28+ కి.మీలు మైలేజీ ఇచ్చే ఈ కారుతో మీ ఊర్లోకి వెళ్తే కచ్చితంగా దిష్టి తీయించుకోండి! లుక్స్‌తో కట్టిపడేస్తుంది

భారతీయ ఆటోమొబైల్ రంగంలో మారుతీ సుజుకీ (Maruti Suzuki) పేరు వినిపించగానే, మిడిల్ క్లాస్ వినియోగదారులకు నమ్మకమైన, ఆర్ధిక పరంగా అందుబాటులో ఉండే కార్లే కనిపిస్తాయి. ఈ బ్రాండ్‌కి కలిగిన ఈ గొప్ప పేరు, ఇప్పటికీ కొనసాగుతోంది. ముఖ్యంగా, ఇటీవల వచ్చిన మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ (Fronx) మోడల్‌కు మార్కెట్‌లో ఊహించని స్పందన లభించింది. లాంచ్ అయినప్పటి నుంచి క్రమంగా వినియోగదారుల అభిరుచులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్న ఫ్రాంక్స్, మే 2025లో గణనీయమైన అమ్మకాలను సాధించింది. ఇటీవల విడుదలైన అమ్మకాల గణాంకాల ప్రకారం, మే నెలలోనే 13,584 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే సమయంలో, మునుపటి సంవత్సరం అంటే మే 2024లో ఈ సంఖ్య 12,681గా ఉండగా, ఈసారి దాదాపు 7 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం.

ఈ వృద్ధి ఫ్రాంక్స్‌కు ఉన్న ప్రజాదరణను స్పష్టంగా చెప్పేస్తోంది. ప్రజలు కొత్త SUV లుక్, స్టైలిష్ డిజైన్, ఫీచర్లు, మైలేజ్ వంటి అంశాలకు ప్రత్యేకంగా ఆకర్షితులవుతున్నారు. ఈ కారుకి యువతలో మంచి క్రేజ్ ఏర్పడింది. అమ్మకాలతో ఫ్రాంక్స్, మే 2025లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో 8వ స్థానాన్ని దక్కించుకుంది. తొలి 7 స్థానాల్లో డిజైర్, ఎర్టిగా, బ్రెజ్జా, స్విఫ్ట్, వ్యాగన్ ఆర్ వంటి దిగ్గజాలు ఉన్నాయి.

Fronx May 2025 Sales 7 Percent Growth

ఈ జాబితాలో టాటా పంచ్ 9వ స్థానంలో ఉండగా, టాటా నెక్సాన్ 10వ చివరి స్థానంలో నిలిచాయి.ధరల విషయానికి వస్తే, మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌ను తీసుకోవాలనుకునే వారికి ధర పరంగా కూడా మంచి ఎంపికలు లభిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ కార్‌ ప్రారంభ ధర రూ.7.55 లక్షలుగా ఉంది. టాప్-ఎండ్ వేరియంట్‌ ధర రూ. 12.91 లక్షల వరకు ఉంది, ఇవన్నీ కూడా ఎక్స్ -షోరూమ్ ధరలు.

ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. దీని పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటర్‌కు 21.79 కి.మీ. మైలేజీని అందించగలదు. అంతేకాదు, ఆటోమేటిక్ వేరియంట్‌ అయితే లీటర్‌కు 22.89 కి.మీ. వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మ్యాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ లీటరుకు 21.50 కిలోమీటర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ లీటరుకు 20.10 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది.

Maruti Suzuki Fronx May 2025 Sales

ఇవి నగరాల్లోనే కాదు, హైవే ప్రయాణాల్లోనూ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ పరంగా వినియోగదారులకు బెస్ట్. ఇది సీఎన్‌జీ వేరియంట్‌లో కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. మారుతీ సుజుకీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఫ్రాంక్స్ CNG వేరియంట్ కిలోగ్రామ్ ఇంధనానికి దాదాపు 28.51 కిలోమీటర్ల మైలేజీను అందించగలదు. ఇది మార్కెట్లో లభ్యమయ్యే చాలానే కార్లతో పోలిస్తే గణనీయంగా మెరుగైన అంశం అని చెప్పవచ్చు.

ఫ్రాంక్స్ కేవలం స్టైలిష్ డిజైన్‌, మైలేజీ మాత్రమే కాదు, ఫీచర్ల పరంగా పూర్తి స్థాయి అనుభూతిని అందిస్తోంది. కారు లోపలికి అడుగుపెట్టిన ప్రతిసారీ 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ దృష్టిని ఆకర్షిస్తుంది. దీనికి వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ కూడా లభిస్తుంది. మరింత మోడ్రన్ అనుభూతికి హెడ్స్-అప్ డిస్ప్లే (HUD) తో పాటు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి సౌకర్యాలు కూడా అందించబడుతున్నాయి.

Maruti Suzuki Fronx

ఇక భద్రత విషయానికొస్తే, ఫ్రాంక్స్ ఖచ్చితంగా 'హై ప్రియారిటీ' ఇచ్చినట్లు స్పష్టంగా తెలుస్తుంది. డ్రైవర్, ప్యాసింజర్ సేఫ్టీకి మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్స్ అందించబడ్డాయి. ఎత్తుగా ఉన్న ప్రదేశాలపై ఆగినప్పుడు కారు జారకుండా నిలిపేందుకు హిల్ హోల్డ్ అసిస్ట్, కారు చుట్టూ పూర్తి విజిబిలిటీ కోసం 360 డిగ్రీల కెమెరా, అలాగే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లూ ఇందులో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, June 12, 2025, 7:30 [IST]
English summary
Maruti suzuki fronx may 2025 sales 7 percent growth compared to previous
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+