రూ.5.70 లక్షలకే రెండు కుటుంబాలకు బెస్ట్.. 27 కి.మీ మైలేజ్, ఫుల్ సేఫ్టీ.. గత నెలలో ఎంతమంది కొన్నారంటే?

భారతదేశంలో పేద, మధ్య తరగతి వారికి అనుకూలంగా ఉండేలా అందుబాటు ధరలో, అత్యాధునిక ఫీచర్స్ అందిస్తూ మంచి పెర్ఫామెన్స్ అందించే కార్లను విడుదల చేయడంలో ఎప్పుడు ముందు ఉంటుంది మారుతీ సుజుకీ (Maruti Suzuki). కంపెనీ వ్యాన్ విభాగంలో విక్రయిస్తున్న ఒకే ఒక ఎంపీవీ మోడల్ ఈకో (Eeco) మాత్రమే. తాజాగా ఈ మోడల్ జూన్ నెలలో నమోదు చేసిన అమ్మకాలను మారుతీ విడుదల విడుదల చేసింది. సేల్స్ డేటా ప్రకారం, ఈకో జూన్ 2025లో 9,340 యూనిట్లు అమ్ముడుపోయింది. ఇది గత ఏడాది అంటే, 2024 జూన్‌లో అమ్ముడైన 10,771 యూనిట్లతో పోలిస్తే ఇది స్వల్ప తగ్గుదల మాత్రమే. రానున్నరోజుల్లో ఇది తిరిగి పుంజుకునే అవకాశం ఉంది.

తాజా అమ్మకాలు కొంత మందగించినప్పటికీ, త్వరలో పండుగ సీజన్‌కి డిమాండ్ తిరిగి పుంజుకుని, అమ్మకాలు మరల పెరగవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వినియోగదారులకు ఇది ఇంకా బడ్జెట్-ఫ్రెండ్లీ ఫ్యామిలీ కారుగా, అలాగే లాజిస్టిక్స్ వాహనంగా చక్కగా కొనసాగుతోంది. తక్కువ ధరలో పెద్ద కుటుంబాలు సౌకర్యంగా ప్రయాణించగలగడం, ఈజీ మెయింటెనెన్స్, వ్యాపార అవసరాలకు కూడా సరిగ్గా సరిపోవడం ఈకోకు ఉన్న ప్రత్యేకత. ఈకో, భారత మార్కెట్‌లో ఎన్నో ఏళ్లుగా నమ్మకమైన కారు.

Maruti Suzuki Eeco Sales

ప్రస్తుతం ఇది 5 సీట్లు, 6 సీట్ల రెండు కాన్ఫిగరేషన్లలో లభిస్తోంది. ధర కూడా అందరికి అందుబాటులో ఉంటూ, రూ.5.70 లక్షలకే (ఎక్స్-షోరూమ్) అమ్మకానికి అందుబాటులో ఉంది. పెద్ద కుటుంబాలకు సరైన సీటింగ్, తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌలభ్యం అందించడంలో ఇది ప్రసిద్ధి చెందింది. గతంలో అమ్మకాలను చూసినట్లయితే నవంబర్‌లో 10,589 యూనిట్లు, డిసెంబర్‌లో 11,678 యూనిట్లు అమ్ముడుపోయింది.

ఈ ఏడాది అమ్మకాలను చూసినట్లయితే, జనవరిలో 11,250 యూనిట్లు, ఫిబ్రవరిలో 11,493 యూనిట్లు, మార్చిలో 10,409 యూనిట్లు, ఏప్రిల్‌లో 11,438 యూనిట్లు, మే నెలలో 12,327 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక జూన్‌లో అమ్మకాలు మాత్రం అత్యల్ప స్థాయికి చేరి, 9,340 యూనిట్లకు పరిమితమయ్యాయి. అయినా కూడా, ఈకో సాధారణంగా నెలవారీ అమ్మకాలలో స్థిరత్వాన్ని కొనసాగిస్తూనే ఉంది. పెట్రోల్, సీఎన్జి ఇంజిన్ ఎంపికలు కూడా ఈ కారుకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

Eeco 9340 Sales Units Recorded In June 2025

ఈకో K-సిరీస్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌లో లభిస్తుంది. ఇది 80.76 PS పవర్, 104.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే సీఎన్జీ వేరియంట్‌కి 71.65 PS పవర్, 95 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. తక్కువ నిర్వహణ ఖర్చులు, పనితీరు, ఎక్కువ లొకల్ కమ్యూటింగ్ అవసరాలకు సరిపోవడం ఈకోకు మార్కెట్లో డిమాండ్ రావడానికి కారణంగా ఉన్నాయి. జూన్‌లో వెనకడుగు వేసినప్పటికీ, రాబోయే నెలల్లో తిరిగి బలపడే అవకాశాలు ఉన్నాయి.

మారుతీ సుజుకీ ఈకోలో ఇంటీరియర్‌ డిజైన్ చాలా సరళమైనది, ప్రాక్టికల్‌దే కానీ అవసరాలకు తగ్గట్టే ఉంటుందని చెప్పవచ్చు.ఇందులో బేసిక్ డాష్‌బోర్డ్ లేఅవుట్ ఉంటుంది. డ్యాష్ బోర్డ్ పై బ్లాక్ AC వెంట్స్ ఉండి, సాధారణ లుక్‌నే ఇస్తాయి. స్టీరింగ్ వీల్ 3-స్పోక్ డిజైన్‌తో వస్తుంది, ఇది వాడటానికి సులువుగా ఉంటుంది. ఇంకా ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఫంక్షనల్ గానే రూపొందించబడింది. ఇందులో సెమీ-డిజిటల్ క్లస్టర్ ఉంటుంది.

Maruti Suzuki Eeco

మోనోటోన్ మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేతో అవసరమైన సమాచారం చూడవచ్చు. కంఫర్ట్ కోసం హీటర్‌తో కూడిన మాన్యువల్ AC అందించబడింది. క్యాబిన్‌లో లైట్లు, విండోలు అన్నీ మాన్యువల్ ఆపరేషన్‌కి వస్తాయి. సేఫ్టీ పరంగా ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ముందు సీట్లో కూర్చున్న వారికి సీట్ బెల్ట్ రిమైండర్, అన్ని ప్రయాణీకులకు 3-పాయింట్ సీట్ బెల్టులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి సేఫ్టీ సదుపాయాలు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 2, 2025, 17:13 [IST]
English summary
Maruti suzuki eeco 9340 sales units recorded in june 2025 details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+