మిడిల్ క్లాస్‌కి బెస్ట్ కారు.. రూ.5.70 లక్షలు.. 27 కి.మీ మైలేజ్! ఫ్యామిలీ, కమర్షియల్‌కి యూజ్‌ఫుల్

మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco) భారత మార్కెట్‌లో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మల్టీపర్పస్ వాహనం. పేరు చెబుతున్నట్లుగానే ఇది కుటుంబ అవసరాలకే కాదు, వ్యాపార అవసరాలకు కూడా సమానంగా ఉపయోగపడుతుంది. విశాలమైన ఇంటీరియర్, సౌకర్యవంతమైన సీటింగ్ ఆప్షన్లు, ఎక్కువ లగేజ్ స్పేస్ కారణంగా ఇది చిన్న వ్యాపారాల నుంచి పెద్ద కుటుంబాల వరకు అందరికీ సరిపోయేలా ఉంటుంది. ఈకోకు ఉన్న ఫ్లెక్సిబుల్ డిజైన్ వల్ల దానిని ప్రయాణికుల వాహనంగా, కార్గో వాహనంగా, అంబులెన్స్‌గా లేదా స్కూల్ వాన్‌గా మార్చుకోవచ్చు. దీనివల్లే ఇది మల్టీపర్పస్ వెహికల్ అని పిలవబడుతుంది. తాజాగా కంపెనీ ఈ కారుకు సంబంధించిన అమ్మకాల వివరాలను విడుదల చేసింది. ఆ డేటా ఎలా ఉందో ఈ కథణంలో తెలుసుకుందాం.

మారుతి సుజుకి ఈకో భారత మార్కెట్‌లో ఎప్పటికప్పుడు తన ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటూ వస్తోంది. 2025 ఆగస్టులో 10,785 యూనిట్ల అమ్మకాలతో ఈ వాహనం మళ్లీ 10,000 మార్కును దాటింది. ఇది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు, ఈ మోడల్ పట్ల ప్రజల నమ్మకం, విశ్వాసం ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. జూలై 2025లో 12,341 యూనిట్లు అమ్ముడవగా, ఆ సంఖ్య ఆగస్టులో కొంచెం తగ్గింది.

Maruti Suzuki Eeco August 2025 Sales Reported 10785 Units Details

అయితే, 2024 ఆగస్టులో విక్రయించిన 10,985 యూనిట్లతో పోల్చితే ఈ కారు తన ప్రజాదరణను నిలబెట్టుకున్నదని చెప్పొచ్చు. ఈకోకు ఉన్న ప్రధాన బలం దాని ఉపయోగాలు, పోటీ ధర, ప్రయోజనం. కుటుంబ అవసరాల కోసం ఉపయోగించే వాహనంగా మాత్రమే కాకుండా, వాణిజ్య అవసరాలకు కూడా ఈకో సరైన ఎంపికగా నిలుస్తోంది. 6-సీటర్ బడ్జెట్ MPVగా ఇది వినియోగదారుల అంచనాలకు తగ్గట్టే కాకుండా, కొన్నిసార్లు వాటిని మించిపోయే పనితీరును కూడా చూపిస్తుంది.

పెద్ద లగేజ్ స్పేస్, ఫ్లెక్సిబుల్ ఇంటీరియర్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఈ వాహనం మధ్యతరగతి కుటుంబాల నుండి చిన్న వ్యాపారాల వరకు అందరికీ అందుబాటులో ఉంది. అదనంగా, మారుతి బ్రాండ్ నమ్మకం, దేశమంతటా ఉన్న విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్ ఈ మోడల్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. అందుకే, కొత్త మోడళ్ల పోటీ ఉన్నా కూడా ఈకో తన స్థాయిని కోల్పోకుండా, మార్కెట్‌లో నిరంతరంగా విజయవంతమవుతూ వస్తోంది.

Maruti Suzuki Eeco August 2025 Sales Reported 10785 Units Details

ప్రస్తుతం రూ. 5.70 లక్షల నుంచి రూ. 6.96 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య బేస్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఫ్యామిలీ యూజ్‌కి మాత్రమే కాకుండా, కమర్షియల్ యూజ్‌కి కూడా ఈ వాహనం పర్ఫెక్ట్ ఎంపికగా నిలుస్తోంది. ఇక ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఈకో 1.2-లీటర్ పెట్రోల్ మరియు CNG ఇంజిన్‌లతో లభిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఇది జతచేయబడుతుంది.

పెట్రోల్ వేరియంట్‌లో ఈ ఇంజిన్ 80.76 PS పవర్, CNG మోడ్‌లో 71.65 PS పవర్‌ను అందిస్తుంది. మైలేజీ విషయంలో బడ్జెట్ బెస్ట్‌గా ఉంటుంది. పెట్రోల్ మోడల్ 19.71 kmpl మైలేజీ ఇస్తే, CNG మోడల్ 26.78 km/kg మైలేజీని అందిస్తోంది, ఇది వ్యాపార అవసరాల కోసం మరింత ఆదా చేసేలా చేస్తుంది. డిజైన్ సింపుల్‌గా ఉన్నప్పటికీ, ప్రాక్టికల్‌గా ఉంది. కొత్త ఈకో వ్యాన్ 5/6 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది.

Maruti Suzuki Eeco August 2025 Sales Reported 10785 Units Details

ఎక్కువ లగేజీ అవసరాల కోసం 275 లీటర్ల బూట్ స్పేస్ కూడా అందిస్తుంది. భద్రతా అంశాల విషయానికి వస్తే, మారుతి ఈసారి ఈకోలో మరింత ఆధునిక ఫీచర్లను జోడించింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), అలాగే ఫ్రంట్ సీట్‌బెల్ట్ రిమైండర్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఈకోను ఒక సురక్షితమైన, నమ్మదగిన వాహనంగా నిలబెడుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, September 4, 2025, 13:41 [IST]
English summary
Maruti suzuki eeco august 2025 sales reported 10785 units details
Read more on: #magneti marelli #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+