సాహస యాత్రికులు ఇక సిద్దం కండి..! ఆఫ్‌రోడ్ రేసింగ్‌లో రెచ్చిపోండి.. మీ కోసమే మారుతీ అడ్వెంచర్
దేశీయ అతిపెద్ద వాహన తయారీదారు మారుతీ సుజుకీ ప్రతి ఏడాది కూడా సేల్స్ పరంగా ముందు స్థానంలో ఉంటుంది. మధ్యతరగతి వినియోగదారులను ఎక్కువగా టార్గెట్ చేస్తూ, కంపెనీ తన కార్లను అందుబాటు ధరలో విడుదల చేస్తూ దేశీయ ప్రజల్లో పేదల కలను నెరవేర్చే కంపెనీగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. గత ఏడాది 2024లో మొత్తం కార్ల సేల్స్ పరంగా మొదటి స్థానంలో నిలిచిన మారుతీ, కొత్త ఏడాది 2025లో కూడా తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఈ సంవత్సరం కూడా అధునాతన ఫీచర్లతో కూడిన మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇదే క్రమంలో కంపెనీ తన ప్రసిద్ధ మోడల్ గ్రాండ్ విటారా (Grand Vitara) కారుకు కొత్త వెర్షన్ అడ్వెంచర్ డిజైన్‌ను ఆవిష్కరించింది. దీనిని ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఒక కాన్సెప్ట్ కారుగా ప్రదర్శనకు ఉంచింది.
మారుతీ గ్రాండ్ విటారా ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో ఉండగా, దీనికి కొనసాగింపుగా ప్రత్యేక ఎడిషన్ అడ్వెంచర్ వెర్షన్‌ను తీసుకొస్తుంది. ఈ కొత్త కారు డిజైన్ సరికొత్తగా ఉంది. అడ్వెంచర్ కాన్సెప్ట్ ఆర్మీ గ్రీన్ కలర్ స్కీమ్‌తో బ్లాక్ రూఫ్‌తో కనిపిస్తుంది. ఎక్స్‌టీరియర్ గ్రాఫిక్ మొత్తం చాలా ఆకర్షణీయంగా ఉంది. అడ్వెంచర్ పేరుకు తగ్గట్టుగానే దీని రూపం, గ్రాఫిక్ డిజైన్ ఉన్నాయి. మారుతీ ప్రదర్శించిన ఈ కారు చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తుంది.

గ్రాండ్ విటారా అడ్వెంచర్ వెర్షన్‌ను సైడ్ నుంచి చూసినట్లయితే స్టిక్కర్లు చాలా స్టైలిష్‌గా అనిపిస్తాయి. 4X4' ఆల్-గ్రిప్ స్టిక్కర్‌తో కూడిన ప్రత్యేక గ్రాఫిక్స్ ఆకట్టుకుంటుంది. డజన్ల కొద్ది ఉన్న కార్ల గుంపులో కూడా దీని డిజైన్‌ను చూసి ఈజీగా గుర్తుపట్టేయచ్చు. '4X4' ఆల్-గ్రిప్ స్టిక్కర్ కింది భాగంలో 'ఆల్ గ్రిప్' అని కనిపిస్తుంది, దీనర్ధం ఆల్-వీల్-డ్రైవ్ (AWD) డ్రైవ్‌ట్రైన్‌ను సూచిస్తుంది. ఇది ఆఫ్ రోడ్ ప్రయాణాలకు బాగా సెట్ అవుతుంది.
కారు రూఫ్ భాగంలో ఒక క్యారియర్ సెటప్ ఉంది. దీనిని చూసినట్లయితే అడ్వెంచర్ రైడ్‌ను సూచించే, ఆఫ్‌రోడ్ కారుగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ క్యారియర్‌లో సాహసాలకు వెళ్లే వారు తమ లగేజీని పెట్టుకోవచ్చు. వారికి అవసరమైన వస్తువులను లోడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీని అల్లాయ్ వీల్స్ బ్లాక్ కలర్‌లో చూడటానికి అట్రాక్టివ్‌గా ఉన్నాయి. వెనుక నుంచి చూసినట్లయితే సాధారణ గ్రాండ్ విటారా వెర్షన్‌ను పోలి ఉంటుంది.

కాని స్వల్పంగా కొన్ని మార్పులు మాత్రం గమనించవచ్చు. టెయిల్‌గేట్‌పై 'ఆల్ గ్రిప్' బ్యాడ్జ్ కలిగి ఉంటుంది. LED టెయిల్ లైట్లు స్మోక్ చేయబడినట్లు ఉన్నాయి. రిఫ్లెక్టర్, బంపర్ బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది. గ్రాండ్ విటారా అడ్వెంచర్ వెర్షన్ కాన్సెప్ట్ కారు 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌లో లభిస్తుంది. ఇది తేలికపాటిది. ఈ ఇంజిన్ 103 PS పవర్, 137 Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు జత చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి మారుతీ గ్రాండ్ విటారా ప్రారంభ ధర రూ.10.99 లక్షల నుంచి రూ.20.09 లక్షల వరకు ఉంది. రాబోయే గ్రాండ్ విటారా అడ్వెంచర్ వెర్షన్ ధర ఇంచుమించు ఇదే రేంజ్‌లో ఉండవచ్చు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం మా డ్రైవ్‌స్పార్క్ సోషల్ మీడియా పేజీలను ఫాలో అవ్వండి. మా తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.


Click it and Unblock the Notifications








