అతి తక్కువ ధరలో 7 సీటర్.. దేశంలోనే బాగా డిమాండ్ ఉన్న కారు.. ఒక్కసారిగా షాక్ ఇచ్చిన జనాలు
మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) భారతదేశంలో చిన్న కుటుంబాల కోసం రూపొందించిన అత్యంత ఆదరణ పొందిన MPVగా నిలిచింది. ఇది రెండు కుటుంబాల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేపట్టగల సామర్థ్యంతో, మధ్యతరగతి కుటుంబాల నమ్మకమైన కారుగా మారింది. అంతేకాక, ఈ కారులోని ఇంటీరియర్ సౌకర్యాలు, సీటింగ్, ఉపయోగకరమైన క్యాబ్ డిజైన్ దీన్ని లాంగ్ ప్రయాణాలకూ, నగరంలో రోజువారీ ఉపయోగానికి కూడా తగినదిగా నిలిపాయి. ప్రతి నెలా, ఎర్టిగా స్మార్ట్ MPV కావడంతో, ఇది వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమే కాక, టాక్సీ వాహనాలుగా కూడా కొనుగోలు చేయబడుతుంది. ఏడు సీట్లు కలిగిన ఈ వాహనంలో ఒకేసారి ఎక్కువ మంది కలిసి ప్రయాణించవచ్చు. అందుకే దీనికి ఇతర MPVలతో పోలిస్తే ఎక్కువగా ప్రాధాన్యత పొందింది.
సర్వీస్, ధర, ఫీచర్ల పరంగా కూడా ఎర్టిగా నమ్మకమైన ఎంపిక. ఇటీవల కొత్త GST అమలు తర్వాత, కంపెనీ ఈ MPV ధరను గణనీయంగా తగ్గించిందని, తద్వారా అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి. కానీ సెప్టెంబర్ 2025లో విడుదలైన అమ్మకాల గణాంకాలు ఆశించిన ప్రతిఫలాన్ని చూపించలేదు. ఎర్టిగా గతంలో సాధించిన అత్యధిక అమ్మకాలను చూసి, ఈ నెలలో అది కొంత ఆందోళనకరమైన నష్టాన్ని ఎదుర్కొంది.

తాజా డేటా ప్రకారం, సెప్టెంబర్ 2025లో ఎర్టిగా 12,115 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరం అదే నెలలో 17,441 యూనిట్లతో పోలిస్తే దాదాపు 31% తగ్గుదలని సూచిస్తోంది. ఫలితంగా, అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో ఎర్టిగా మొదటి, రెండవ స్థానాల నుండి పదవ స్థానానికి పడిపోయింది. ఈ పరిస్థితి, MPV విభాగంలో పెరుగుతున్న పోటీ, వినియోగదారుల అభిరుచుల మార్పు, కొత్త మోడళ్ల విడుదలతో ఏర్పడింది.
నిపుణుల ప్రకారం, వినియోగదారులలో చాలా మంది సెప్టెంబర్ 22 తర్వాత ఎర్టిగాని కొనుగోలు చేయలాని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆ తేదీ నుంచి తగ్గిన కొత్త ధరలు అమల్లోకి రావడం. అయితే పండుగ సీజన్ ఈ MPV పై పెద్ద మార్జిన్ నష్టాన్ని భర్తీ చేయగలదని ఆశిస్తోంది. తగ్గిన ధరలను చూసినట్లయితే, ఈ కొత్త ధరల్లో, బేస్ LXI మాన్యువల్ వేరియంట్ ఇప్పుడు రూ. 8.80 లక్షలకు అందుబాటులో ఉంది.

ఇది మునుపటి ధర రూ. 9,11,500. VXI మాన్యువల్‌ను రూ. 9,85,300కి పొందవచ్చు, ఇది మునుపటి రూ. 10,20,500తో పోలిస్తే గణనీయమైన తగ్గింపు. ZXI మాన్యువల్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 10,91,500గా ఉంది, మునుపటి రూ. 11,30,500. CNG వేరియంట్లలో కూడా తగ్గింపు ఉంది, VXI CNG కొత్త ధర రూ. 10,76,300, మునుపటి రూ. 11,15,500. ZXI CNG ఇంటికి రూ. 11,82,500కు తీసుకురావచ్చు.
ఎర్టిగా MPVలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది, ఇది 103PS పవర్, 137Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ మోడల్ లీటరుకు 20.51 కిమీ మైలేజ్ ఇస్తే, CNG వేరియంట్ 26.11 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఈ స్థిరమైన పనితీరు, మంచి ఇంధన సామర్థ్యం, తక్కువ ధర కలిపి, ఎర్టిగా కుటుంబాల కోసం ఆర్థికంగా కూడా లాభదాయకమైన MPVగా నిలుస్తుంది.

ప్రస్తుతానికి మారుతి సుజుకి ఎర్టిగా అమ్మకాలు కాస్త తగ్గినప్పటికి, దసరా, దీపావళి పండుగల కారణంగా చాలా మంది తగ్గిన ధరలతో కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఎర్టిగా సేల్స్ కూడా గత నెలలో కంటే అక్టోబర్ నెలలో మరింత పుంజుకునే అవకాశాలు మెండుగా, ప్రస్తుత నెలకు సంబంధించిన సేల్స్ రావాలంటే ఈ నెల పూర్తయ్యే వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications








