అందరూ కొంటున్న కారు ధర పెరిగింది.. ఇక ఆ కారు కొనాలంటే కొంచెం కష్టమే! ప్రస్తుత ధర ఎంతంటే?

దేశంలో కార్ల వినియోగం పెరుగుతోంది. గ్రామాల నుంచి నగరాల వరకు కారు కంపల్సరీ అన్నట్లుగా మారిపోయింది. మధ్యతరగతి వారికి కారు కొనడం ఓ కల. పరిమితమైన ధరలో మంచి ఫీచర్లు ఉన్న కారు కొనాలని వారు ఎదురు చూస్తుంటారు. పెద్ద ఎస్‌యూవీలు, ప్రీమియం ఎంపీవీలను కొనడం అంటే వారికి తలకు మించిన భారమే! ఇలాంటి వారిని సంతృప్తి పరిచేందుకు మారుతి సుజుకి సంస్థ తీసుకువచ్చిన ఎంపీవీ ఎర్టిగా. ఫ్యామిలీ కోసం ఈ కారు చక్కగా సరిపోయే కారు అందుబాటు ధరలో ఉంటుంది. అయితే మారుతీ సంస్థ ఇప్పుడు ఈ కారు కొనాలనుకునేవారికి షాక్ ఇచ్చింది. దీని ధరను రూ.15,000 మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇక ఇప్పుడు కారు కొనాలంటే ఎంత ఖర్చు చేయాలి? ఈ కారులో ఉండే ప్రత్యేకతలేంటో చూసేద్దాం.

మారుతి సుజుకి ఎర్టిగా.. దేశంలో బాగా పాపులర్ అయిన ఎంపీవీల్లో ఒకటి. అందుబాటు ధరలో ఉంటూ అధునాతన ఫీచర్లతో వస్తుంది. భారత మార్కెట్‌లో దీని సేల్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఎంపీవీ రూ. 15,000 మేర ధర పెంచడం.. వినియోగదారులను నిరాశపరిచింది. ఈ కారు రూ. 8.69 లక్షల నుంచి రూ.13.03 లక్షల మధ్య ఎక్స్- షోరూమ్ ధరలో ఉంటుంది.

Maruti Suzuki Ertiga Price hike

మారుతి సుజుకి 2024 డిసెంబరు నెల అమ్మకాల నివేదిక విడుదలైంది. ఈ రిపోర్ట్ ప్రకారం డిసెంబరు నెలలో ఈ కారు 16,056 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అంతకుముందు ఏడాది 2023లో డిసెంబరులో ఈ సంఖ్య 12,975 మాత్రమే. అంటే.. డిసెంబరు నెల విక్రయాల్లో ఈ కారు 24శాతం వృద్ధి సాధించింది. 7 సీటర్‌ అమ్మకాల్లోనూ ఇది రారాజుగా ఉంది.

ఈ మారుతి సుజుకి ఎర్టిగా ఎంపీవీలో ఏడుగురు హాయిగా ప్రయాణించవచ్చు. దీంట్లో 209 లీటర్ల బూట్‌స్పేస్ ఉంటుంది. దీని ద్వారా ట్రిప్ సమయంలో ఎక్కువ లగేజ్‌ను ఈ కారు క్యారీ చేయవచ్చు. అందువల్ల కస్టమర్లు ఈ కారుని మాత్రమే ఎంచుకుంటున్నారు. ఈ కారు Metallic Magma Grey, Pearl Midnight Black, Pearl Arctic White సహా 7- మోనోటోన్ కలర్స్‌లో ఉంటుంది.

Maruti Suzuki Ertiga New Price

ఈ కారులో ఫీచర్లు కూడా భారీగానే ఉన్నాయని చెప్పవచ్చు. దీంట్లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం, వైర్లైస్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ప్యాడిల్ షిఫ్టర్లు, క్రూయిజ్ కంట్రోల్, ఆటో AC వంటివి ఉంటాయి. ఈ ఫీచర్లు ప్రయాణికులకు సౌకర్యవంతమైన అనుభూతిని కలిగిస్తాయి. ఈ కారులో సేఫ్టీ ఫీచర్లకు కూడా కొదవ లేదు. దీంట్లో 4 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం), రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి.

ఇది కియా కారెన్స్, మహీంద్రా మరాజో ఎంపీవీ వంటి వాటికి ఈ ఎర్టిగా మోడల్ గట్టి పోటీగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ కారు పెట్రోల్, సీఎన్‌జీ పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ మోడల్ విషయానికి వస్తే దీంట్లో ఒక లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 103 PS గరిష్ఠ పవర్, 107 Nm గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Maruti Suzuki Ertiga Features and Mileage

సీఎన్‌జీ మోడ్‌లో ఉండే సేమ్ ఇంజిన్... 88 PS పవర్, 121.5 Nm గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు వేరియంట్‌ను బట్టి.. 5- స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6- స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో ఉంటుంది. దీంట్లో పెట్రోల్ వేరియంట్ 20.3 నుంచి 20.51 కేఎంపీఎల్ మైలేజీ అందిస్తుండగా.. సీఎన్‌జీ వెర్షన్ 26.11 కి.మీ.ల మైలేజీ అందించగలదు.

More from DriveSpark

Article Published On: Monday, January 27, 2025, 7:20 [IST]
English summary
Maruti suzuki ertiga mpv price hiked check new fare details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+