చిన్న కుటుంబాల కోసమే ఈ కారు.. 34.43 కి.మీల మైలేజ్ ఇస్తుంది.. మారుతీ సుజుకీ పేరు నిలబెడుతుంది
భారతదేశంలో అతిపెద్ద వాహన తయారీదారుగా ఉన్నటువంటి మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఇండియా 2024 ఏడాదిలో కార్ల సేల్స్‌లో దేశంలోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. కొత్త ఏడాదిలో కూడా కంపెనీ ఇంకా ఎక్కువ అమ్మకాలను నమోదు చేయడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. అందులో భాగంగా 2025లో అధునాతన ఫీచర్లతో కూడిన కార్లను విడుదల చేయడానికి ఇప్పటికే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది. మారుతీ Nexa, Arena డీలర్‌షిప్‌ల ద్వారా ఆకట్టుకునే కార్లను వినియోగదారులకు విక్రయిస్తుంది. పాత ఏడాదికి ఘనంగా ముగింపు పలికిన కంపెనీ ఇటీవల వరుసగా తన కార్ల అమ్మకాల వివరాలను వెల్లడిస్తుంది. ఈ క్రమంలో మారుతీ తన హ్యాచ్‌బ్యాక్ మోడల్ సెలెరియో (celerio) డిసెంబర్ నెలకు సంబంధించిన సేల్స్ వివరాలను వెల్లడించింది. మారుతీ పేర్కొన్నదాని ప్రకారం, సెలెరియో 2024 డిసెంబర్‌లో 748 యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఇది గత ఏడాది (2023) డిసెంబర్‌లో 247 యూనిట్లు అమ్ముడుపోయింది.
ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే దాదాపు 203 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ హ్యాచ్‌బ్యాక్ మోడల్ చిన్న కుటుంబానికి చాలా అనువుగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో చాలా తక్కువ ధరలో కొనుగోలుకు లభిస్తుంది. 5 మంది కలిసి కారులో ప్రయాణించవచ్చు. భారత్‌లో చిన్న కుటుంబాల సంఖ్య చాలా వరకు పెరిగింది. దీంతో హ్యాచ్‌బ్యాక్ మోడళ్ల కొనుగోలుకు ప్రాధాన్యత ఏర్పడింది. అందుకే గత ఏడాది కంటే ఈ సారి సేల్స్ పెరిగాయి.

మారుతీ సుజుకీ సెలెరియో దేశంలో ఎల్‌ఎక్స్‌ఐ, విఎక్స్‌ఐ, జెడ్‌ఎక్స్‌ఐ వంటి వేరియంట్‌లలో కొనుగోలుకు లభిస్తుంది. దీని రూపం చిన్నగా ఉండడంతో పార్కింగ్ కూడా చాలా సులభం అవుతుంది. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో కార్ పార్కింగ్స్‌కు సరైన స్థలం లేక కార్ల యజమానులు చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇది చిన్న కారు కావడంతో రోడ్డుకు పక్కన లేదా తక్కువ ఖాళీ స్థలంలో కూడా ఈజీగా పార్కింగ్ చేయడానికి అనువుగా ఉంటుంది.
దీని ఇంజిన్ విషయానికి వస్తే, 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 67 PS పవర్‌ను, 89 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. అదే CNG మోడ్‌లో అయితే 57 PS పవర్, 82 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను మాత్రమే అందించారు. పెట్రోల్ వెర్షన్‌లో అయితే 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టంను ఇచ్చారు.

మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ కారు లీటర్‌కు 25.25 కి.మీల నుంచి 26.68 కి.మీల వరకు ఇస్తుంది. అదే CNG ఆప్షన్‌లో అయితే మాత్రం కిలో ఇంధనానికి ఏకంగా 34.43 కి.మీల వరకు వస్తుంది. సెలెరియో ప్రారంభ ధర రూ.6.43 లక్షల నుంచి ఉంటుంది, టాప్ వేరియంట్ ధర రూ.8.46 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు.
పండుగ సమయంలో తగ్గింపులను సద్వినియోగం చేసుకుంటే ఈ కారును మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులకు తక్కువ ధరలో లభిస్తున్నప్పటికి కూడా లోపల అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్ చాలా అందంగా ఉంటుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్, మాన్యువల్ AC, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, ఇంకా పలు స్మార్ట్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

ప్రయాణికుల భద్రతకు సంబంధించి కూడా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఇంకా EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), పార్కింగ్ సెన్సార్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి పలు సేఫ్టీ ఫీచర్స్‌ను సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌లో మారుతీ సుజుకీ అందించింది.


Click it and Unblock the Notifications








