షోరూమ్‌ల ముందు క్యూ లైన్ మామూలుగా లేదు! మారుతీ మ్యాజిక్ వర్కౌట్ అయింది

ఏప్రిల్ నెల ముగిసి మే నెలలోకి అడుగుపెట్టాం. ఈ క్రమంలో వాహన తయారీదారులు తమ అమ్మకాల వివరాలను వెల్లడిస్తుంటారు. ఈ నేపథ్యంలో దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ అయిన మారుతీ సుజుకీ (Maruti Suzuki)తన అమ్మకాల నివేదికను వెల్లడించింది. దీని ప్రకారం, ఏప్రిల్ 2025లో కంపెనీ మొత్తం 1,79,791 కార్లను విక్రయించింది. ఈ మొత్తంలో దేశీయంగా జరిగిన విక్రయాలతో పాటు ఇతర దేశాలకు చేసిన ఎగుమతులు కూడా ఉన్నాయి. సేల్స్ నివేదిక ప్రకారం, ఇండియా మార్కెట్లో విక్రయించిన కార్ల సంఖ్య 1,42,053గా నమోదైంది. ఇది లోకల్‌గా వినియోగదారులు మారుతీ సుజుకీ బ్రాండ్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది.

విక్రయాల్లో ఒక చెప్పుకోదగ్గ విషయం మారుతీ సుజుకీ తయారు చేసే లైట్ కమర్షియల్ వెహికల్, సూపర్ క్యారీ కూడా ఈ అమ్మకాల్లో భాగమవ్వడం. చిన్న వ్యాపారాల నుంచి మధ్యతరగతి వాణిజ్య అవసరాల వరకు విస్తృతంగా వినియోగించబడే ఈ వాహనం, కంపెనీ వాణిజ్య విభాగంలో అమ్మకాలకు బలాన్ని చేకూర్చే అంశంగా నిలుస్తోంది. మొత్తంగా చూస్తే, ఏప్రిల్ నెల అమ్మకాల వివరాల ప్రకారం మారుతి సుజుకి తన మార్కెట్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది.

Maruti Suzuki

అలాగే భారతదేశం నుంచి ఇతర దేశాలకు జరిగిన ఎగుమతులు చూసినట్లయితే ఈ కాలంలో మొత్తం 27,911 కార్లను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసింది. భారతదేశంలో తయారైన కార్లకు విదేశాల్లోనూ ఆదరణ ఉండడం, మారుతీ సుజుకీ నాణ్యతా ప్రమాణాలకు చిహ్నంగా భావించవచ్చు. అంతేగాక, ఈ నెలలో మారుతీ సుజుకీ టయోటా సంస్థకు 9,827 కార్లను సరఫరా చేసింది. ఎందుకంటే, గత కొన్ని సంవత్సరాలుగా టయోటా-సుజుకి మధ్య స్ట్రాటజిక్ భాగస్వామ్యం కొనసాగుతోంది.

మారుతీ తయారు చేసే కొన్ని మోడళ్లను టయోటా స్వంత బ్రాండ్ పేరుతో తిరిగి మార్కెట్లో ప్రవేశపెడుతోంది. ఇది "రీ-బ్యాడ్జింగ్" అనే ప్రక్రియగా పేరుగాంచింది. ఈ ఒప్పందం క్రింద, మారుతీ సుజుకీ బాలెనో మోడల్‌కి సమానమైన టయోటా గ్లాంజా, అలాగే ఎర్టిగా మోడల్ ఆధారంగా రూపొందించిన టయోటా రూమియన్ వంటి కార్లు ఇప్పుడు మార్కెట్లో కనిపిస్తున్నాయి. దేశీయ విక్రయాల్లో మారుతీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే, విదేశీ మార్కెట్లో కూడా తన సత్తా చాటుతుంది.

Maruti Suzuki India Sales

మొత్తం మీద చూస్తే, ఏప్రిల్ 2025లో మారుతీ సుజుకీ మంచి అమ్మకాలను సాధించింది. దేశీయ మార్కెట్‌లో అమ్మకాలు, విదేశీ ఎగుమతులు, అలాగే టయోటాకు చేసిన కార్ల సరఫరాలతో కలిపి, సంస్థ మొత్తం 1,79,791 కార్లను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే నెల ఏప్రిల్ 2024లో నమోదైన 1,68,089 యూనిట్లతో పోల్చుకుంటే, సుమారు 6.96 శాతం వృద్ధిని సూచిస్తుంది. భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మారుతీ కొత్త మోడళ్లను తీసుకొస్తుంది.

ప్రస్తుతం మారుతీ సుజుకీ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో పలు ప్రజాదరణ పొందిన మోడళ్లను విక్రయిస్తోంది. వాటిలో ఆల్టో K10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్ వంటివి ముందు స్థానంలో ఉన్నాయి. అంతేగాక, సెడాన్ విభాగంలో డిజైర్, SUV విభాగంలో బ్రెజ్జా, MPV సెగ్మెంట్‌లో ఎర్టిగా, అలాగే వాణిజ్య అవసరాల కోసం ఈకో వ్యాన్‌ను కూడా కంపెనీ విక్రయిస్తోంది. మారుతీ సుజుకీ త్వరలో ఇ-విటారాను మార్కెట్లోకి అమ్మకానికి తీసుకురాబోతుంది.

Maruti Suzuki India April 2025 Sales

ఇది మాత్రమే కాకుండా, కొత్త 7-సీటర్ SUVలు, MPVలను కూడా విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. నివేదికల ప్రకారం, 7-సీటర్ MPV దాదాపు 32 kmpl వరకు మైలేజీని అందించగలదని తెలుస్తుంది. దీని ప్రారంభ ధర కేవలం రూ. 6 లక్షలుగా (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తుంది. త్వరలో విడుదల కాబోయే ఈ కొత్త కారుపై భారతీయ వినియోగదారుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, May 2, 2025, 13:16 [IST]
English summary
Maruti suzuki india april 2025 sales report details check here
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+