అతి తక్కువ ధరలో 7 సీటర్.. దేశంలో జనాలు అందరూ ఇదే కావాలంటున్నారు! 27 కి.మీ మైలేజ్

మారుతి సుజుకి ఎర్టిగా (maruti suzuki ertiga) భారత కుటుంబాల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రసిద్ధ MPV. సరళమైన డిజైన్, విశాలమైన ఇంటీరియర్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ కలిసి ఎర్టిగాను అత్యంత నమ్మకమైన ఫ్యామిలీ కారుగా నిలబెట్టాయి. 2025 అక్టోబర్ నెలలో కూడా ఈ కారు తన అమ్మకాల శక్తిని మరోసారి నిరూపించింది. మొత్తం 20,087 యూనిట్లు డెలివరీ అవడం ద్వారా, గత ఏడాది ఇదే నెలలో నమోదైన 18,785 యూనిట్లను దాటుకుంది. ఏడాదికి ఇది మంచి అద్భుతమైన వృద్ధిగా నిలిచింది. ఎర్టిగా అమ్మకాలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఒక సరిగ్గా సరిపడే ఫ్యామిలీ MPV కావడం ప్రధాన అంశం.

పెద్ద కుటుంబాలు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు ఇది ఉత్తమ ఎంపికగా భావించబడుతోంది. దీపావళి పండుగ సీజన్‌లో వాహనాల కొనుగోలు ఎక్కువగా ఉండడం సహజమే. ఈ సందర్భంగా ఎర్టిగా చాలా మందికి ఇష్టమైన ఎంపికగా మారింది. ఇంకా మరో ముఖ్యమైన కారణం GST సవరణ. సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చిన పన్ను సవరణలతో ఎర్టిగా ధర తగ్గడం, కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా మారింది.

Maruti Suzuki Ertiga October 2025 Sales Recorded 20087 Units

ధర తగ్గడం మాత్రమే కాదు, ఫీచర్లు, మైలేజ్, నమ్మకమైన బ్రాండ్ ఇమేజ్ అన్నీ కలిసి డిమాండ్‌కు దోహదపడ్డాయి. ఈ అన్ని అంశాలతో, అక్టోబర్‌లో ఎర్టిగా అమ్మకాలు మరింత వేగం అందుకున్నాయి. మారుతి సుజుకి స్థిరమైన నాణ్యత, మెరుగైన ఆఫ్ట‌ర్-సేల్స్ సపోర్ట్, దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉండే సర్వీస్ నెట్‌వర్క్ వీటితో ఎర్టిగా మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. రాబోయే నెలల్లో కూడా ఎర్టిగా ప్రజాదరణ ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

మారుతి సుజుకి ఎర్టిగా ధర పరంగా కూడా వినియోగదారులకు ఎంతో చేరువలో ఉంటుంది. ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 8.80 లక్షల నుంచి ప్రారంభమవుతూ రూ. 12.94 లక్షల వరకు ఉండటంతో, వివిధ బడ్జెట్‌లకు సరిపోయే ఎంపికలుగా మారుతుంది. ఈ MPVని LXI, VXI, ZXI, ZXI(O) అనే నాలుగు వేరియంట్లలో అందించడం ద్వారా, కొనుగోలుదారుల అవసరాలు, ప్రాధాన్యతల ఆధారంగా సరైన ఎంపికను చేయడానికి మరింత అవకాశాన్ని కల్పించింది.

Maruti Suzuki Ertiga October 2025 Sales Recorded 20087 Units

పర్ఫార్మెన్స్ విషయంలో మంచి ప్రదర్శనను అందిస్తుంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది, 102 PS పవర్, 139 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రోజువారీ ప్రయాణాలు, దూర డ్రైవ్‌లు రెండింటికీ సరిపడే సాఫ్ట్, రిఫైన్డ్ డ్రైవ్ అనుభవం ఈ ఇంజన్ ప్రత్యేకత. ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మైలేజ్ విషయంలో 20.30 kmpl నుండి 20.51 kmpl వరకు ఇస్తుంది.

వ్యూయల్ వ్యయాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. 1.5-లీటర్ పెట్రోల్+CNG ఇంజన్ 87 PS పవర్, 121 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. ఈ వేరియంట్ అందించే 26.11 km/kg మైలేజ్ మరింత అందుబాటులో ఉండే ప్రయాణ అనుభవాన్ని కోరుకునే వారికి అద్భుత ఎంపికగా నిలుస్తుంది.

Maruti Suzuki Ertiga October 2025 Sales Recorded 20087 Units

ఇది ప్రధానంగా 7 సీటర్ కారు. రెండు కుటుంబాలు కలిసి హాయిగా జర్నీలు చేయవచ్చు. భద్రత విషయానికి వస్తే, కొత్త ఎర్టిగాలో ముందుగా 6 ఎయిర్‌బ్యాగులు అందుబాటులో ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. ABS, EBD వాహనం అత్యవసర బ్రేకింగ్ సమయంలో కూడా నిలకడగా ఉండేలా సహాయపడతాయి. ESP కారును మలుపుల్లో లేదా ప్రమాదకర పరిస్థితుల్లో స్థిరంగా ఉంచుతుంది. ఇవే కాకుండా ఇంకా అధునాతన ఫీచర్స్ ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, November 11, 2025, 11:55 [IST]
English summary
Maruti suzuki ertiga october 2025 sales recorded 20087 units
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+