రూ. 4 లక్షలకే 34 కి.మీల మైలేజ్.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు.. పేద, మిడిల్ క్లాస్ ఫేవరెట్.. ఏప్రిల్ సేల్స్ రిపోర్ట్
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీకి చెందిన ఆల్టో K10 (Alto K10) ఒకప్పుడు చిన్న కార్ల విభాగంలో బాగా డిమాండ్ ఉన్న హ్యాచ్‌బ్యాక్. తక్కువ ధర, మంచి మైలేజ్, ఆకర్షణీయమైన డిజైన్ కారణంగా ఇది ఎన్నో కుటుంబాలకు మొదటి కారుగా నిలిచింది. చిన్న నగరాల నుండి పెద్ద పట్టణాల వరకు, ఆల్టో K10 తన మినీ కార్ విభాగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు అత్యంత అనువైన మోడల్. ఇంతటి ప్రజాదరణ ఉన్నా, ఇటీవలి కాలంలో ఆల్టో K10 అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. 2025 ఏప్రిల్ నెలలో, మారుతీ సుజుకీ ఈ మోడల్‌కి సంబంధించి కేవలం 5,606 యూనిట్లను మాత్రమే విక్రయించింది.
గత సంవత్సరం ఇదే ఏప్రిల్ నెలలో విక్రయించిన యూనిట్ల సంఖ్య 9,043. ఈ రెండింటిని పోలిస్తే, అమ్మకాల సంఖ్య ఏకంగా 38 శాతం తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ఎంతో ప్రజాధారణ పొందిన మోడల్ అమ్మకాలు క్రమంగా కస్టమర్ల నుంచి తక్కువ ఆదరణ పొందడానికి అనేక కారణాలు ఉన్నాయి. వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయి. సరికొత్త మోడళ్లు, టెక్నాలజీతో కూడిన ఫీచర్లు ఉన్న కార్లవైపు వారు మరింత ఆకర్షితులవుతున్నారు.

మారుతున్న BS6 విధానాలు, ఇతర కార్ల నుంచి బలమైన పోటీ కారణంగా ప్రస్తుత ఆల్టో K10 తన పాత గ్లామర్‌ను కొంత మేర కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మారుతీ సుజుకీ ఆల్టో K10 అమ్మకాలలో ఊహించని హెచ్చుతగ్గులు కనిపించాయి. జనవరి 2025లో ఈ హ్యాచ్‌బ్యాక్ 11,352 యూనిట్లతో మంచి ఆరంభాన్ని నమోదుచేసింది. ఫిబ్రవరిలో మాత్రం ఈ సంఖ్య కొద్దిగా తగ్గి 8,541 యూనిట్లకు చేరింది.
మార్చి నెలలో మళ్లీ అమ్మకాలు కొంత మెరుగై 9,867 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే, అమ్మకాల లెక్కలు స్థిరంగా ఉండకపోవడం స్పష్టంగా తెలుస్తోంది. అంతకు ముందు నెల డిసెంబర్ 2024లో 7,410 యూనిట్లు, నవంబర్‌లో 7,467 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే, నెలనెలా ఈ కారుకు ఉన్న డిమాండ్ స్పష్టంగా మారుతూ వస్తోంది. ఈ అమ్మకాలు తగ్గటం వెనక కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

అయితే మార్కెట్ వర్గాల అభిప్రాయం ప్రకారం, దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ ప్రస్తుతం వేగంగా మారుతోంది. వినియోగదారులు సాంప్రదాయ హ్యాచ్‌బ్యాక్‌లకంటే, స్టైలిష్ డిజైన్లు, లేటెస్ట్ ఫీచర్లు కలిగిన SUVలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు. మార్కెట్లోకి ప్రవేశిస్తున్న కొత్త మోడళ్లు, ఆకర్షణీయమైన డిజైన్, టెక్నాలజీ, భద్రతా పరంగా మెరుగైన అంశాలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో, ఆల్టో K10 లాంటి క్లాసిక్ హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు క్రమంగా వెలుగు కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 4.23 లక్షల నుంచి రూ. 6.21 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. పేద, మధ్య తరగతి వారికి ఇది అందుబాటు ధర అని చెప్పవచ్చు. పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, ఎకానమీక్ ఎంపికగా CNG వేరియంట్ కూడా లభిస్తుంది. పెట్రోల్ 24 కి.మీలు, సీఎన్‌జీ 34 కి.మీల వరకు ఇస్తుంది.

కొత్త మారుతీ ఆల్టో K10 ఆకర్షణీయమైన కర్వ్స్, మినిమలిస్ట్ డిజైన్, కొత్త హెడ్‌ల్యాంప్-గ్రిల్‌తో ఇది చిన్న వాహనంగా ఉన్నా స్మార్ట్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇంకా, మెటాలిక్ సిజ్లింగ్ రెడ్, మెటాలిక్ సిల్కీ సిల్వర్, గ్రానైట్ గ్రే,యు స్పీడీ బ్లూ వంటి పలు కలర్స్ లభించడం వినియోగదారులకు మరింత ఎంపికలు కల్పిస్తుంది. దీనిలో 6 ఎయిర్‌బ్యాగులు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) ఉన్నాయి.


Click it and Unblock the Notifications








