ఫుల్ ట్యాంక్‌తో 1000 కి.మీలకు పైనే ఆనందంతో వెళ్లండి.. 5 మందికి ఖర్చు చాలా తక్కువ.. ధర కూడా మీ బడ్జెట్‌లోనే

దేశీయ దిగ్గజ ప్రముఖ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) కార్ల సేల్స్‌లో అగ్రస్థానంలో ఉంటుంది. తక్కువ ధరలో కార్లను కొనుగోలు చేయాలనుకునే వారు మొదటగా ఈ కంపెనీ వైపు చూస్తారు. మధ్య తరగతి వినియోగదారులు ఎక్కువగా మారుతీ కార్లను వాడుతుంటారు. ప్రతి ఏడాది కూడా కంపెనీ వాహనాల సేల్స్ ఇతర కంపెనీల కంటే అధికంగా నమోదు అవుతుంటాయి. 2024 ఏడాదిలో ఇండియాలో కార్ల అమ్మకాల పరంగా మారుతీ సుజుకీ టాప్ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెల ముగిసిన తరువాత తాజాగా ఆ నెలలో మోడళ్ల వారీగా జరిగిన సేల్స్ వివరాలను వెల్లడిస్తుంది. ఈ క్రమంలో మారుతీకి చెందిన ప్రసిద్ధ కాంపాక్ట్ SUV ఫ్రాంక్స్(fronx) సేల్స్ డేటాను ప్రకటించింది. ఈ కారు గత నెలలో మెరుగైన అమ్మకాలను సాధించింది.

2024 డిసెంబర్‌లో మారుతీ సుజుకీ ఇండియా 'ఫ్రాంక్స్' 10,752 మంది కొనుగోలు చేశారు. అదే గత 2023 ఏడాది ఇదే డిసెంబర్ నెలలో ఈ మోడల్ అమ్మకాలు 9,692 యూనిట్లుగా నమోదయ్యాయి. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఇది దాదాపు 11 శాతం వృద్ధి. ఫ్రాంక్స్ ఆకర్షణీయమైన డిజైన్, అదిరిపోయే ఫీచర్లను కలిగి ఉంది. అందుకే చాలా మంది వినియోగదారులు ఈ కారుకు అట్రాక్ట్ అయి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Maruti Suzuki Fronx Suv 10 752 Sales

ఎస్‌యూవీ విక్రయాల్లో ఫ్రాంక్స్ మెరుగైన స్థానంలో నిలిచింది. అయితే 2024 నవంబర్ నెలలో అమ్మకాలు మాత్రం 14,882 యూనిట్లుగా ఉన్నాయి. డిసెంబర్‌లో తగ్గిపోయాయి. జూలైలో ఫ్రాంక్స్ కారును దాదాపు 10,925 మంది కొనుగోలు చేశారు. తరువాత ఆగస్టులో 12,387 మంది కొన్నారు. సెప్టెంబర్‌లో 13,874 మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు. తర్వాత పండగ సీజన్ రావడంతో అమ్మకాలు పెరిగాయి. అక్టోబర్‌లో నెలలో సేల్స్ 16,419 యూనిట్లుగా ఉన్నాయి.

ఈ సమయంలో ఇతర కార్ల తయారీ కంపెనీ ఇచ్చినట్లుగా మారుతీ సుజుకీ కస్టమర్లను ఆకర్షించడానికి భారీ తగ్గింపులు, డిస్కౌంట్స్ ఇవ్వడం కారణంగా కొత్తగా కారు కొనుగోలు చేయాలని ఆలోచన చేసిన వారు తగ్గింపు ఆఫర్లను సద్వినియోగం చేసుకుని తక్కువ ధరకే కాంపాక్ట్ SUV ఫ్రాంక్స్‌ను కొనుగోలు చేసి తమ ఇంటికి తీసుకెళ్లారు. అందుకే అక్టోబర్ సేల్స్ ఇతర నెలల్లో కంటే ఎక్కువగా నమోదు అయ్యాయి.

Maruti Suzuki Fronx Suv

మారుతి ఫ్రాంక్స్ SUV ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న కారుగా ఉంది. ఇది రూ.7.51 లక్షల నుంచి రూ.13.04 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లో కారు కావాలనుకునే వారు మొదటగా బేస్ వేరియంట్ ఎంచుకుంటున్నారు. అదే ధర కొంచెం ఎక్కువగా ఉన్న పర్వాలేదు టాప్ వేరియంట్ ఎంచుకునే వారు దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇది 5 సీటర్ ఫ్యామిలీ కారు. లోపల చాలా విశాలంగా ఉంటుంది. ఈ SUV 1 లీటర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ డ్యూయల్‌జెట్‌ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. గేర్‌బాక్స్ విషయానికి వస్తే, 5-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లు ఉన్నాయి. cng వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇంజిన్‌లో మాత్రం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ సెటప్ ఉంటుంది.

Fronx 10 752 Sales Units In December 2024

ఇది దాదాపు 20.1 నుండి 28.51 kmpl మైలేజీని ఇస్తుంది. కారు లోపల డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి. 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌,హెడ్స్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటివి లోపల ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, January 9, 2025, 9:30 [IST]
English summary
Maruti suzuki fronx suv recorded 10752 sales units in december 2024
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+