నిన్న మొన్నటి వరకు మార్కెట్‌ను ఓ ఊపు ఊపేసింది.. కానీ..ఫిబ్రవరిలో మాత్రం దారుణంగా పడిపోయిన ఆ 7సీటర్ కారు సేల్స్
ఫ్యామిలీతో కలిసి లాంగ్ టూర్ వెళ్లాలని అనుకుంటున్నారా.. అందుకోసం తక్కువ ధరలో మల్టిపర్పస్ సెవెన్ సీటర్ కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే అలాంటి వాళ్లకు మారుతి సుజుకీ తయారు చేసిన ఎర్టిగా కారు(Maruti Suzuki Ertiga) బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఈ కారులో సౌకర్యవంతంగా ఏడుగురు కలిసి ప్రయాణించవచ్చు. అంతే కాదు దూర ప్రయాణాలకు ఈ కారు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మధ్య తరగతి వాళ్ల కారు కలను నెరవేర్చే మోడల్స్ లో మారుతి ఎర్టిగా ఒకటి. ఈ కారు బేసిక్ మోడల్ 12 లక్షలకే వస్తున్నందున ఇది వారికో మంచి ఆఫ్షన్ అని చెప్పవచ్చు.
ఆటోమొబైల్ ప్రపంచంలో మారుతి సుజుకి ఉన్న విశ్వసనీయత మరే బ్రాండ్‌కు లేదు. ఆ కంపెనీ బేసిక్ మోడల్స్ నుంచి అన్ని మోడల్స్‌కు భారీ డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. మన దేశంలోని అత్యంత సక్సెస్ ఫుల్ MPV కార్లలో ఎర్టిగా ఒకటి. ఈ కారుకు కొన్నాళ్లుగా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే ఎర్టిగా కారు సేల్స్ అదరగొట్టేస్తుంది. ఈ కారు రూ.8.84లక్షల నుంచి రూ.11.98లక్షల రేంజ్ లో లభిస్తుంది.

ఇందులో మొత్తం తొమ్మది వేరియంట్లు ఉన్నాయి. ఈ కారును కస్టమర్లు వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్‌గా భావిస్తారు. అందుకే మారుతి సుజుకి ఎర్టిగా ప్రతి నెలా భారీ అమ్మకాలను నమోదు చేస్తుంది. ప్రతి నెల సరికొత్త రికార్డులను చేస్తుంటుంది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో మాత్రం భారీ అమ్మకాలు ఉన్నప్పటికీ గత నెలతో పోల్చుకుంటే స్వల్ప క్షీణతను నమోదు చేసింది. ఫిబ్రవరిలో మారుతి సుజుకి 14,868 ఎర్టిగా కార్లను విక్రయించింది.
ఈ సంఖ్య గతేడాది అంటే 2024 ఫిబ్రవరిలో 15,519గా ఉంది. దానితో పోల్చుకుంటే ప్రస్తుతం 4శాతం తగ్గుదల నమోదైంది. ఈ సమాచారం ప్రస్తుత ఫిబ్రవరి 2025 నెల మారుతి సుజుకి ఎర్టిగా అమ్మకాల నివేదిక ద్వారా తెలుస్తోంది. ఇది స్వల్ప తగ్గుదల మాత్రమే కాబట్టి మారుతి సుజుకి ఎర్టిగా ఈ నెల అంటే మార్చి 2025 చివరి నాటికి వృద్ధి బాటలోకి తిరిగి వస్తుందని కంపెనీ అంచనా వేస్తుంది.

మారుతి సుజుకి ఎర్టిగా ఎంట్రీ-లెవల్ వేరియంట్, స్మార్ట్ హైబ్రిడ్ LXI (O) వేరియంట్ ధర భారత మార్కెట్లో కేవలం రూ. 8.84 లక్షలు మాత్రమే. దాని టాప్ వేరియంట్ అంటే స్మార్ట్ హైబ్రిడ్ ZXI+ AT వేరియంట్ ధర రూ. 13.13 లక్షల వరకు ఉంటుంది. ఇవి కేవలం ఎక్స్ షోరూం ధరలు మాత్రమే. ఈ కారు సీఎన్జీ వెర్షన్ లో కూడా లభిస్తుంది.
CNG వేరియంట్ కిలోకు గరిష్టంగా 26.11 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. ఈ కారు పెట్రోల్ వేరియంట్లు కూడా అద్భుతమైన మైలేజీని అందిస్తాయి. కానీ సీఎన్జీ వేరియంట్లతో పోలిస్తే, పెట్రోల్ వేరియంట్ల మైలేజ్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. మారుతి సుజుకి ఎర్టిగా పెట్రోల్/మాన్యువల్ వేరియంట్స్ లీటరుకు 20.51 కి.మీ మైలేజీని అందిస్తాయి. అలాగే పెట్రోల్/ఆటోమేటిక్ వేరియంట్స్ లీటరుకు 20.30 కి.మీ మైలేజీని అందిస్తాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








