బైకుతో పాటు సమానంగా మైలేజ్ ఇచ్చే కారు.. ధర కూడా తక్కువే.. ఈ కారు కోసం షోరూమ్‌ల వద్ద రద్దీ!

మారుతి సుజుకి బాలెనో (maruti suzuki baleno) ఎప్పటినుంచో దేశీయ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సొగసైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, విశాలమైన ఇంటీరియర్, మంచి మైలేజ్ వంటి అంశాల వల్ల ఇది వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. సాధారణ హ్యాచ్‌బ్యాక్‌లతో పోల్చితే ప్రీమియం టచ్ కలిగిన ఈ మోడల్, మారుతి సుజుకి నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉండటం కూడా దీన్ని ప్రత్యేకంగా నిలిపింది. ఒకవైపు యూత్‌కు ఆకర్షణీయమైన లుక్, మరోవైపు కుటుంబానికి సరిపడే ప్రాక్టికాలిటీని కలగలిపినందువల్ల బాలెనో ఎప్పుడూ హాట్‌ సేలర్‌గా నిలుస్తూ వస్తోంది. తాజాగా విడుదలైన ఆగస్టు 2025 సేల్స్ గణాంకాలు కూడా ఈ విషయాన్నే రుజువు చేశాయి.

ఆగస్టు 2025 ఒకే నెలలో 12,549 యూనిట్లు డెలివరీ అవ్వడం ద్వారా బాలెనో తన ప్రజాదరణను మరోసారి నిరూపించింది. గత ఏడాది ఇదే కాలంలో 12,485 యూనిట్లు అమ్ముడైన విషయం గుర్తుంచుకుంటే, ఈసారి అమ్మకాల పరిమాణం కాస్త పెరిగిందని స్పష్టమవుతోంది. నిజానికి ఈ పెరుగుదల శాతం పరంగా 0.51% మాత్రమే అయినప్పటికీ, మార్కెట్‌లో హ్యాచ్‌బ్యాక్ విభాగం పోటీని పరిగణనలోకి తీసుకుంటే ఇది మంచి సూచికగా భావించవచ్చు.

Maruti Suzuki Hatchback Baleno August 2025 Sales 0 51 Percent Growth Details

బలమైన పోటీ ఉన్నప్పటికీ బాలెనోకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. కొత్త డిజైన్ అప్‌డేట్స్, టెక్నాలజీ ఫీచర్లు, సేఫ్టీ మెరుగుదలలు, మారుతి సుజుకి విశ్వసనీయత అన్నీ కలిపి వినియోగదారులు ఈ మోడల్‌ను ఇంకా ఎక్కువగా నమ్మేలా చేశాయి. ఫ్యామిలీ కారు కావాలనుకునే వాళ్లకీ, స్టైలిష్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కావాలనుకునే యువతకీ ఇది ఒకే సమయంలో సరిపోవడం బాలెనోకు అతిపెద్ద బలంగా చెప్పుకోవచ్చు. ఇది పనితీరుతో పాటు, మైలైజ్ పరంగా ఆకట్టుకుంటుంది.

మారుతి బాలెనో ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. ప్రస్తుతం దీని ధర రూ.6.74 లక్షల నుండి రూ.9.96 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఆటోమొబైల్ రంగానికి పెద్ద ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త కార్లపై జీఎస్టీ రేటును 28% నుండి 18%కి తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త పన్ను రేటు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానుంది.

Maruti Suzuki Hatchback Baleno August 2025 Sales 0 51 Percent Growth Details

దీంతో మరికొద్ది రోజుల్లో బాలెనో ధరలో గణనీయమైన తగ్గుదల చోటుచేసుకునే అవకాశం ఉంది. డిజైన్ పరంగా ఆకర్షణీయంగా ఉండే ఈ కారు ఐదుగురు ప్రయాణికులు సౌకర్యంగా కూర్చునేలా రూపొందించబడింది. సౌలభ్యం, భద్రత, ఫీచర్లతో పాటు శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌ కూడా బాలెనోకు ప్రత్యేకతను ఇస్తుంది. ఇది రెండు వేరే ఇంజిన్ ఎంపికలతో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2-లీటర్ CNG ఇంజిన్‌లలో లభిస్తుంది.

వినియోగదారుల అవసరాన్ని బట్టి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందవచ్చు. ఫ్యామిలీ కారు కావాలని కోరుకునే వారికి ఇది మంచి మైలేజ్‌ను అందిస్తుంది. వేరియంట్‌పై ఆధారపడి, బాలెనో 22 kmpl నుండి 30 kmpl వరకు ఇంధన సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇది కొన్ని బైకులతో పాటు సమానంగా ఇచ్చే మైలేజ్.దీని 37 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం రోజువారీ ఉపయోగంలోనే కాకుండా లాంగ్ డ్రైవ్‌లలో కూడా ఉపయోగపడుతుంది.

Maruti Suzuki Hatchback Baleno August 2025 Sales 0 51 Percent Growth Details

ఈ కారులో అత్యాధునిక ఫీచర్స్ ఉంటాయి. లోపల 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక AC వెంట్స్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, క్రూయిజ్ కంట్రోల్, పవర్ స్టీరింగ్, USB ఛార్జింగ్ పోర్ట్‌లు, భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగులు, EBD(ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ABS(యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Monday, September 15, 2025, 17:29 [IST]
English summary
Maruti suzuki hatchback baleno august 2025 sales 0 51 percent growth details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+