7 సీటర్ కార్లలో బెస్ట్‌ ఇదే.. పెద్ద ఫ్యామిలీలకు మంచి ఛాయిస్, 26.11 కిమీ మైలేజీ!

2024 క్యాలెండర్ ఇయర్‌లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఫలితాలు.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి. దీనికి కారణం 40 ఏళ్లుగా టాప్‌లో ఉన్న మారుతి సుజుకి మరోసారి బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. ఎక్కువగా అమ్ముడైన టాప్ 10 కార్లలో ఎస్‌యూవీలే అధికంగా ఉన్నాయి. 2024 బెస్ట్ సెల్లింగ్‌గా నిలిచిన 10 కార్లలో 5 కార్లు ఎస్‌యూవీలే ఉండగా... మిగతా మూడు హ్యాచ్‌బ్యాక్స్‌, ఒక ఎంపీవీ, ఒక సెడాన్ కారు.. టాప్ 10లో ఉన్నాయి. అయితే మరి ఈ కార్లలో గతేడాది బెస్ట్ సెల్లింగ్ 7- సీటర్ కారుగా నిలిచిన కారేంటో చూసేద్దాం.

కొవిడ్ తర్వాత దేశంలో కార్లు వినియోగించే కుటుంబాల సంఖ్య పెరిగింది. ఫ్యామిలీ అంతా కలిసి ట్రావెల్ చేయడానికి అనుగుణంగా ఉండేలా అధిక సీట్లతో ఉండే వాహనాలను కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎస్‌యూవీ అయినా, ఎంపీవీ అయినా 7 సీటర్‌ను చూసి కొంటున్నారు. గతేడాది 7 సీటర్లలో మారుతి సుజుకి ఎర్టిగా బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. ఇదే ఎంపీవీ.. టాప్ 10 కార్లలో మూడో స్థానంలో నిలిచింది.

Maruti Suzuki Ertiga Best Selling MPV in 2024

2024 సేల్స్ గణాంకాలను పరిశీలిస్తే.. టాటా పంచ్ కారు 2,02,031 యూనిట్ల అమ్మకాలతో బెస్ట్ సెల్లింగ్ కారుగా టాప్ ప్లేస్‌లో నిలిచింది. మారుతి సుజుకి వ్యాగన్‌ ఆర్‌ 1,90,855 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానంలో నిలిచింది. ఎర్టిగా కారు...1,90,091 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానం సాధించింది.

ఇక 7 సీటర్ సెగ్మెంట్‌లో ఎర్టిగా తర్వాత మహీంద్రా స్కార్పియో.. 1,66,364 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇది ఎర్టిగా కంటే 23,727 యూనిట్ల అమ్మకాలు తక్కువ. గతేడాది ఎర్టిగాకు మంచి లాభాలు దక్కాయి. గతేడాది ఓ నెలకుపైగా ఈ మారుతి సుజుకి ఎర్టిగా ఎంపీవీ మొత్తం సేల్స్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగింది.

Maruti Suzuki Ertiga Best Selling MPV in 2024

ఈ కారు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 103PS పవర్, 137 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రెండు ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ కారు 20.51 kmpl మేలేజీ అందిస్తుంది. ఈ కారు.. సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లోనూ అందుబాటులో ఉంది. సీఎన్‌జీలో ఈ కారు 87 bhp పవర్, 121.5 Nm టార్క్ మాత్రమే అందిస్తుంది.

ఇక పవర్ విషయంలో కాస్త తక్కువే ఉన్నప్పటికీ సీఎన్‌జీ మోడల్ కారు.. మంచి ఫ్యూయల్ ఎఫీషియన్సీ అందిస్తుంది. ఇది 26.11 kmpl మైలేజీ ఇవ్వగలదు. ఈ మారుతి ఎర్టిగా కారు 9 ఇంచెస్‌ బిగ్‌ టచ్‌ స్క్రీన్ ఇన్పోటెయిన్మెంట్ సిస్టమ్‌, స్మార్ట్‌ప్లే‌ప్రో టెక్నాలజీ ఉంటుంది. వాయిస్ కామెంటరీ, కనెక్టెడ్ కార్ ఫీచర్లు వంటివి ఇందులో ఉంటాయి.

Maruti Suzuki Ertiga Best Selling MPV in 2024

ఇందులో కనెక్టెడ్ కారు ఫీచర్లలో వెహికిల్ మానిటరింగ్, tow away అలర్ట్, జియో- ఫెన్సింగ్, ఓవర్ స్పీడ్ అలర్ట్, రిమోట్ ఫంక్షన్లు వంటివి ఉంటాయి. సేఫ్టీ కోసం 360 డిగ్రీ సరౌండెడ్ వ్యూ కెమెరా ఇందులో ఉంటుంది. ప్యాడెల్ షిఫ్టర్లు, ఆటో హెడ్‌లైట్లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి సదుపాయాలు ఎర్టిగా కారులో ఉంటాయి.

దీని ప్రారంభ ధర రూ.8.69 లక్షలుగా ఉంది. ఇందులో టాప్- ఎండ్ వేరియంట్ ధర రూ.13.03 లక్షలుగా ఉంది. ఈ సెగ్మెంట్లో ‌ఎర్టిగా కారుకు.. మారుతీ సుజుకీ XL6, కియా కారెన్స్, మహీంద్రా మరాజో, టయోటా రుమియాన్, రెనాల్ట్ ట్రైబర్ ఎంపీవీ పోటీగా ఉన్నాయి. 7 సీటర్ ఎస్‌యూవీలైన మహీంద్రా స్కార్పియో, బోలెరో వంటివి కూడా ఈ కారుకు పోటీ ఇస్తాయి.

More from DriveSpark

Article Published On: Sunday, January 12, 2025, 8:30 [IST]
English summary
Maruti suzuki ertiga became bestselling 7 seater car in 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+