దేశం మొత్తం ఈ కార్ గురించే మాట్లాడుతోంది! మన కారు కోసం విదేశాల్లో జనాలు ఎగబడుతున్నారు

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక కొత్త అధ్యాయాన్ని రాసింది మారుతి సుజుకి (Maruti Suzuki). కంపెనీ తన కాంపాక్ట్ SUV మోడల్ ఫ్రాంక్స్ (Fronx) అరుదైన ఘనతను సాధించింది. జూన్ 2023లో ఫ్రాంక్స్ గ్లోబల్ ఎగుమతి కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి, కేవలం 25 నెలల్లోనే ఇది ఒక లక్ష యూనిట్ల (1,00,000) ఎగుమతులు పూర్తి చేసింది. దేశీయంగా మాత్రమే కాకుండా, అంతర్జాతీయంగా కూడా భారత తయారీ నాణ్యతను చాటింది. అతి తక్కువ కాలంలోనే మారుతి లక్ష కార్లను ఎగుమతి చేయడం అంటే సాధారణ విషయం కాదు. ముఖ్యంగా జపాన్‌ దేశంలో కూడా Fronx కి గణనీయమైన ఆదరణ లభించడం గమనార్హం. ఇది సాధారణంగా అత్యధిక నాణ్యతను కోరుకునే మార్కెట్. ఈ దేశంలో కూడా భారతీయ తయారీ కారు నమ్మకాన్ని సంపాదించడం అనేది గర్వకారణం.

ఫ్రాంక్స్ అంతర్జాతీయ కస్టమర్లకు చేరడంలో ఒక కీలక మలుపు 2023 ఏప్రిల్ నుంచే మొదలైంది. దేశీయ మార్కెట్‌లో ఫ్రాంక్స్ అమ్మకాలు ప్రారంభమైన నెలలకే, అదే సంవత్సరం అంతర్జాతీయంగా ఈ SUV దూసుకెళ్లింది. మొదటగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు డిస్పాచ్‌లు జరగగా, తర్వాత దశల్లో మరింత విస్తరణ జరిగింది. ఈ గమ్యస్థానాలు ఎంచుకోవడమే కాదు, అక్కడ మంచి ఆదరణను కూడా పొందడమే Fronx విశేషం.

Maruti Suzuki Fronx Exports

ఈ SUVకి ఉన్న డిజైన్, మైలేజ్‌, మల్టీపర్పస్ ఫీచర్లు ఎగుమతి మార్కెట్లలో ఆదరణను పెంచాయి. ఇదే సమయంలో, మారుతి సుజుకి గత నాలుగు ఆర్థిక సంవత్సరాలలో భారతదేశపు అతిపెద్ద ప్రయాణికుల వాహన ఎగుమతిదారుగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇది మేడ్ ఇన్ ఇండియాకి ప్రపంచంలో ఎదురు ఉండదనే విషయాన్ని నిరూపిస్తుంది. Fronx ఈ విజయాన్ని మరింత ముందుకు నడిపిస్తూ, భారత కార్లను గ్లోబల్ లెవెల్లో ప్రతినిధ్యం వహిస్తున్న ఘనత పొందింది.

ఫ్రాంక్స్ ప్రత్యేకంగా గుజరాత్‌లోని మారుతి సుజుకి ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయబడుతోంది. అక్కడినుంచి లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా వంటి మార్కెట్లకు ఎగుమతి అవుతూ, తమకు తామే పోటీగా నిలుస్తోంది. ఈ SUV ఆకర్షణీయమైన డిజైన్, ఆర్థికంగా స్మార్ట్ పనితీరు, వినియోగదారుల అవసరాలకు సరిపోయే ఫీచర్లు.. ఇవన్నీ ఫ్రాంక్స్‌ను ప్రపంచ మార్కెట్లో ప్రత్యేకంగా నిలిపాయి. ఇదే సమయంలో భారతీయ బ్రాండ్ ప్రాముఖ్యత కూడా పెరిగింది.

Maruti Suzuki Fronx Demand

ఇదిలా ఉంటే, 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే 96,000 వాహనాలు ఎగుమతి చేయడం ద్వారా, మారుతి సుజుకి మరోసారి తన సామర్థ్యాన్ని నిరూపించింది. ఇది మొత్తం ప్రయాణీకుల వాహనాల ఎగుమతుల్లో ఒంటరిగా 47 శాతం మార్కెట్ వాటాను ఆక్రమించుకోవడం అంత సులువు కాదు. మారుతి సుజుకి నాలుగో సంవత్సరం పాటు టాప్ ఎగుమతిదారిగా నిలవడం విశేషం.

భారత మార్కెట్లో ఇప్పుడు అందుబాటులో ఉన్న ఫ్రాంక్స్ ప్రారంభ ధర రూ.7.54 లక్షల నుంచి మొదలై రూ.13.03 లక్షల వరకు ఉంది, ఇవన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు. ప్రతి బడ్జెట్‌కు తగ్గ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇది 1.2 లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజిన్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌ కావాలి అంటే, 1.0 లీటర్ బూస్ట్‌ర్జెట్ టర్బో పెట్రోల్‌లో కొనుగోలు చేయడానికి లభిస్తుంది.

Maruti Suzuki Fronx Price

మరోవైపు, ఖర్చు తక్కువగా చూసే వారు ఎప్పుడూ కోరుకునేది CNG వేరియంట్ ఇది కూడా అందుబాటులో ఉంది. ఇతర SUVలతో పోలిస్తే ఇందులో ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ కూడా విస్తృతంగా ఉన్నాయి, ఇది 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లను కలిగి ఉంది. ఇంత శక్తివంతమైన SUV, ఇంకా అదిరిపోయే మైలేజ్ ఇస్తోంది, ఇది దాదాపు 20 నుంచి 28 కిలోమీటర్లు ప్రయాణించగలదు.

More from DriveSpark

Article Published On: Thursday, July 24, 2025, 15:10 [IST]
English summary
Maruti suzuki fronx become fastest one lakh export milestone details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+