రూ.8.96 లక్షలకే 7 సీట్ల కారు! రెండు కుటుంబాలు హ్యాపీగా వెళ్లచ్చు.. మీ ఇంట్లోకి ఈ కారు రావాల్సిందే!

ఇండియాలో కుటుంబం ప్రేమానురాగాలకు ఎంతో విలువ ఇస్తారు. ఇంట్లో వాళ్లు అందరు కలిపి జరుపుకునే పండుగలు అయినా అది ప్రయాణాలకు అయిన ఎంతో సంతోషంగా ఉంటాయి. కరోనా తరువాత మారుతున్న కాలంలో ప్రస్తుతం కుటుంబం అంతా కలిసి ఒకే కారులో ప్రయాణించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మన దేశంలో చాలా మందికి కార్ అంటే, ఫ్యామిలీతో కలిసి ప్రయాణించేందుకు ఉపయోగపడే సాధనం. పండుగలు అయినా, శనివారం-ఆదివారం టూర్లు అయినా, పెద్ద కుటుంబం ఉంటే అందరినీ ఒకే వాహనంలో తీసుకెళ్లే కార్లకు ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది. షోరూమ్‌కు వచ్చేవారిలో చాలా మంది ఎక్కువ సీటింగ్ కలిగిన కార్లను అడుగుతున్నారు. అలాంటి వాటిలో ప్రముఖంగా వినిపించే కార్లలో మనకు వెంటనే గుర్తొచ్చే పేరు, మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) ప్రధానమైనది.

ఎర్టిగా అనేది 7 సీట్ల కారు. ఇది పర్యటనలకి సిద్ధంగా ఉన్న స్నేహపూరిత వాహనం. చిన్నపాటి పిక్నిక్‌కి అయినా, దైవదర్శనాలకి అయినా, రెండు కుటుంబాలు కలసి వెళ్లే సందర్భంలోనూ సరిపోయే వాహనం. అంతగా విశాలమైన ఇంటీరియర్ ఇది కలిగి ఉంటుంది. ఈ కారులో కూర్చునే ప్రతి వ్యక్తికీ సరిపడేంత లెగ్ రూమ్ ఉంటుంది. కేవలం ముందు ప్యాసింజర్లే కాదు, చివరి వరుసలో కూర్చున్నవాళ్లకూ ఏ మాత్రం అసౌకర్యం అనిపించదు.

Maruti Suzuki Ertiga

మూడవ వరుస సీట్లు కూడా ఉపయోగపడేలా డిజైన్ చేయబడ్డాయి, దీంతో పిల్లలు, వృద్ధులు సులభంగా ప్రయాణించగలుగుతారు. ఈ కారకు ఉన్న డిమాండ్‌ను రుజువు చేస్తూ ఎర్టిగా జూన్ 2025లో 14,151 యూనిట్లు అమ్ముడుపోయింది. దీంతో దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో నాలుగవ స్థానంలో నిలిచింది. ఒక్క నెలలోనే 14,151 యూనిట్లు అమ్ముడవడం అంటే ఈ కారుకు ఏ మేరకు ఆదరణ ఉందో అర్ధం అవుతుంది.

దీని ధర విషయానికి వచ్చేసరికి, బడ్జెట్‌కు తగిన మెరుగైన ఎంపికలతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ప్రారంభ బేస్ వేరియంట్ అయిన LXI ధర సుమారుగా రూ.8.96 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద మొదలవుతుంది. మరింత ఫీచర్లు కావాలనుకునే వారికి VXI, ZXI, ZXI (O) వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి టాప్ ఎండ్ వరకు రూ.13.25 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు కొనుగోలు చేయడానికి లభిస్తాయి.

Maruti Suzuki Ertiga Family Car

ఎర్టిగా కొనుగోలును పరిగణలోకి తీసుకునే ఇది రెండింటిలో, పెట్రోల్, CNG వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది వినియోగదారుడికి వారి అవసరాలకు తగ్గట్టు ఎంపిక చేసుకునే వెసులుబాటును ఇస్తుంది. ఈ కారులో ఉన్న 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 102 bhp పవర్‌ను, గరిష్టంగా 137 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిటీలోనూ, హైవేలోనూ సరైన బలాన్నిచ్చేలా డిజైన్ చేయబడింది.

డ్రైవింగ్ స్టైల్‌ను బట్టి, ట్రాన్స్మిషన్ ఎంపిక రెండు విధాలుగా ఉంటుంది , ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు, మరింత సౌలభ్యం కోరుకునే వారికి 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌ వెర్షన్ కూడా లభిస్తుంది. అలాగే, సిఎన్‌జీ వేరియంట్‌పై దృష్టి సారిస్తే, ఇది 87 bhp పవర్, 121.5 Nm టార్క్‌‌ను ఇవ్వగలదు. ముఖ్యంగా డైలీ యూజ్ కోసం, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణించాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక.

Maruti Suzuki Ertiga 7 Seater Car

మాన్యువల్ పెట్రోల్ వేరియంట్‌కి 20.51 కి.మీ/లీ మైలేజ్ వస్తే, అదే ఆటోమేటిక్ వేరియంట్‌కి 20.30 కి.మీ/లీ మైలేజ్‌ను అందిస్తుంది. సిఎన్‌జీలో మారుతి ఎర్టిగా 26.11 km/kg వరకు ఇస్తుంది. ఇక ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇది ఒక పూర్తి ఫ్యామిలీ MPV కావడం వలన దీనిలో అనేక ఫీచర్స్, ప్రయాణికుల రక్షణ కోసం అత్యుత్తమ సేఫ్టీ ప్రమాణాలను అందించారు.

More from DriveSpark

Article Published On: Sunday, July 27, 2025, 8:00 [IST]
English summary
Maruti suzuki ertiga best family car price engine mileage and all top things
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+