కొబ్బరి కాయలతో రెడీగా ఉండండి.. దేశంలో అందరూ ఎదురుచూస్తున్న కారు వచ్చేది అప్పుడే!

మారుతి సుజుకి (Maruti Suzuki) భారత మార్కెట్లో తన తొలి ఎలక్ట్రిక్ SUV‌ను ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. కంపెనీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ కొత్త మోడల్ పేరు మారుతి సుజుకి e-Vitara (ఇ-విటారా). భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు చేసే తొలి పెద్ద అడుగుగా ఇది భావిస్తున్నారు. ఇ-విటారా గురించి మొదటిసారి ఈ ఏడాది జనవరిలో జరిగిన 2025 ఆటో ఎక్స్‌పోలో అధికారికంగా పరిచయం చేశారు. అప్పట్లోనే కంపెనీ దీన్ని ఈ సంవత్సరపు మొదటి అర్ధభాగం ముగిసేలోపు మార్కెట్లోకి తీసుకురావాలని ప్రణాళిక వేసింది. కానీ అనుకోని పరిస్థితుల కారణంగా ఆ లాంచ్ వాయిదా పడింది.

తరువాత సెప్టెంబర్ 3న కొత్త కాంపాక్ట్ SUVతో పాటు e-Vitara ధరలను ప్రకటించేందుకు మారుతి సిద్ధమైంది. కానీ, అరుదైన భూమి మూలకాల (Rare Earth Elements) కొరత కారణంగా ఉత్పత్తి ప్రక్రియలో సమస్యలు తలెత్తడంతో, లాంచ్ మళ్లీ ఆలస్యం అయింది. ఈ మూలకాలు బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్‌ల తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల సరఫరా లోటు నేరుగా లాంచ్ టైమ్‌లైన్‌పై ప్రభావం చూపింది.

Maruti Suzuki First Electric Car E Vitara It Will Be Launch Soon In December 2025

ఇప్పటికీ కంపెనీ అధికారిక లాంచ్ తేదీని ప్రకటించకపోయినా, మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం అన్నీ అనుకున్నట్టే జరిగితే కొత్త మారుతి సుజుకి e-Vitara డిసెంబర్ 2025లో అమ్మకానికి రావొచ్చని అంచనా. ఇది మారుతి సుజుకి మొదటి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ SUV కావడంతో, భారత మార్కెట్లో దీనికి భారీ ఆసక్తి నెలకొంది. ఇ-విటారా రూపకల్పనలో కంపెనీ తన ప్రస్తుత విటారా మోడల్ డిజైన్‌నే కొనసాగించినా, దీనికి ఆధునిక ఎలక్ట్రిక్ టచ్ ఇచ్చింది.

ధర విషయానికి వస్తే, మారుతి సుజుకి e-Vitara ధర రూ.17 లక్షల నుండి రూ.22.50 లక్షల (ఎక్స్‌షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. ఇది టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV400, MG ZS EV వంటి మోడళ్లకు నేరుగా పోటీగా ఉంటుంది. ఇది ఇప్పటికే, గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లోని కంపెనీ ఉత్పత్తి యూనిట్ నుండి 2,900 కంటే ఎక్కువ ఇంగ్లాండ్, జర్మనీ, నార్వే, ఫ్రాన్స్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్‌లకు ఎగుమతి చేయబడ్డాయి.

Maruti Suzuki First Electric Car E Vitara It Will Be Launch Soon In December 2025

కొత్త ఇ-విటారా భారత మార్కెట్లో మూడు వేరియంట్లలో డెల్టా, జీటా, ఆల్ఫాలో లభిస్తుంది. ప్రతి వేరియంట్ ప్రత్యేకమైన ఫీచర్లను, లగ్జరీ అప్‌గ్రేడ్‌లను, భద్రతా టెక్నాలజీలను కలిగి ఉంటుంది. ఇవి విభిన్న వినియోగదారుల అవసరాలను తీర్చగలిగేలా రూపుదిద్దబడ్డాయి. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇది 49 కిలోవాట్ల (kWh), 61 కిలోవాట్ల (kWh) సామర్థ్యం కలిగిన రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ఈ బ్యాటరీలతో పూర్తి ఛార్జ్ తర్వాత 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదని అంచనా. అంటే రోజువారీ ప్రయాణాలకే కాకుండా, లాంగ్ డ్రైవ్‌లకు కూడా ఇది సరైన ఎలక్ట్రిక్ SUV అవుతుంది. ఇది 5 సీట్ కారు. విశాలమైన లెగ్‌రూమ్, సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్, అధునాతన కూలింగ్ సిస్టమ్‌లతో ప్రయాణీకులు సౌకర్యంగా ప్రయాణించగలరు. దీని సస్పెన్షన్ సెటప్ కూడా భారత రోడ్ల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ట్యూన్ చేయబడిందని సమాచారం.

Maruti Suzuki First Electric Car E Vitara It Will Be Launch Soon In December 2025

భద్రతా అంశంలో కూడా ఇ-విటారా విశేషంగా రాణించింది. యూరప్‌లో ప్రసిద్ధమైన భద్రతా సంస్థ Euro NCAP నిర్వహించిన పరీక్షల్లో ఈ SUV 4-స్టార్ భద్రతా రేటింగ్‌ను సాధించింది. ఇది భద్రత పరంగా మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వాహనాలపై ఉన్న నమ్మకాన్ని మరింత బలపరిచింది. ముఖ్యంగా, పెద్దల రక్షణ విభాగంలో 40కి 31 పాయింట్లు, పిల్లల రక్షణ విభాగంలో 49కి 42 పాయింట్లు సాధించడం గమనార్హం.

More from DriveSpark

Article Published On: Thursday, October 9, 2025, 14:06 [IST]
English summary
Maruti suzuki first electric car e vitara it will be launch soon in december 2025
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+