పిల్లలు, పెద్దలతో వెళ్తున్నారా? తక్కువ ధర, 5 సీటర్, 28 కి.మీ మైలేజ్.. ఫుల్ సేఫ్టీ ఉన్న SUV ఇదే!
మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) ప్రస్తుతం భారతీయ SUV మార్కెట్‌లో తనదైన స్థానం ఏర్పరచుకుంది. తన ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లతో వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది. ఫంక్షనాలిటీకి స్టైలింగ్‌ను కలిపిన విధానం, యువతను ముఖ్యంగా ఆకర్షిస్తోంది. ఈ కారును మార్కెట్లోకి విడుదల చేసినప్పటి నుంచీ మంచి స్పందన వస్తోంది. నెక్సా ప్రీమియం డీలర్‌షిప్‌ల ద్వారా అందుబాటులో ఉన్న ఈ SUV ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే ఏకంగా 88,066 యూనిట్లు అమ్ముడుపోయింది. ఈ గణంకాలను చూసినట్లయితే ఈ సెగ్మెంట్‌లో ఫ్రాంక్స్ ఎంతగా ఆకర్షణీయమైందో స్పష్టంగా చూపుతోంది. దీనికి ప్రస్తుతం డిమాండ్ ఉన్న దృష్ట్యా మారుతి తన కారులో మరింత సేఫ్టీని అందించింది.
మారుతి సుజుకి ఇటీవల తన కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ మార్పును దశలవారీగా అమలు చేస్తూ, తాజాగా ఫ్రాంక్స్ కారు కూడా భద్రతా అప్‌డేట్‌ను పొందింది. ఇప్పటికే డజన్ల కొద్దీ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఫ్రాంక్స్ ఇప్పుడు ప్రయాణికుల భద్రత విషయంలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో విడుదల అయింది. ఈ కారు ఇప్పుడు కేవలం స్టైల్ కోసం మాత్రమే కాదు, భద్రతలో బలమైన ఎంపికగా మారింది.

ఫ్రాంక్స్ SUVకి సంబంధించిన అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా అందించడం అనేది మారుతి తన కస్టమర్లకు సేఫ్టీతో కూడిన ప్రయాణ అనుభూతిని అందించడంపై ఏ మేరకు పనిచేస్తుందో అర్థం అవుతుంది.ఈ భద్రతా అప్‌గ్రేడ్ కారణంగా కారు ధరలో స్వల్పంగా, సుమారు 0.5 శాతం పెరుగుదల జరిగింది. ఇప్పుడు ఫ్రాంక్స్ SUV ధర రూ. 7.60 లక్షల నుంచి రూ. 13.10 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటోంది.
ఇదే సమయంలో, కంపెనీ తమ ఇతర మోడళ్లపై కూడా ఇదే భద్రతా మార్పును అమలు చేస్తోంది. ఇప్పటికే బాలెనో, ఎర్టిగా, XL6 మోడళ్లకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు కలిపిన వేరియంట్లు ప్రవేశపెట్టారు. మారుతి సుజుకి ఫ్రాంక్స్ మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో మార్కెట్లో అందుబాటులోకి తెచ్చారు. కేవలం స్టైల్, ఫీచర్ల పరంగా మాత్రమే కాకుండా ప్రతి ఒక్కటి వినియోగదారుల డ్రైవింగ్ స్టైల్‌కు తగ్గట్టు రూపొందించబడింది.

ఫ్రాంక్స్ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో 99 PS పవర్, 148 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు లభిస్తాయి. మరో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 89 PS పవర్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణ వినియోగానికి ఇది అనుకూలంగా ఉండే ఇంజిన్. దీనికి 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తాయి.
మరోటి 1.2-లీటర్ CNG వేరియంట్ 76 PS పవర్, 99 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఉంటుంది. మైలేజ్ విషయానికి వస్తే, ఈ ఫ్రాంక్స్ SUV అన్ని వేరియంట్లలోనూ బెస్ట్‌గా నిలుస్తోంది. ఇది 20 నుండి 28 kmpl వరకు మైలేజ్ అందిస్తుంది. ఇది కారే కాదు బైక్‌లను కూడా మైలేజ్‌లో మించగలదు అన్నమాట.

ఇందులో అందుబాటులో ఉండే టెక్నాలజీ, భద్రతా ఫీచర్లు, రోజువారి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా మారుస్తాయి. ఈ కారులో ముందు వరుసగా మనకు 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కనిపిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది, అంటే మీ మొబైల్ కంటెంటును కారు స్క్రీన్ మీద సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో వాతావరణాన్ని మీకు నచ్చినట్లుగా ఉంచుకోవచ్చు.
డ్రైవింగ్ అనుభవాన్ని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లే హెడ్స్-అప్ డిస్ప్లే కూడా ఈ కారులో ఉంది. ఇంకా, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్, క్రూయిజ్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి. ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగులతో పాటు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), 360 డిగ్రీ కెమెరాతో ఈ కారు అమ్మకాలు మరింత పెరగనున్నాయి.


Click it and Unblock the Notifications








