27 కి.మీ మైలేజ్, 5 సీట్లు.. సామాన్యులతో పాటు సినీ తారలు ఇష్టంగా కొంటున్న కారు.. గత నెలలో ఎంతమంది కొన్నారంటే?
దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (maruti suzuki) అమ్మకాల పరంగా దేశంలో మొదటి స్థానంలో ఉంటుంది. ప్రతి నెలా ముగియగానే తన కార్ల సేల్స్ వివరాలను వెల్లడిస్తుంది. తాజాగా ప్రసిద్ధ SUV గ్రాండ్ విటారా (grand vitara)కు సంబంధించిన అమ్మకాల డేటాను విడుదల చేసింది. ఇది భారతీయ మార్కెట్లో అత్యధికంగా సేల్స్ సాధించిన SUVల లిస్ట్‌లో ఏడవ స్థానంలో నిలిచింది. అధునాతన డిజైన్, అదిరిపోయే ఫీచర్స్‌తో దేశంలోని సామాన్యుడి నుంచి మొదలుకుని సినిమా తారల వరకు అందరూ ఈ ఎస్‌యూవీని ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. చూడగానే లగ్జరీ లుక్‌తో కట్టిపడేసే గ్రాండ్ విటారా ఫిబ్రవరి 2025లో దాదాపు 10,669 యూనిట్ల అమ్మకాలను సాధించింది.
అయితే ఇది గత ఏడాది 2024 ఫిబ్రవరి నెలలో 11,002 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేయగా, ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే సేల్స్ 3 శాతం తగ్గిపోవడం గమనార్హం. అయితే ఈ కారు అన్ని వర్గాల ప్రజలను అట్రాక్ట్ చేస్తున్నప్పటికీ గత నెలలో అమ్మకాలు తగ్గిపోవడంపై ఎలాంటి కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అయినప్పటికీ కూడా సమీక్ష నెలలో అత్యధికంగా అమ్ముడైన SUVల జాబితాలో ఏడో స్థానంలో నిలవడం విశేషం.

దీనికి ముందు జనవరి నెలలో కూడా గ్రాండ్ విటారా కార్లు సక్సెస్ ఫుల్‌గా 15,784 యూనిట్ల అమ్మకాలను సాధించింది. అలాగే గత ఏడాది 2024లో కూడా ఓవరాల్‌గా మెరుగైన సేల్స్ నమోదయ్యాయి. డిసెంబర్‌లో 7,093 యూనిట్లు అమ్ముడుపోగా, నవంబర్‌లో 10,148 యూనిట్లు, అక్టోబర్‌లో 14,083 యూనిట్లు, సెప్టెంబర్‌లో 10,267 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ప్రతినెలా కూడా సగటున 10 వేల కంటే ఎక్కువ మంది కొనుగోలు చేశారు.
ప్రస్తుతం గత నెలలో అమ్మకాలు స్వల్పంగా తగ్గినప్పటికీ ఇది కొద్ది రోజుల వరకు మాత్రమే అని తర్వాత సేల్స్ బాగా పుంజుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని మారుతీ సుజుకీ పేర్కొంటుంది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో మారుతీ గ్రాండ్ విటారా ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 11.19 లక్షల నుంచి మొదలై టాప్ వేరియంట్ ధర రూ.20.09 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ వచ్చేసరికి స్వల్పంగా పెరుగుతాయి.

గ్రాండ్ విటారా సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫాతో వంటి పలు వేరియంట్లలో కొనుగోలుకు లభిస్తుంది. కలర్స్ విషయానికి వస్తే, స్ప్లెండిడ్ సిల్వర్, నెక్సా బ్లూ, ఒపులెంట్ రెడ్ వంటి వాటిలో అందుబాటులో ఉంటుంది. ఇది శక్తివంతమైన 1.5-లీ. మైల్డ్ హైబ్రిడ్ (పెట్రోల్+ఎలక్ట్రిక్), 1.5-లీ. బలమైన హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్‌లను కలిగి ఉంటుంది. అలాగే ఇది Cng పవర్‌ట్రెయిన్‌ను కూడా కలిగి ఉంది. ఇంజిన్ పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది.
గేర్‌బాక్స్ విషయానికి వస్తే, 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, e-CVT ట్రాన్స్‌మిషన్‌ను ఇంజిన్‌కు జోడించారు. మైలేజ్ 19.38 నుండి 27.97 kmpl వరకు వస్తుంది. మారుతి గ్రాండ్ విటారాలో 5 మంది కలిసి హాయిగా ప్రయాణించడానికి అనువైన సీట్లు ఉన్నాయి. డజన్ల కొద్ది ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి. 9-అంగుళాలు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఆప్షన్లు దీనిలో అందించారు.

ఫ్యామిలీతో కలిసి టూర్స్ లాంటి వాటికి వెళ్లే సమయంలో ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి 373 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ప్రయాణంలో సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగులు ఉంటాయి. ఇంకా టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, చుట్టూ చూడటానికి 360-డిగ్రీల సరౌండ్ కెమెరా వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








