పేద-మధ్యతరగతికి బంగారం లాంటి కారు.. రూ.5.70 లక్షలకే 6 మందికి బెస్ట్.. సేల్స్ అదుర్స్!
భారతీయ రోడ్లపై ప్రజలకు అందుబాటులో ఉంటూ, తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న వాహనాల్లో మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco) ఒక ప్రముఖమైన పేరు. వాణిజ్య అవసరాలు కావొచ్చు, కుటుంబ ప్రయాణాలు కావొచ్చు.. కారుకి ఉన్న బలమైన ప్రజాధారణే దాని విజయానికి బలమైన ఆధారం. ఇప్పుడు ఈ కారుకు సంబంధించి జూలై 2025 అమ్మకాల గణాంకాలు విడుదల అయ్యియి. మారుతి సుజుకి విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఈ నెలలో మొత్తం 12,341 ఈకో యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే సమయంలో గత ఏడాది అంటే జూలై 2024లో ఈ సంఖ్య 11,916గా నమోదైంది. ఏడాది ప్రాతిపదికన ఈ రెండింటి మధ్య తేడా ఈసారి 425 యూనిట్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.
దేశంలో కుటుంబ ప్రయాణాలకు ప్రాముఖ్యత పెరగడం కారణంగా ఎక్కువ సీటింగ్ కలిగిన కార్లకు సాధరణంగానే డిమాండ్ ఏర్పడింది. ఈ సమయంలో ఈకో కారులో మల్టిపుల్ పర్పస్ వాహనంగా, రెండు కుటుంబాలు కలిసి ప్రయాణించాడానికి అనువుగా ఉండటంతో భారతీయ కస్టమర్లు గత నెలలో అధికంగా ఈ కారును కొనుగోలు చేశారు. మారుతి సుజుకి ఈకో సక్సెస్‌కు వెనుక ఉన్న ముఖ్యమైన కారణాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది.. దాని ధర.

సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు సరిపోయేలా, అత్యంత తక్కువ ధరలో లభించే ఈ వాహనం అందుబాటులో ఉన్న కార్లలో ఒకటి. ప్రస్తుతం భారత మార్కెట్లో ఈకో ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ.5.70 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. టాప్ వేరియంట్ ధర రూ.6.96 లక్షల వరకు చేరుతుంది. ఇవన్నీ కూడా మారుతి సుజుకి అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న ధరలు. ఈ ధరల రేంజ్ కుటుంబ, వాణిజ్య ప్రయాణాలకు తగిన ఖర్చుగా అనిపిస్తాయి.
మరో విషయం ఏమిటంటే ఈ కారును ప్రజలు ఇష్టంగా కొనుగోలు చేయడానికి ప్రధాన కారణాల్లో దాని మైలేజ్ కూడా ఒకటి. ఈకో మైలేజ్ విషయంలో నిరాశపరచదు. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ARAI ప్రమాణాల ప్రకారం లీటరుకు 19.71 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందించగలదు. అయితే, దానికంటే ఇంధన ఖర్చుమరింత తక్కువగా ఉండే వేరియంట్ కోసం చూస్తే, CNG మాన్యువల్ వేరియంట్ లీటరుకు ఏకంగా 26.78 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది.

ఇది చిన్న వ్యాపారాలు నడిపేవారికి, రోజూ చాలా ప్రయాణాలు చేసే వారికి ప్రయోజనంగా నిలుస్తోంది. ధర, మైలేజ్ రెండింటిలోనూ ఈకో చూపిస్తున్న స్థిరత మార్కెట్‌పై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతోంది. అందుకే పోటీ కార్లు ఎంత కొత్తగా వచ్చినా, ఈకో మాత్రం తన స్థానం కాపాడుకుంటూ ముందుకు సాగుతోంది. ధర పరంగా మారుతి సుజుకి ఈకో అందుబాటులో ఉండే కారుగా కనిపించినా, భద్రత విషయంలో ఇది ఎలాంటి రాజీ పడదు.
ఈ విభాగంలో భద్రతా ఫీచర్లు సాధారణంగా గణనీయంగా తక్కువగా ఉంటాయి కానీ, ఈకో మాత్రం ఆకట్టుకునే విధంగా అనేక ముఖ్యమైన భద్రతా వ్యవస్థలను కలిగి ఉంది. ఈ వాహనంలో 6 ఎయిర్‌బ్యాగులు వంటి మెరుగైన రక్షణ ఫీచర్లతో పాటు, ABS + EBD వ్యవస్థ కూడా ఉంటుంది. ఇవి బ్రేకింగ్ సమయంలో వాహనాన్ని నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) వంటివి ఉన్నాయి.

ఈ అంశాలు, కారుని బలమైన సేఫ్టీ అందించే మోడల్‌గా మార్కెట్లో స్థానాన్ని నిలబెట్టాయి. అలాగే, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటివి సురక్షితంగా పార్కింగ్ చేయడంలో సహాయపడతాయి, ముఖ్యంగా నగరాల మాదిరి బిజీ రోడ్లలో. ఇవన్నీ కలిపి చూస్తే, తక్కువ ధరకు ఎక్కువ విలువను అందించగల సామర్థ్యం ఈకోలో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే మారుతి సుజుకి ఈకోను ఒక విజయవంతమైన మోడల్‌గా మార్కెట్లో నిలబెట్టగలిగారు.


Click it and Unblock the Notifications








