రెండు కుటుంబాలకు సరిపోయే కారును కొనడానికి ఆసక్తి చూపడం లేదు, కారణం ఏమిటి?
మారుతి సుజుకి (Maruti Suzuki) కంపెనీ నుంచి వచ్చిన XL6 ఎప్పటి నుంచో ఒక నమ్మకమైన, ప్రీమియం MPVగా గుర్తింపు పొందింది. ఆకర్షణీయమైన డిజైన్, విశాలమైన ఇంటీరియర్, ఆధునిక ఫీచర్లు, అలాగే స్మూత్ హైబ్రిడ్ ఇంజిన్ టెక్నాలజీతో XL6 వినియోగదారుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించింది. కుటుంబ ప్రయాణాల కోసం, లగ్జరీ ఫీలింగ్‌తో కూడిన సౌకర్యం కావాలనుకునే వారికి ఇది ఒక సరైన ఎంపికగా నిలుస్తోంది. అయితే, ఇటీవల అమ్మకాల పరంగా XL6 కొంత వెనుకబడి కనిపిస్తోంది. సెప్టెంబర్ 2025 నెలలో ఈ MPV మొత్తం 2,170 యూనిట్లు మాత్రమే విక్రయించబడింది. ఇది గత సంవత్సరం ఇదే నెలలో నమోదైన 3,734 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే గణనీయంగా తక్కువ. అంటే, అమ్మకాలు దాదాపు 41.89 శాతం తగ్గినట్లుగా అర్థమవుతోంది.
ఈ తగ్గుదల వెనుక అనేక కారణాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఇతర కంపెనీలు కూడా దాదాపు ఇదే ధరలో కొత్త MPVలను అందుబాటులోకి తెస్తున్నాయి. హ్యుందాయ్ అల్కాజార్, కియా కరెన్స్, టయోటా రుమియన్ వంటి మోడళ్లు ఆకర్షణీయమైన డిజైన్, విస్తృతమైన ఫీచర్లు, ఆధునిక టెక్నాలజీతో వినియోగదారుల దృష్టిని గట్టిగా ఆకర్షిస్తున్నాయి. దీంతో కస్టమర్లు XL6 కంటే ఇతర బ్రాండ్ల వైపు మళ్లడం ప్రారంభించారు.

అదేవిధంగా, కొత్త వెర్షన్ అప్‌డేట్‌లు లేదా పెద్ద మార్పులు లేకపోవడం కూడా కొనుగోలుదారులను కొంత వెనక్కి నెట్టిందని చెప్పవచ్చు. మరో ముఖ్యమైన అంశం, సెప్టెంబర్ 22 నుండి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన GST సవరణ. పన్నులు మారడంతో, వాటి ధరల్లో తగ్గుదల వచ్చింది. కానీ ఈ మార్పు గురించి చాలా మంది వినియోగదారులకు సరైన అవగాహన లేకపోవడంతో, వారు కొత్తగా కారును కొనుగోలు చేయడంలో కొంత వెనుకంజ వేశారు.
మారుతి సుజుకి XL6 ధర పరంగా కూడా వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా రూపొందించబడింది. రూ.11.52 లక్షల నుండి రూ. 14.48 లక్షల (ఎక్స్‌షోరూమ్) ధర పరిధిలో లభించే ఈ MPVను మధ్యతరగతి కుటుంబాలు కూడా సులభంగా కొనుగోలు చేయగలుగుతున్నాయి. ప్రీమియమ్ లుక్, సౌకర్యవంతమైన ఇంటీరియర్‌తో పాటు ఫ్యామిలీ ట్రిప్స్‌కి ఇది సరైన ఎంపికగా నిలుస్తోంది.

XL6 మొత్తం మూడు వేరియంట్లలో జీటా (Zeta), ఆల్ఫా (Alpha), ఆల్ఫా ప్లస్ (Alpha+)లలో అందుబాటులో ఉంది. ప్రతి వేరియంట్‌లోనూ ఫీచర్లు, కంఫర్ట్, సేఫ్టీ పరంగా మంచి సమతుల్యత ఉంటుంది. ముఖ్యంగా, పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, XL6లో ఉన్న 1.5 లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజన్ శక్తివంతమైనది, అలాగే ఫ్యూయల్ ఎఫిషియెంట్ కూడా. ఇది గరిష్టంగా 102 bhp పవర్, 137 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
డ్రైవింగ్ స్టైల్‌కి అనుగుణంగా, వినియోగదారులు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపిక చేసుకోవచ్చు. మైలేజీ 20.27 నుండి 20.97 kmpl మధ్య ఉండటంతో, ఇది రోజువారీ ప్రయాణాలకు, అలాగే లాంగ్ డ్రైవ్స్‌కి కూడా సరైన ఆప్షన్‌గా నిలుస్తోంది. ఈ ఫీచర్లు, ధర కలయిక XL6ను స్టైలిష్, కంఫర్టబుల్, ప్రాక్టికల్ MPVగా నిలబెడుతున్నాయి.

మారుతి సుజుకి XL6లో మరో ముఖ్యమైన వెర్షన్‌గా 1.5 లీటర్ పెట్రోల్ + CNG ఇంజిన్ కూడా అందుబాటులో ఉంది. ఇది పర్యావరణానికి అనుకూలంగా ఉండటమే కాకుండా, ఇంధన వ్యయాన్ని గణనీయంగా తగ్గించేలా రూపొందించబడింది. ఈ ఇంజన్ గరిష్టంగా 87 bhp పవర్, 121 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా, దీని మైలేజీ చాలా ఆకట్టుకునేలా 26.32 km/kg ఉంది.


Click it and Unblock the Notifications








