టాటాకి ఇప్పుడు కొత్త పోటీ.. పెద్ద సంచలనం సృష్టించిన మరుతి తొలి ఈవీ కారు

మారుతి సుజుకి (maruti suzuki) పేరు వింటే చాలామంది మనసులో మొదట గుర్తుకు వచ్చేది అందుబాటు ధరలో కారు అనే మాటే. నిజానికి ఈ కంపెనీ దశాబ్దాలుగా భారతీయ కుటుంబాలకు బడ్జెట్‌ ఫ్రెండ్లీ కార్లను అందిస్తూ ఒక విశ్వాసాన్ని కల్పించింది. అయితే ఈ అందుబాటు ధరతో పాటు చాలా కాలంగా ఒక విమర్శ కూడా వెంటాడుతూనే వచ్చింది, మారుతి కార్లలో భద్రతా ప్రమాణాలు తక్కువ అని. రోడ్డుపై సౌకర్యం, మైలేజ్ బాగుండినా, క్రాష్ టెస్ట్‌లలో మాత్రం అంతగా రాణించలేకపోయాయని అనేక విమర్శలు వెల్లువెత్తాయి. కానీ కాలం మారింది. ఆటోమొబైల్ మార్కెట్‌లో పోటీ పెరిగింది. వినియోగదారులు ఇప్పుడు కేవలం మైలేజ్, లుక్‌ మాత్రమే కాకుండా, భద్రతను కూడా ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటున్నారు.

ఈ మార్పును బాగా అర్థం చేసుకున్న మారుతి సుజుకి, గత కొన్నేళ్లుగా తన కార్ల డిజైన్, నిర్మాణం, భద్రతా ఫీచర్లలో విశేషమైన మార్పులు చేసింది. ఫలితంగా ఇప్పుడు ఒకప్పుడు విమర్శకుల నోళ్లు తెరిచి విమర్శలు చేసిన వారే, ఇప్పుడు అదే నోరు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆటోమొబైల్ సంస్థలు నిర్వహించే క్రాష్ టెస్ట్‌లలో మారుతి సుజుకి కార్లు కొత్త కొత్త విజయాలను అందుకుంటున్నాయి.

Maruti Suzuki Evitara Scores 4 Star Safety Rating In Euro Ncap Crash

ముఖ్యంగా గ్లోబల్ NCAP నిర్వహించిన టెస్ట్‌లలో మారుతి డిజైర్ కారు పూర్తి 5 స్టార్ భద్రతా రేటింగ్ అందుకోవడం ఒక సంచలనంగా మారింది. ఈ కారు బడ్జెట్ సెడాన్‌గా మాత్రమే పరిగణించబడగా, ఇప్పుడు సేఫ్ ఫ్యామిలీ కారు అనే గుర్తింపును సంపాదించింది. ఇది మాత్రమే కాదు. ఇటీవల విడుదల చేసిన మారుతి సుజుకి విక్టోరిస్ కూడా భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ సాధించింది.

ఇది మారుతి ప్రతిష్టను మరింత పెంచడమే కాకుండా, వినియోగదారుల్లో మారుతి సేఫ్టీ విషయంలో రాజీ పడదు అనే నమ్మకాన్ని పెంచింది. ఇంతలోనే, మారుతి సుజుకి నుంచి వచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు eVitara కూడా సేఫ్టీ పరంగా తనదైన ముద్ర వేసింది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ అంటే కొత్త టెక్నాలజీ, కానీ భద్రత ఎలా ఉంటుందో? అన్న అనుమానాలు ఉన్నా, eVitara తన భద్రతా పనితీరు ద్వారా విమర్శకుల నోరు మూయించింది.

Maruti Suzuki Evitara Scores 4 Star Safety Rating In Euro Ncap Crash

మారుతి ఎలక్ట్రిక్ విభాగంలో కొత్త అడుగు వేస్తూ ఇ-విటారా మొదటి ఎలక్ట్రిక్ SUVని తయారు చేయడం ప్రారంభించింది. భారత మార్కెట్లో ఈ మోడల్ ఇంకా అధికారికంగా విడుదల కాలేదు కానీ, ఉత్పత్తి దేశంలోని ఫ్యాక్టరీల్లో ఇప్పటికే మొదలైంది. ఇదే కాకుండా, ఈ ఎలక్ట్రిక్ SUV కేవలం భారత మార్కెట్‌కే కాకుండా విదేశీ మార్కెట్లకూ ఎగుమతి చేయబడనుంది. అంటే, మేక్ ఇన్ ఇండియా కారు ప్రపంచ వేదికపై తన ప్రతిభను చూపించబోతోంది.

ఈ క్రమంలో, యూరో NCAP క్రాష్ టెస్ట్ కోసం భారతదేశంలో తయారైన ఇ-విటారా ఎలక్ట్రిక్ కారు పంపబడింది. సేఫ్టీ పరంగా ఈ కారు అంచనాలకు మించి ప్రదర్శన కనబరిచి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ సంపాదించింది. ఇది ఒక ఎలక్ట్రిక్ SUV కోసం చాలా గర్వించదగిన ఫలితం. అయితే, ఈ కారు ఎందుకు 5-స్టార్ రేటింగ్ పొందలేకపోయిందన్న ప్రశ్న వస్తే, దానికి ప్రధాన కారణం పెద్దల రక్షణలో వచ్చిన చిన్న తడబాటు.

Maruti Suzuki Evitara Scores 4 Star Safety Rating In Euro Ncap Crash

యూరో NCAP టెస్ట్‌లో ఇ-విటారా పెద్దల ప్రయాణికుల రక్షణలో 77 శాతం స్కోర్ చేసింది. ఇది 80 శాతం చేరి ఉండి ఉంటే, పూర్తి 5-స్టార్ రేటింగ్ దక్కేది. అయినా, 4-స్టార్ ఫలితం అంత తక్కువేమీ కాదు, ఇది ఒక అద్భుతంగానే పరిగణించబడుతుంది. అంటే, మారుతి సుజుకి ఇ-విటారా ఎలక్ట్రిక్ కారు తన భద్రతా ప్రమాణాలతో విమర్శకుల నోళ్లు మూయించి, వినియోగదారులకు సేఫ్ అండ్ ట్రస్టెడ్ అనే ముద్ర వేసినట్టే.

More from DriveSpark

Article Published On: Tuesday, September 9, 2025, 10:25 [IST]
English summary
Maruti suzuki evitara scores 4 star safety rating in euro ncap crash test
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+