తక్కువ ధరలో 7- సీటర్ కారు కోసం చూస్తున్నారా? జనాలు అందరూ ఇదే కావాలంటున్నారు!
భారత్‌లో 7- సీటర్ కార్ల వినియోగం పెరుగుతోంది. ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లేందుకు.. పెద్ద కారు అయితే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు. అందుకే ఏరి కోరి మరీ వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే సాధారణ కార్ల కంటే.. వీటి ధరలు అధికంగా ఉండడం చాలామందిని కొనుగోలులో వెనుకడుగు వేసేలా చేస్తోంది. ఇలాంటి సమస్యకు సమాధానం చెబుతూ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి.. తమ ఎర్టిగా మోడల్ కారును అందుబాటు ధరలో తీసుకువచ్చింది. దీన్ని "వ్యాల్యూ ఫర్ మనీ" కారుగా చెప్పొచ్చు. అధునాతన ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. పూర్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం.
టయోటా ఇన్నోవా క్రిస్టా మోడల్ కారుకు ప్రత్యామ్నాయంగా ఈ మారుతి సుజుకి ఎర్టిగా కారును చెప్పవచ్చు. దీని ఎక్స్-షోరూం ధర రూ.8.69 లక్షల నుంచి రూ.13.03 లక్షల మధ్య ఉంటుంది. ఇది LXi, VXi, ZXi, ZXi+ అని నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. దీంట్లో VXi, ZXi వేరియంట్లు.. CNG kit ఆప్షన్‌తో వస్తాయి. అందువల్ల ఈ కారు భారీ మైలేజీని ఇస్తుంది.

ఇంత తక్కువ ధరలో లభించే 7-సీటర్ కారు మారుతి ఎర్టిగా మాత్రమే అని చెప్పవచ్చు. దీంట్లో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, హిల్- హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), ISOFIX చైల్డ్ సీట్ యాంకరోజేస్ ఉంటాయి. మెరుగైన సేఫ్టీ కోసం దీంట్లోని టాప్ వేరియంట్లలో అదనంగా సైడ్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. దీంతో కలిపి మొత్తం 4 ఎయిర్ బ్యాగులు ఉంటాయి.
ఇక ఈ కారు 2019లో గ్లోబల్ NCAP టెస్టులో.. అడల్ట్, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 3- స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. దీని ఇంజిన్ విషయానికి వస్తే ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది 5- స్పీడ్ MT లేదా 6-speed ATతో అనుసంధానించి ఉంటుంది. CNG పవర్‌తో వచ్చే కారులో ఇంజిన్ ఎక్స్‌క్లూజివ్‌గా 5-Speed MT తో వస్తుంది.

ఈ కారు మైలేజ్ విషయానికి వస్తే పెట్రోల్ MTతో లీటర్‌కు 20.51 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుందని మారుతి సంస్థ చెబుతోంది. పెట్రోల్ ATతో 20.3 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుండగా.. CNG MTతో 26.11 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. ఇక ఈ కారు ఫ్రీజర్ల విషయానికొస్తే ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉంటుంది. అది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేస్తుంది.
దీని ప్రత్యర్థి సంస్థల కార్లతో పోలిస్తే ఈ ఎర్టిగాలో ఫీచర్లు పెద్దగా ఉన్నాయని చెప్పలేము. కానీ అవసరమైనవి మాత్రం ఇందులో ఉన్నాయి. దీంట్లోనే టాప్ వేరియంట్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో, ప్యాడిల్ సిస్టర్స్ (AT), క్విజ్ కంట్రోల్, ఆటో AC, పుష్ బటన్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్, ఆటోమేటిక్ హెడ్ లైట్స్, సెకండ్ రోలో AC వెంట్స్, 6- స్పీకర్ సౌండ్ సిస్టం ట్యూన్ బై Arkamis వంటివి ఉంటాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








