సినిమా తారలు, మిడిల్ క్లాస్ వారు ఇష్టంగా కొనే కారుకు ఏమైంది? ఒకప్పుడు క్యూ.. ఇప్పుడు వద్దంటున్నారు!
మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) ఒకప్పుడు మార్కెట్లో దుమ్మురేపిన SUV. దాని ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన పనితీరు, అధునాతన ఫీచర్ల వలన ఇది భారతీయ వినియోగదారులను ఆకట్టుకుంది. అయితే, ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం, ఈ కారుకు ఎదురవుతున్న ఆదరణలో పడిపోవడం కనిపిస్తోంది. 2025 జూన్‌లో గ్రాండ్ విటారా SUV అమ్మకాలు 6,828 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇది గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే దాదాపు 29 శాతం తగ్గుదలగా చెప్పవచ్చు. 2024 జూన్‌లో 9,679 యూనిట్లు అమ్ముడవడం గమనార్హం. ఈ గణాంకాలు చూస్తే, ఏడాది ప్రాతిపదికన పరంగా ఈ మోడల్ ప్రస్తుతానికి కొంత వెనుకబడి పోతున్నట్టు స్పష్టమవుతుంది.
2024 మొదటి ఐదు నెలల విక్రయాల రికార్డులు కూడా అదే విధంగా సంకేతాలు ఇస్తున్నాయి. జనవరిలో 15,784 యూనిట్లు అమ్ముడవ్వగా, ఫిబ్రవరిలో 10,669 యూనిట్లకు పడిపోయింది. మార్చిలో విక్రయాలు కాస్త మెరుగై 10,418 యూనిట్లను తాకాయి. కానీ ఏప్రిల్‌లో అది 7,154కి దిగజారింది. మే నెలలో విక్రయాలు మరింత తగ్గి 5,197 యూనిట్లకు చేరుకున్నాయి. జూన్‌లో ఈ సంఖ్య 6,828కి పెరిగినా, గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం కొంత లోపించింది.

గ్రాండ్ విటారా అమ్మకాలలో వచ్చిన తగ్గుదలకు పలు కారణాలు ఉన్నప్పటికీ, కొన్ని ముఖ్యమైన అంశాలు స్పష్టంగా దీనికి దారితీశాయి. ప్రారంభంలో దాని డిజైన్, మైలేజ్, హైబ్రిడ్ టెక్నాలజీ వలన మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే, రాను రాను ఆటోమొబైల్ రంగంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇతర బ్రాండ్‌లు తమSUVలను మార్కెట్లోకి ప్రవేశపెట్టి, మరింత ఆకర్షణీయమైన ఫీచర్లు, అత్యాధునిక టెక్నాలజీ, మరియు పోటీ ధరలతో వినియోగదారులను ఆకట్టుకోవడం ప్రారంభించాయి.
ఫలితంగా, గ్రాండ్ విటారా సమకాలీన మోడళ్లతో పోలిస్తే కొంత వెనుకబడినట్టు అనిపించింది. మారుతి కంపెనీ ఇటువంటి పరిస్థితుల్లో మార్కెట్‌ను తిరిగి ఆకర్షించేందుకు కొత్త ఆఫర్లు, ఫీచర్లు, లేదా ఫేస్‌లిఫ్ట్ మోడళ్లను ప్రవేశపెట్టే అవకాశముంది. మారుతి గ్రాండ్ విటారా SUV ఇప్పటికీ మంచి కారే అయినా, మార్కెట్లో దాని పట్టు కొంత నెమ్మదిగా తగ్గుతోంది. దీన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కంపెనీకి మేలు వ్యూహాలు అవసరం.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా SUV, మధ్యతరగతి, సంపన్న వినియోగదారుల కోసం రూపొందించబడిన కారు. సినిమా తారల నుంచి మొదలుకుని సాధారణ ప్రజలు వరకు అందరు కొనుగోలు చేయడానికి ఆకట్టుకుంటుంది. ధర పరంగా చూస్తే, ఇది సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. రూ.11.42 లక్షల ప్రారంభ ధరతో ప్రారంభమయ్యే ఈ SUV, టాప్ వేరియంట్‌గా రూ.20.68 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు పోతుంది.
ఈ ధరల శ్రేణి, దీన్ని విభిన్న విభాగాల వినియోగదారులకు అందుబాటులోకి తేవడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అలానే, గ్రాండ్ విటారా ఎక్స్‌టీరియర్ డిజైన్ కూడా మరింత ఆధునికంగా, ఆకర్షణీయంగా మారింది. గ్రాండియర్ గ్రే, మిడ్‌నైట్ బ్లాక్, నెక్సా బ్లూ, ఒపులెంట్ రెడ్, స్ప్లెండిడ్ సిల్వర్ వంటి వైవిధ్యమైన కలర్స్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. వీటి కారణంగా ఇది రోడ్డుపై ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తోంది.

పెర్ఫార్మెన్స్ విషయంలో ఈ SUV మూడు శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ ఆ్షప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (పెట్రోల్+ఎలక్ట్రిక్), 1.5 లీటర్ CNG వేరియంట్ ఉన్నాయి. ట్రాన్స్‌మిషన్ పరంగా ఇది 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, e-CVT గేర్‌బాక్స్ లను అందిస్తుంది. ఇది వేరియంట్‌పై ఆధారపడి 19 నుండి 28 కిలోమీటర్లు లీటర్‌కు మైలేజ్ ఇవ్వగలదు.


Click it and Unblock the Notifications








