గత నెల మారుతీ కార్లలో ఈ మోడల్‌ను జనాలు ఎక్కువగా ఇష్టపడ్డారు.. దానికి అంత డిమాండ్ ఎందుకో?

భారతదేశంలోని ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా నిలిచిన మారుతీ సుజుకీ ఇండియా (Maruti suzuki india), తక్కువ ధరలో, అధునాతన ఫీచర్స్‌తో కూడిన మోడళ్లను విడుదల చేస్తూ కోట్లాది మందికి ఇష్టమైన ఎంపికగా ఉంది. భారతీయ ఆటోమొబైల్ రంగంలో తన స్థానాన్ని మరోసారి నిరూపించుకుంది. మార్చి 2025లో కంపెనీ 1,50,743 వాహనాలను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే నెలలో, అంటే మార్చి 2024లో విక్రయించిన 1,52,718 యూనిట్లతో పోలిస్తే సుమారుగా 1 శాతం తగ్గుదల. ఆటోమొబైల్ రంగంలో పెరుగుతున్న పోటీ, వినియోగదారుల ప్రాధాన్యాల్లో మార్పులు వంటి అంశాలతో పాటే, ఇతర కార్ల తయారీదారుల నుంచి బలమైన పోటీ కారణంగా సేల్స్ కొంత వరకు తగ్గాయి.

అయితే, ఈ గణాంకాలు తగ్గినప్పటికి, దేశీయ కార్ల మార్కెట్లో సంస్థ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇది మారుతీ సుజుకీ ఉత్పత్తుల పట్ల వినియోగదారుల్లో నమ్మకాన్ని, బ్రాండ్ విలవను స్పష్టంగా తెలియజేస్తుంది. నెలవారీ అమ్మకాల పరంగా పరిశీలించినప్పుడు, మార్చి 2025లో కంపెనీ తక్కువ అమ్మకాలను నమోదు చేసింది. ఫిబ్రవరిలో అమ్ముడైన 1,60,791 కార్లతో పోల్చితే, మార్చిలో అమ్మకాలు 1,50,743కు తగ్గిపోయాయి. ఇది సుమారు 6 శాతం క్షీణత.

Maruti Suzuki India March 2025 Sales

మార్చి 2025లో మారుతీ సుజుకీ అమ్మకాలలో స్విఫ్ట్ ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఈ నెలలో 17,746 యూనిట్ల అమ్మకాలతో ఈ హ్యాచ్‌బ్యాక్ మోడల్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అంతే కాక, ఇది గత సంవత్సరం మార్చితో పోలిస్తే 13 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఈ గణాంకాలు కేవలం మోడల్ పాపులారిటీనే కాక, వినియోగదారుల మద్దతును కూడా ప్రతిబింబిస్తుంది. స్విఫ్ట్‌ను అనుసరిస్తూ వ్యాగన్ఆర్ 17,175 కార్ల విక్రయాలతో రెండో స్థానంలో నిలిచింది.

మారుతీ సుజుకీ ప్రసిద్ధ మోడల్ ఎర్టిగా 16,804 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానాన్ని ఆక్రమించింది. ఈ మూడు మోడళ్ల మధ్య తక్కువ తేడా ఉన్నప్పటికీ, ప్రతి మోడల్ కూడా తనకంటూ ఒక ప్రత్యేకంగా వినియోగదారులను ఆకట్టుకోవడంలో విజయవంతమైంది. ఈ ట్రెండ్, మారుతీ విస్తృతమైన మోడల్ పోర్ట్‌ఫోలియో ఎలా విభిన్న అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా తీర్చగలదో స్పష్టంగా చూపుతోంది. మారుతీ హ్యాచ్‌బ్యాక్ నుండి ఎమ్‌పీవీల వరకు ఉన్న డిమాండ్‌ను తెలియజేస్తుంది.

Maruti Suzuki India cars

మార్చి 2025లో మారుతీ సుజుకీ బ్రెజ్జా, 16,546 యూనిట్ల అమ్మకాలతో మళ్లీ తన శక్తిని చాటింది. ఇది గత ఏడాది ఇదే సమయంలో నమోదైన గణాంకాలతో పోలిస్తే 13 శాతం వృద్ధిని చూపిస్తూ, SUV విభాగంలో వినియోగదారుల పెరుగుతున్న డిమాండ్‌ను తెలియజేస్తుంది. బ్రెజ్జా స్టైలిష్ రూపకల్పన, ఫీచర్లు పనితీరు వలన ఇది బెస్ట్ మోడల్‌గా ఉంది. ఇదే సమయంలో, డిజైర్ 15,460 కార్ల అమ్మకాలతో మంచి స్థాయిలో నిలిచింది.

అయితే, గత సంవత్సరంతో పోలిస్తే 3 శాతం స్వల్ప తగ్గుదల కనిపించింది. సెడాన్ విభాగంలో డిజైర్ ఇప్పటికీ ఆకర్షణీయమైన ఎంపికగా కొనసాగుతున్నప్పటికీ, హ్యాచ్‌బ్యాక్‌లతో పాటు SUVల పెరుగుతున్న ప్రభావం కొంతవరకు దీని పనితీరుపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఇక, ఫిబ్రవరిలో అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచిన ఫ్రాంక్స్, మార్చిలో 6వ స్థానానికి చేరుకుంది. 13,669 కార్ల అమ్మకాలతో ఇది 9 శాతం వృద్ధిని నమోదు చేయడంలో విజయవంతమైంది.

Maruti Suzuki India March 2025

గ్రాండ్ విటారా, ఇగ్నిస్ అమ్మకాల్లో వరుసగా 7 శాతం, 32 శాతం తగ్గుదల నమోదైంది. అదే సమయంలో, మారుతీ ఆల్టో మార్చి 2025లో 9,867 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయడంతో, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 6 శాతం వృద్ధిని సాధించింది. MPV విభాగంలో XL6 మోడల్ 3,105 కార్ల అమ్మకాలను, Eeco 10,409 కార్లను విక్రయిస్తూ బలమైన ప్రదర్శనను అందించింది.

More from DriveSpark

Article Published On: Monday, April 14, 2025, 7:30 [IST]
English summary
Maruti suzuki india march 2025 model wise sales report full details check here
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+