ఒక్క ఈ కారు ఉంటే బస్సు, రైలు వద్దంటారు! 27 కి.మీ మైలేజ్‌తో రెండు ఫ్యామిలీలకు ఫుల్ కంఫర్ట్.. సేల్స్‌లో దూకుడు!
మారుతి సుజుకి ఎర్టిగా పెద్ద కుటుంబాల కలల MPV. విశాలమైన ఇంటీరియర్, మంచి మైలేజ్‌తో ఇది భారతీయ వినియోగదారుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ప్రతీ నెలా దాని సేల్స్ ఒక కొత్త రికార్డు చెబుతున్నాయి. ఈ ఏడాది (జనవరి నుండి మే వరకు) ఎర్టిగా తన స్థిరమైన డిమాండ్‌ను నిలబెట్టుకుంటూ, ప్రతీ నెలా మెరుగైన అమ్మకాలను సాధిస్తుంది. తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం, ఎర్టిగా జూన్ 2025లో 14,151 యూనిట్లు అమ్ముడుపోయింది. దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో ఇది నాలుగవ స్థానంలో నిలిచింది. ఒక్క నెలలోనే 14,151 యూనిట్లు అమ్ముడవడం గర్వకారణం. దానికంటే ముందు స్థానాల్లో హ్యుందాయ్ క్రెటా (15,786 యూనిట్లు), మారుతి సుజుకి డిజైర్ (15,484 యూనిట్లు), మారుతి సుజుకి బ్రెజ్జా (14,507 యూనిట్లు) ఉన్నాయి.
ఎప్పటిలాగే ఎర్టిగా తక్కువ బడ్జెట్‌లో పెద్ద కుటుంబాలకు కారు కావాలనుకునే వారికి అత్యంత బెస్ట్ ఎంపికగా నిలుస్తోంది. ప్రతీ యూనిట్ దాని విశ్వసనీయతను, ప్రాక్టికల్ డిజైన్‌ను, అవసరాలకు సరిపడే సౌలభ్యాలను ప్రతిబింబిస్తోంది. ఈ అమ్మకాల ప్రయాణం ఎక్కడ ఆగిపోదని, రాబోయే రోజుల్లో మరిన్ని సేల్స్ పెరుగుదలకు దారితీస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ప్రతినెలా దాదాపు పదిహేను వేల యూనిట్ల పైగా అమ్మకాలను నమోదు చేసింది.

ప్రత్యేకంగా మే నెలలో ఈ MPV 16,140 యూనిట్లను విక్రయించి తన శక్తి చూపింది. దానికి ముందు ఏప్రిల్‌లో 15,780 యూనిట్లు, మార్చిలో 16,804 యూనిట్లు, ఫిబ్రవరిలో 14,868 యూనిట్లు, జనవరిలో 14,248 యూనిట్ల అమ్మకాలను సాధించడం విశేషం. ఎర్టిగా ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఒకే కుటుంబానికి కాకుండా రెండు కుటుంబాలకు సైతం ఆప్తంగా సరిపోతుంది. పెద్దవారి నుండి చిన్నవారి వరకు అందరూ కంఫర్ట్‌గా కూర్చోగలిగే స్థలాన్ని అందిస్తుంది.
ఈ MPV ధర విషయానికి వస్తే, ప్రారంభ బేస్ వేరియంట్ దాదాపు 8.96 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలుకుని టాప్ ఎండ్ వేరియంట్ రూ.13.25 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది క్రింది LXI, VXI, ZXI, ZXI (O) అనే వేరియంట్లు కొనుగోలుదారులకు బడ్జెట్‌కి తగినట్లు లభిస్తుంది. టాప్ వేరియంట్‌లో మరింత అధునాతన సౌకర్యాలు, సేఫ్టీ ఫీచర్లు పొందవచ్చు. 7 సీటింగ్ సామర్థ్యం వల్ల అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది.

సెలవుదినాల్లో లేదా వారాంతపు ప్రయాణాల్లో, పెద్ద కుటుంబాలు తమ లగేజీ కూడా సులువుగా తీసుకెళ్ళేందుకు 209 లీటర్ల బూట్ స్పేస్ అందిస్తుంది. అవసరమైతే రియర్ సీట్లు మడిచి ఇంకా ఎక్కువ నిల్వ స్థలాన్ని పొందవచ్చు. అలాగే 45 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉండటంతో దూర ప్రయాణాలకు చక్కగా సరిపోతుంది. దీనిలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు CNG వేరియంట్ కూడా ఉంది. ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారు దీన్ని ఎంచుకోవచ్చు.
వేరియంట్ ఆధారంగా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక చేసుకోవచ్చు, ఇది సిటీ డ్రైవింగ్‌కి, లాంగ్ రూట్స్‌కి ఇద్దరికీ సరైన అనుభూతిని ఇస్తుంది. మైలేజ్ విషయంలో, పెట్రోల్ వేరియంట్ 20.3 kmpl వరకు, CNG వేరియంట్ 26.11 km/kg వరకు ఇస్తుంది. ఇక ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇది ఒక పూర్తి ఫ్యామిలీ MPV అవ్వడం వెనక కారణాలు ఉన్నాయి.

ఎర్టిగాలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్, ఆటోమేటిక్ AC, ప్యాడిల్ షిఫ్టర్లు (ఆటోమేటిక్ వేరియంట్లలో), క్రూయిజ్ కంట్రోల్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. సేఫ్టీ కోసం, ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్) ఉన్నాయి.


Click it and Unblock the Notifications








