లగ్జరీ లుక్.. ధర రూ.6.85 లక్షలే, పైగా 28 కి.మీ మైలేజ్.. మిడిల్ క్లాస్‌కి బెస్ట్ మోడల్

హ్యుందాయ్ ఐ10 (Hyundai I10) ఒకప్పుడు భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది. చిన్న కుటుంబాల అవసరాలకు సరిపోయే పరిమాణం, ఆకర్షణీయమైన డిజైన్, నమ్మకమైన పనితీరు, ఈ మూడు అంశాల కలయికతో ఐ10 అనేకమంది హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. తన కాలంలో మారుతి సుజుకి స్విఫ్ట్, వ్యాగన్ఆర్ వంటి పాపులర్ మోడల్స్‌తో సవాల్ చేస్తూ, హ్యుందాయ్ బ్రాండ్‌కి మంచి గుర్తింపు తెచ్చిన మోడల్ ఇదే. మార్కెట్‌లో పోటీ ఎంత పెరిగినా, ఐ10 మాత్రం తన స్టైలిష్ లుక్, సౌకర్యవంతమైన ఇంటీరియర్‌తో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తూ వచ్చింది. తరువాత కాలంలో ఈ మోడల్ మరింత ఆధునికంగా రూపుదిద్దుకుని గ్రాండ్ i10 నియోస్ పేరుతో మూడవ తరం వెర్షన్‌గా రీ-ఎంట్రీ ఇచ్చింది.

కొత్త ఫీచర్లు, స్మార్ట్ టెక్నాలజీ, హ్యుందాయ్‌కి ప్రత్యేకమైన క్వాలిటీతో ఈ కారు కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే, సెప్టెంబర్ 2025 అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, గ్రాండ్ i10 నియోస్ కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లు స్పష్టమవుతోంది. గత నెలలో కంపెనీ మొత్తం 4,238 యూనిట్లు మాత్రమే విక్రయించింది. ఈ సంఖ్య గత ఏడాది ఇదే కాలంలో అమ్ముడైన 5,103 యూనిట్లతో పోలిస్తే దాదాపు 17 శాతం తగ్గుదలగా ఉంది.

Maruti Suzuki Fronx September 2025 Sales 1 Percent Down More Details Inside

ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు, మార్కెట్లో పెరిగిన పోటీ, కొత్త మోడల్స్ ప్రవేశం, వినియోగదారులు SUV సెగ్మెంట్ వైపు మళ్లిపోవడం. ప్రస్తుతం కస్టమర్లు ఎక్కువగా SUV లుక్ ఉన్న హ్యాచ్‌బ్యాక్‌లు లేదా కాంపాక్ట్ SUVలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, గ్రాండ్ i10 నియోస్ వంటి సాంప్రదాయ హ్యాచ్‌బ్యాక్‌లు కొంత వెనుకబడుతున్నాయి. అయినా కూడా, హ్యుందాయ్ ఐ10 పేరు మాత్రం ఇప్పటికీ వినియోగదారుల మదిలో నిలిచేలా ఉంది.

దాని నిర్మాణ నాణ్యత, రైడ్ కంఫర్ట్, విశ్వసనీయ ఇంజిన్ పనితీరు కారణంగా ఈ కారు ఇప్పటికీ మార్కెట్‌లో తన ఉనికిని కొనసాగిస్తోంది. హ్యుందాయ్ నుంచి వచ్చే కొత్త అప్‌డేట్‌లు, ఫీచర్ ఎన్‌హాన్స్‌మెంట్‌లు గ్రాండ్ i10 నియోస్‌కి మళ్లీ బలాన్నిస్తాయన్న ఆశతో ఆటోమొబైల్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఈ మోడల్ ఎరా, మాగ్నా, స్పోర్ట్స్, స్పోర్ట్స్ (O), ఆస్టా అనే ఐదు వేర్వేరు వేరియంట్లలో లభిస్తుంది.

Maruti Suzuki Fronx September 2025 Sales 1 Percent Down More Details Inside

GST తగ్గింపుల తర్వాత, ప్రస్తుతం దీని ధరలు రూ. 5.47 లక్షల నుండి రూ. 7.92 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ధర పరంగా ఇది మిడ్-రేంజ్ హ్యాచ్‌బ్యాక్‌లలో మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది. గ్రాండ్ i10 నియోస్‌లో ఇప్పటికీ నాలుగు సిలిండర్ల ఇంజిన్ ఉండటం పెద్ద ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ సదుపాయం ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక పోటీ మోడళ్లలో లేదు, ముఖ్యంగా మారుతి స్విఫ్ట్‌లో కూడా కాదు.

ఈ ఇంజిన్ కారణంగా కారులో స్మూత్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, వైబ్రేషన్‌-ఫ్రీ రైడ్ లభిస్తుంది. దీనిలో ఉన్న 1.2 లీటర్ కప్పా 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 83 bhp పవర్, 113.8 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, స్మార్ట్ ఆటో AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. డ్రైవర్‌కి కావలసిన సౌలభ్యాన్ని, సిటీ ట్రాఫిక్‌లో స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని ఈ రెండు గేర్‌బాక్స్ ఎంపికలు అందిస్తాయి.

Maruti Suzuki Fronx September 2025 Sales 1 Percent Down More Details Inside

దీనిలో CNG వేరియంట్‌ కూడా అందిస్తోంది. CNG మోడ్‌లో నడిపినప్పుడు ఇంజిన్ పనితీరు కొంత తగ్గుతుంది. ఈ సందర్భంలో కారు 69 bhp పవర్, 95.2 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఫ్యూయల్ ఎఫిషియన్సీ విషయానికి వస్తే, గ్రాండ్ i10 నియోస్ పెట్రోల్ మోడల్స్ (మాన్యువల్, ఆటోమేటిక్) 18 kmpl వరకు మైలేజీ ఇస్తాయి. CNG వేరియంట్ అయితే దాదాపు 27 km/kg వరకు మైలేజీ అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Sunday, October 19, 2025, 17:01 [IST]
English summary
Maruti suzuki fronx september 2025 sales 1 percent down more details inside
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+