సామాన్యుల కారుపై మారుతి భారీ డిస్కౌంట్.. ఏడాది చివర్లో ఇలాంటి ఆఫర్ ఎక్కడ దొరుకుతుంది?

మారుతి సుజుకి ఇగ్నిస్ (maruti suzuki ignis)... చిన్నదైనా చిట్టచివరి వరకు పెద్ద మనసు చూపించే కారు. భారత మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఈ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌కు మంచి గుర్తింపే కాదు, ప్రత్యేకమైన అభిమాన వర్గం కూడా ఏర్పడింది. చిన్న సైజ్, స్టైలిష్ లుక్స్, బలమైన బిల్డ్, విశ్వసనీయమైన ఇంజిన్.. ఇన్ని అంశాలు ఉండటమే కాకుండా పేదలు, మధ్యతరగతి కుటుంబాలు సైతం సులభంగా కొనగలిగేటట్లు అందుబాటు ధరలో లభించడం ఇగ్నిస్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెడుతుంది. నగర రోడ్లలో, ట్రాఫిక్‌లో, చిన్న చిన్న ప్రయాణాల్లో ఇగ్నిస్ ఇచ్చే ఫ్లెక్సిబిలిటీ, స్మూత్ డ్రైవింగ్ అనుభవం చాలా మందిని ఆకట్టుకుంటుంది. కాబట్టే ఈ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ ప్రతి నెలా ఒక స్థిరమైన అమ్మకాలతో ముందుకు సాగుతుంది.

ఇప్పుడేమో ఏడాది చివర్లో ఈ కారుపై మారుతి సుజుకి భారీ ఆఫర్‌లను ప్రకటించింది. డిసెంబర్ 2025 నెలలో నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించబడుతున్న ఇగ్నిస్‌ కొనుగోలు దారులకు రూ. 80,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్లను కొనుగోలు చేస్తే మొత్తం రూ. 80,000 వరకు తగ్గింపు వర్తించగా, ఆటోమేటిక్ (AMT) వేరియంట్లకు కూడా రూ. 60,000 వరకు లాభం పొందొచ్చు.

Maruti Suzuki Ignis Year End Discount 80000 In December 2025 Details

సంవత్సర ముగింపు సందర్భంగా ఇంత పెద్ద ఆఫర్ రావడం వల్ల, ఇగ్నిస్‌ను తీసుకోవాలని ఆలోచిస్తున్న చాలామందికి ఇది గోల్డెన్ ఛాన్స్‌గా మారింది. చిన్న కుటుంబం కోసం, రోజువారీ ప్రయాణాల కోసం, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో నమ్మకమైన కారు కోసం చూస్తున్న వారందరికీ ఇగ్నిస్ ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన డీల్‌గా నిలుస్తోంది. ఇంత భారీ తగ్గింపును ఉపయోగించుకుని తక్కువకే కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు.

ఇలాంటి భారీ డిస్కౌంట్‌లు మారుతి తరచుగా ఇవ్వదు కనుక, ఈ అవకాశం చాలా మందిని షోరూమ్‌ల వైపు తిప్పేసింది! ఇగ్నిస్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నప్పటికీ, వాటి పూర్తి వివరాలను తెలుసుకోవాలంటే మీ సమీపంలోని మారుతి సుజుకి నెక్సా డీలర్‌షిప్‌ను సంప్రదించడం అత్యంత మంచిది. ఎందుకంటే రాష్ట్రాన్ని బట్టి, వేరియంట్‌ను బట్టి ఆఫర్‌లు కొద్దిగా మారే అవకాశం ఉంటుంది.

Maruti Suzuki Ignis Year End Discount 80000 In December 2025 Details

ప్రస్తుతం, ఇగ్నిస్‌ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.35 లక్షల నుంచి రూ.7.42 లక్షల వరకు ఉంది. ఇదే సమయంలో, ఇటీవల అమల్లోకి వచ్చిన GST 2.0 ప్రభావంతో ఇగ్నిస్ ధరల్లో గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. వేరియంట్‌ను బట్టి రూ. 49,900 నుంచి రూ. 70,000 వరకు ధర తగ్గడం వినియోగదారులకు పెద్ద రిలీఫ్‌ను అందించింది. ఈ తగ్గింపు తర్వాత ఇగ్నిస్ మరింత అందుబాటులోకి వచ్చి, బడ్జెట్‌ సెగ్మెంట్‌లో మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది.

పనితీరు విషయానికి వస్తే, ఇగ్నిస్‌లో ఉన్న 1.2-లీటర్ నాలుగు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తన స్మూత్ పవర్ డెలివరీకి ప్రసిద్ధి చెందింది. ఇది 83 bhp పవర్, 113 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది నగర రోడ్లలోనూ, హైవే డ్రైవింగ్‌లోనూ సమర్థవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. కొనుగోలుదారులు తమ అవసరాల మేరకు ఈ కారును 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో తీసుకోవచ్చు.

Maruti Suzuki Ignis Year End Discount 80000 In December 2025 Details

ఇది గరిష్టంగా 20.89 kmpl మైలేజ్‌ను అందిస్తుంది. రోజువారీ ప్రయాణాలు చేసే వాడిగా ఉంటే, ఈ మైలేజ్ ఖచ్చితంగా మీ ఇంధన వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. భద్రత పరంగా దీనిలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, EBDతో ABS, వెనుక పార్కింగ్ సెన్సార్లు, హై-స్పీడ్ అలర్ట్, సీట్ బెల్ట్ రిమైండర్లు, ప్రీ-టెన్షనర్లు, లోడ్ లిమిటర్లు, ఇంకా పిల్లల రక్షణకు అవసరమైన ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్‌లు ఈ కారులో ప్రామాణికంగా లభిస్తాయి.

More from DriveSpark

Article Published On: Saturday, December 6, 2025, 7:30 [IST]
English summary
Maruti suzuki ignis year end discount 80000 in december 2025 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+