నెలకు రూ.20 వేలతో ఈ మంచి ఫ్యామిలీ కారును సొంతం చేసుకోండి.. రెండు కుటుంబాలు హాయిగా వెళ్లచ్చు
భారతీయ కుటుంబాల నమ్మకాన్ని అంతటా పొందిన మారుతీ ఎర్టిగా మరోసారి తన సత్తాను నిరూపించుకుంది. మే 2025 అమ్మకాల గణాంకాల ప్రకారం, ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడైన 7 సీట్ల కారుగా నిలిచింది. అనేక మోడళ్ల మధ్య తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ, ఎర్టిగా తనకున్న ప్రాముఖ్యతను మరోసారి రుజువు చేసింది. ఇంటీరియర్ పరంగా చూస్తే, ఇది ఒక విశాలమైన, సౌకర్యవంతంగా ఉంటుంది. చిన్న కుటుంబం నుంచి పెద్ద కుటుంబం వరకు అందరికీ సరిపోయేలా దీని సీటింగ్ అరేంజ్‌మెంట్‌ను డిజైన్ చేశారు. దీని మూడవ వరుస సీట్లు కూడా ప్రయాణికులకు తగిన స్థాయిలో కంఫర్ట్‌ను అందిస్తాయి. అందుకే, విహారయాత్రలు చేయాలన్నా, రోజువారీ ప్రయాణాలకైనా ఇది సరైన ఎంపికగా నిలుస్తోంది.
మైలేజ్ విషయానికొస్తే, పెట్రోల్, సీఎన్‌జీ రెండింటిలోనూ లభించే ఈ కారు, కొద్ది ఖర్చుతో ప్రయాణించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. పెట్రోల్ వేరియంట్ అటు పవర్, ఇటు మైలేజ్‌కు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సీఎన్‌జీతో మరింత ఎక్కువ మైలేజ్ పొందవచ్చు. ఈ కారుకు ఉన్న డిజైన్ కూడా పూర్తి ఫ్యామిలీ కార్‌గా అనిపిస్తుంది. ఇది మార్కెట్లో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ కారు గురించిన EMI వివరాలను ఈక కథనంలో ఇవ్వడం జరిగింది.

మారుతీ సుజుకీ ఎర్టిగా బేస్ వేరియంట్ Lxi(O) పేరుతో వస్తుంది. దీని ఆన్‌రోడ్ ధర సుమారుగా రూ.10.66 లక్షల వరకు ఉంటుంది. ప్రధాన జాతీయ బ్యాంకులు వడ్డీ రేటు 9.8 శాతం అందిస్తున్నాయి. దీని ప్రకారం, ఐదు సంవత్సరాల (60 నెలలు) కాలానికి లోన్ తీసుకుంటే, మొదటగా ఒక లక్ష రూపాయలు వరకు డౌన్ పేమెంట్ చెల్లించినట్లయితే మిగిలిన అమౌంట్‌పై వడ్డీ ప్రకారం, 60 నెలల కాలానికి చెల్లించాల్సి ఉంటుంది.
మొత్తం అమౌంట్‌లో లక్ష రూపాయలు వరకు చెల్లించిన తరువాత రూ.9.66 లక్షల వరకు ఉంటుంది. దీనికి వడ్డీ రేటు 9.8 శాతం ప్రకారం, ప్రతి నెలా సుమారుగా రూ.20,430 EMI చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం అమౌంట్‌తో పోల్చుకుంటే మీరు దాదాపుగా రూ.2.58 లక్షల వరకు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, వడ్డీ రేటు, డౌన్ పేమెంట్ మొత్తం మీ క్రెడిట్ చరిత్రపై ఆధారపడి ఉంటుందని గమనించాలి.

దీని టాప్ ఎండ్ వేరియంట్ VXI AT(ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్) (పెట్రోల్) వేరియంట్ ఆన్‌రోడ్ ధర దాదాపుగా రూ.14 లక్షల వరకు ఉంటుంది. దీనికి మొదటగా డౌన్‌పేమెంట్ రూ.2 లక్షలు చెల్లించినట్లయితే మిగిలిన మొత్తం రూ.12 లక్షలు ఉంటుంది. ఈ మొత్తంపై 9.8 శాతం ప్రకారం లెక్కగట్టి మీరు 6 ఏళ్లు అంటే 72 నెలలు EMI ఆప్షన్ ఎంచుకున్నట్లయితే మీరు ప్రతి నెలా దాదాపుగా రూ.22,110 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన విషయం ఏమిటంటే పైన పేర్కొన్న EMI తాలుకు పూర్తి వివరాల కోసం మీ దగ్గరలోని మారుతీ డీలర్‌షిప్ సిబ్బందిని సంప్రదించగలరని మా మనవి. ఈ కారు గురించి చూసినట్లయితే, మారుతీ ఎర్టిగా ఒక పూర్తి 7 సీటర్ MPVగా మార్కెట్లో తన స్థానాన్ని కాపాడుకుంటోంది. రోజువారీ ప్రయాణాలకే కాదు, కుటుంబం మొత్తం కలిసి చేసే లాంగ్ డ్రైవ్‌లకు కూడా సరైన ఎంపికగా నిలుస్తోంది.

ఎర్టిగా లోపలి భాగాన్ని ఓసారి పరిశీలిస్తే, టెక్నాలజీతో నిండి, ప్రయాణికులకు కావాల్సిన అన్ని సౌకర్యాలతో రూపొందించబడిన ఇంటీరియర్ కనిపిస్తుంది. మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, స్మార్ట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు కారులో ప్రయాణాన్ని మరింత సౌకర్యంగా మార్చేస్తాయి. సీటింగ్ కూడా విశాలంగా ఉండటంతో, తక్కువ స్థలంలో ఎక్కువమంది కూర్చొనే అవకాశం ఉంది.
ఇంజిన్ పరంగా ఇది 1.5-లీటర్ శక్తివంతమైన పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 103 PS పవర్, 137 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ స్మూత్, రెస్పాన్సివ్ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. మైలేజ్ విషయంలో కూడా ఎర్టిగా మంచి ఎంపిక. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 20.51 కిలోమీటర్ల మైలేజీ అందిస్తే, CNG వేరియంట్ దాదాపు 26.11 కిలోమీటర్ల మైలేజీని ఇస్తూ ఖర్చుతో కూడిన ప్రయాణాన్ని అనుకూలంగా మార్చుతోంది.


Click it and Unblock the Notifications








