రూ.8.84 లక్షలకే 7-సీటర్.. రెండు కుటుంబాలు కలిసి హ్యాపీగా వెళ్లచ్చు.. దీని కోసం షోరూమ్‌ ముందు జనాల క్యూ

ఇండియాలో ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రయాణించడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. చిన్న కుటుంబం గల వారికి అయితే హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు అనుకూలంగా ఉంటాయి. అదే పెద్ద కుటుంబం ఉన్న వారికి ఎక్కువ సీటింగ్ కెపాసిటీ కలిగిన మోడళ్లు బాగా సెట్ అవుతాయి. దేశంలో ఏడుగురు సభ్యుల కుటుంబం కోసం సరైన కారును ఎంపిక చేయాలంటే, మొదట గుర్తొచ్చే పేరు మారుతీ సుజుకీ ఎర్టిగా (maruti suzuki ertiga). ఇది కేవలం ఒక కారే కాదు, రెండు కుటుంబాలు కలిసి ప్రయాణాలు చేయడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అందరూ కలిసి దైవదర్శనాలు, లేదా ఇతర టూరింగ్ స్థలాలకు వెళ్లాలనుకుంటే ఈ కారు బెస్ట్ ఆప్షన్. విశాలమైన ఇంటీరియర్ దీని సొంతం. పైగా అందరు కొనగలిగే విధంగా అందుబాటు ధరలో లభిస్తూ, మంచి మైలేజ్ అందిస్తుంది.

టయోటా ఇన్నోవా లాంటి ప్రీమియం MPVని అందరు కొనలేరు. అలాంటప్పుడు, తక్కువ మెయింటనెన్స్‌తో, మారుతీ బ్రాండ్ నమ్మకంతో, దేశవ్యాప్తంగా విస్తరించిన సర్వీస్ నెట్‌వర్క్‌తో ఎర్టిగా అగ్రస్థానంలో నిలుస్తోంది. దీనికి నిదర్శనంగా 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ కారు ఏకంగా 1,90,974 యూనిట్లు అమ్మకాలను సాధించింది. ఏటా లక్షల యూనిట్లు అమ్ముడవుతుండటంతో, ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడైన MPVల జాబితాలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

Maruti Suzuki Ertiga Mpv Sales

నివేదిక ప్రకారం, 2024 క్యాలెండర్ సంవత్సరంలో హ్యాచ్‌బ్యాక్ మోడల్ వ్యాగన్ఆర్ తర్వాత మారుతీ సుజుకీ నుంచి అత్యధికంగా అమ్ముడైన మోడల్ ఎర్టిగా నిలిచింది. గత ఏడాది ఈ ఎంపీవీ 1,90,091 యూనిట్ల అమ్మకాలను నివేదించింది. అదే ఆర్థిక సంవత్సరం 2025లో 1,90,974 మంది ఈ కారును తమ సొంతం చేసుకున్నారు. దీంతో ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 మధ్య ఎంపీవీ సెగ్మెంట్‌లో ఎర్టిగా బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది

ఈ గణంకాలతో గత ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో అత్యధికంగా అమ్మకాలను సాధించిన టాప్ 10 కార్ల లిస్ట్‌లో ఎర్టిగా నాల్గవ స్థానాన్ని సాధించడం విశేషం. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కియా కారెన్స్, టయోటా ఇన్నోవా క్రిస్టా లాంటి పటిష్టమైన పోటీదారులు ఉన్నప్పటికీ, ఎర్టిగా ఈ విభాగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని తన సత్తాను చాటుకుంది. మారుతీ సుజుకీ బ్రాండ్‌పై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఇది నిరూపిస్తుంది.

Maruti Suzuki Ertiga Mpv

మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసే బడ్జెట్ ధరలో లభించడం, విశాలమైన ఇంటీరియర్, టూర్స్ లాంటి వాటికి వెళ్లే సమయంలో ఎక్కువ లగేజీ పెట్టుకోవడానికి సరిపడినంత బూట్ స్పేస్, అత్యాధునిక ఫీచర్స్, ఆకర్షించే డిజైన్ ఇవన్నీ కూడా 7-సీటర్ ఎర్టిగా‌ను ఇంత పెద్ద స్థాయికి తీసుకువచ్చాయి. ఈ కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 102 bhp పవర్, 37 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌‌ను దీని ఇంజిన్‌కు జోడించారు. పెట్రోల్ మాన్యువల్ మైలేజ్ 20.51 కి.మీ/లీ గా ఉంది, అదే పెట్రోల్ ఆటోమేటిక్ 20.30 కి.మీ/లీ గా ఉంటుంది. CNG ఆప్షన్‌ను చూసినట్లయితే 87 bhp పవర్, 121.5 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Maruti Suzuki Ertiga Mpv Recorded 190974 Sales

ఇది 26.11 కి.మీ మైలేజీని ఇస్తుంది. ఈ వేరియంట్ మాత్రం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌‌లో అందుబాటులో ఉంది. మారుతీ ఎర్టిగా ధర విషయానికి వస్తే, ప్రారంభ ధర రూ.8.84 లక్షల నుంచి రూ.13.13 లక్షల వరకు ఉంటుంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ వచ్చే సరికి కాస్త ఎక్కువగా ఉండనుంది. ఏప్రిల్ 8 నుంచి ధర మారుతుంది. నాలుగు శాతం వరకు ధర పెంపుదలతో రూ.12,500 వరకు పెరగనుంది.

More from DriveSpark

Article Published On: Friday, April 4, 2025, 11:05 [IST]
English summary
Maruti suzuki ertiga mpv recorded 190974 sales units in fy2025 more details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+