రన్ అవుతుంది. గేర్‌బాక్స్ పరంగా, దీనిలో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే ఉంది. ఈ కారులో వినియోగదారులకు అవసరమయ్యే డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications








