మారుతి కారుకు సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్.. తనను ఎగతాళి చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకున్న కంపెనీ
మారుతి సుజుకి ప్రసిద్ధ మోడల్ ఫ్రాంక్స్ (Fronx) ఇప్పుడు భద్రత పరంగా కొత్త గుర్తింపును సాధించింది. ఆగ్నేయాసియా దేశాలకు సంబంధించిన ASEAN NCAP (New Car Assessment Program) క్రాష్ టెస్ట్‌లో ఈ కారు తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. కేవలం మైలేజ్ లేదా లుక్‌లలోనే కాదు, ఇప్పుడు సురక్షిత డ్రైవింగ్‌లో కూడా మారుతి తన స్థాయిని మరొక మెట్టుపైకి తీసుకెళ్లిందని చెప్పాలి. తాజాగా నిర్వహించిన ASEAN NCAP క్రాష్ టెస్ట్‌లో ఫ్రాంక్స్ 77.70 పాయింట్ల మొత్తం స్కోరుతో 5-స్టార్ రేటింగ్ పొందింది. ఇది సాధారణ ఫలితం కాదు, ఎందుకంటే, గతంలో మారుతి కార్ల నిర్మాణ నాణ్యతపై చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారు. సేఫ్టీ లో బలహీనంగా ఉంటుంది అనే అభిప్రాయం కూడా చాలామంది వినిపించేవారు. కానీ ఈ ఫలితంతో ఆ విమర్శలకు ఫ్రాంక్స్ ఒక పక్కా సమాధానంగా నిలిచింది.
ఫ్రాంక్స్‌లో మారుతి సుజుకి ఉపయోగించిన బాడీ స్ట్రక్చర్ మరింత మజ్బూత్‌గా ఉంది. ఈ కారు ఫ్రంటల్ ఇంపాక్ట్, సైడ్ ఇంపాక్ట్ వంటి వివిధ ప్రమాద పరిస్థితుల్లో ప్రయాణికులను రక్షించే విధంగా డిజైన్ చేయబడింది. కారు ఫ్రేమ్‌లో హై-టెన్సైల్ స్టీల్ వినియోగం, మెరుగైన సస్పెన్షన్ స్ట్రక్చర్, కొత్త ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్ కారణంగా ఈ ఫలితాన్ని సాధించగలిగిందని సంస్థ చెబుతోంది. భారత మార్కెట్‌లో కూడా ఫ్రాంక్స్ మంచి రెస్పాన్స్ పొందుతోంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Fronx)ఆగ్నేయాసియా దేశాలకు సంబంధించిన ASEAN NCAP క్రాష్ టెస్ట్‌లో మొత్తం 77.70 పాయింట్లతో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించిన ఫ్రాంక్స్, భద్రత విషయంలో మారుతి సుజుకి తీసుకుంటున్న నూతన దిశను ప్రతిబింబిస్తోంది. వివరాల ప్రకారం, ఫ్రాంక్స్ వయోజన భద్రతలో 36.71 పాయింట్లు, అలాగే పిల్లల భద్రతలో 15.27 పాయింట్లు సాధించింది. ఇవి ఈ సెగ్మెంట్‌లో ఉన్న ఇతర మోడళ్లతో పోలిస్తే చాలా మంచి ఫలితాలుగా భావించబడుతున్నాయి.
ఈ ఫలితాలు మారుతి సుజుకి తన కార్ల నిర్మాణ నాణ్యతను ఎలా మెరుగుపరుస్తోందో స్పష్టంగా చూపుతున్నాయి. సురక్షితతను పెంచడానికి ఫ్రాంక్స్‌లో అనేక ఆధునిక ఫీచర్లు చేర్చబడ్డాయి. అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), అలాగే ముందు, వెనుక సీట్లలో ఉన్న ప్రయాణికుల కోసం సీట్‌బెల్ట్ రిమైండర్ సిస్టమ్ (SBR) లాంటి సాంకేతిక సదుపాయాలు ప్రామాణికంగా లభిస్తాయి.

అంతేకాకుండా, పాదచారుల రక్షణ (Pedestrian Protection), పిల్లల సీట్ల కోసం ISOFIX మౌంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. టాప్ వేరియంట్లలో భద్రతను మరింత పెంచే విధంగా లేన్ డిపార్చర్ వార్నింగ్ (LDW), ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ (FCW), లేన్ కీప్ అసిస్ట్ (LKA) వంటి ఫీచర్లు ప్రామాణికంగా లేదా ఐచ్ఛికంగా ఇవ్వబడ్డాయి.
అలాగే అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB City, AEB Inter-Urban), బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ (BSD), ఆటో హై బీమ్ (AHB) వంటి ఆధునిక సాంకేతికతలు కూడా అందుబాటులో ఉన్నాయి, ఇవి డ్రైవింగ్ సమయంలో మరింత భద్రతను కల్పిస్తాయి. ఈ క్రాష్ టెస్ట్ ఫలితాలతో మారుతి సుజుకి ఫ్రాంక్స్ కేవలం స్టైలిష్ కూపే SUVగా మాత్రమే కాకుండా, సేఫ్టీ ఫస్ట్ అనే సందేశాన్ని కూడా బలంగా ఇచ్చింది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Fronx) భద్రత పరంగా సాధించిన విజయానికి ఒక ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. ఎందుకంటే, ASEAN NCAP క్రాష్ టెస్ట్‌లో పాల్గొన్న చివరి సుజుకి మోడల్ 2019లో పరీక్షించబడిన ఎర్టిగా (Ertiga). అంటే, దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత మారుతి సుజుకి మళ్లీ ఈ పరీక్షలో తన కొత్త మోడల్‌తో అడుగుపెట్టింది. ఈ విరామం తర్వాత వచ్చిన ఫలితాలు మాత్రం అద్భుతంగా నిలిచాయి.


Click it and Unblock the Notifications








