ఈ కారు కోసం జనాలు షోరూంలకు ఎగబడుతున్నారు.. రెండేళ్ల రికార్డు బద్దలు కొట్టిన మారుతి మోడల్
మారుతి సుజుకి ఫ్రాంక్స్ భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక సంచలనం. ఈ కారు తక్కువ ధర, ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ కారు అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కేవలం రెండు సంవత్సరాలలో 3 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎస్‌యూవీ తరహా డిజైన్‌తో వస్తుంది. ఇది బాలెనో ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడినప్పటికీ, దీని లుక్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దీని మస్కులర్ గ్రిల్, ఎల్ఈడీ డీఆర్ఎల్, గ్రాండ్ విటారా లాంటి స్టైలింగ్ దీనికి ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి.

భారతదేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి, తన బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లతో భారీ ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం, మారుతికి ఫ్రాంక్స్ అనే కారు భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. దీనికి కారణం ఈ కారు కేవలం రెండు సంవత్సరాలలో 3 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.
మారుతి సుజుకి ఫ్రాంక్స్, అందుబాటు ధరలో ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన ఫీచర్లు, అధిక మైలేజ్‌తో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా నిలిచింది. మారుతి సుజుకి వెల్లడించిన సమాచారం ప్రకారం..ఈ కారు కేవలం 10 నెలల్లో లక్ష యూనిట్లు, 18 నెలల్లో 2 లక్షల యూనిట్లు అమ్ముడైంది. కేవలం రెండు సంవత్సరాల్లో 3 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనికి ప్రధాన కారణం దీని తక్కువ ధర.

భారతదేశంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7,52,000 నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ ధర రూ. 13,04,000 వరకు ఉంది. ఈ తక్కువ ధర కారణంగా, మారుతి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1,34,735 కార్లను విక్రయించింది. ఈ కారుకు డిమాండ్ పెరగడంతో, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,66,216 కార్లు అమ్ముడయ్యాయి. వార్షికంగా 23.36 శాతం వృద్ధిని సాధించడం ద్వారా రెండు సంవత్సరాలలో మొత్తం 3,00,951 కార్లు అమ్ముడయ్యాయి.
భారతదేశంలో, మారుతి సుజుకి ఫ్రాంక్స్ టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, కియా సైరస్, స్కోడా కైలాక్ వంటి కార్లకు పోటీనిస్తుంది. ఈ కారులో 9-అంగుళాల HD స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, అర్కామిస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 360-డిగ్రీ వ్యూ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో హెడ్-అప్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.

భద్రత విషయానికి వస్తే, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్-హోల్డ్ అసిస్ట్, రోల్ ఓవర్ మిటిగేషన్‌తో ESP, 3-పాయింట్ ELR సీట్ బెల్ట్‌లు, EBD, బ్రేక్ అసిస్ట్‌తో ABS, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌ల వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
ఫ్రాంక్స్ ఇంజన్ విషయానికి వస్తే, 1.2-లీటర్ డ్యూయల్-జెట్ డ్యూయల్-VVT పెట్రోల్, 1.0-లీటర్ టర్బో బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలు ఉన్నాయి. 1.2-లీటర్ ఇంజన్ 5-స్పీడ్ MT లేదా 5-స్పీడ్ AMTతో వస్తుంది. 1.0-లీటర్ ఇంజన్ 5-స్పీడ్ MT, 6-స్పీడ్ AT ఎంపికలను కలిగి ఉంది.
1.2-లీటర్ ఇంజన్ 5-స్పీడ్ MTతో సీఎన్జీ ఆఫ్షన్ కూడా కలిగి ఉంది. 1.0 MTకి లీటరుకు 21.5కి.మీ, 1.0 ATకి లీటరుకు 20.01కి.మీ, 1.2 MTకి లీటరుకు 21.79 కి.మీ, 1.2 AMTకి లీటరకు 22.89కి.మీ, 1.2 MT CNGలో లీటరుకు 28.51 కి.మీ. మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.మారుతి సుజుకి ఫ్రాంక్స్ భారతీయ మార్కెట్లో ఒక సంచలనం సృష్టిస్తుంది. దీని తక్కువ ధర, అధునాతన ఫీచర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








