దేశంలోనే అందరికి ఇష్టమైన కార్ల కంపెనీ.. రికార్డుల మీద రికార్డులు.. 2024 సేల్స్‌లో దూసుకుపోయింది..

దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (MSIL) అమ్మకాల పరంగా ఇతర కంపెనీల కంటే కూడా ఎప్పుడు ముందు స్థానంలో ఉంటుంది. టాటా మోటార్స్, మహీంద్రా వంటి సంస్థలతో పోటీ పడుతూ, ప్రతి ఏడాది సేల్స్‌లో అగ్రస్థానం పొందుతుంది. 2024 ఏడాదిని కూడా మారుతీ మెరుగైన ఆశించిన అమ్మకాలతో ఘనంగా ముగింపు పలికింది. మధ్య తరగతి వినియోగదారులు అందుబాటు ధరలో కార్లను విడుదల చేసి 2023 ఏడాది కంటే ఎక్కువ కొత్త కస్లమర్లను సాధించింది. యుటిలిటీ వెహికల్స్, ప్యాసింజర్ కార్లు, లైట్ కమర్షియల్ వెహికల్స్ వంటి అన్ని విభాగాల్లో కూడా కస్టమర్ల నుంచి మంచి డిమాండ్‌ను సాధించి అమ్మకాల్లో బలమైన వృద్ధిని కనబరిచి భారత వాహన మార్కెట్లో తన పట్టును నిలుపుకుంది. 2024 ఏడాది ముగిసిన నేపథ్యంలో గత ఏడాది చివరి నెల (డిసెంబర్‌)కు సంబంధించిన అమ్మకాల వివరాలను ప్రతి కంపెనీ వెల్లడిస్తుంది.

ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ ఇండియా కూడా డిసెంబర్ నెలకు సంబంధించి కంపెనీ నమోదు చేసిన సేల్స్ వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం, 2024 డిసెంబర్‌లో మారుతీ సుజుకీ మొత్తం 1,78,248 అమ్మకాలను నమోదు చేసింది. ఇది 2023 ఏడాది ఇదే డిసెంబర్ నెలతో పోలిస్తే ఏడాది ప్రాతిపదికన దాదాపు 29.59 శాతం వృద్ధిని సాధించింది. భారత మార్కెట్లో మారుతీ వాహనాలకు ఉన్న డిమాండ్‌ను ఇది ప్రతిబింబిస్తుంది.

Maruti Suzuki India Reports Sales Growth

మారుతీ సుజుకీ ఆకట్టుకునే అమ్మకాల గణాంకాలతో 2024కి ఘనంగా వీడ్కోలు పలికింది. డిసెంబర్ నెలలో దేశీయంగా ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 1,30,117గా ఉన్నాయి. ఇది 2023 డిసెంబర్ నెలలో 1,04,778 విక్రయాలతో పోలిస్తే ఏడాది ప్రాతిపదికన 24.18 శాతం వృద్ధిని సాధించింది. ఇదే సమయంలో మారుతీ సుజుకీ ఎగుమతులు కూడా సానుకూలంగా పెరిగాయి. దాదాపు 37,419 వాహనాలు అంతర్జాతీయంగా ఇతర దేశాలకు ఎగుమతి చేయబడ్డాయి.

ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా మారుతీ కార్లకు డిమాండ్ ఏర్పడటం కారణంగా ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే పెరిగాయి. గత ఏడాది 2023 డిసెంబర్ ఎగుమతుల సంఖ్య 26,884గా ఉంది. మొత్తంగా ఈ సారి ఇది 39.19 శాతంతో మంచి వృద్ధి రేటును నమోదు చేసింది. 2024 నాల్గవ త్రైమాసికంలో మారుతీ సుజుకీ అన్ని విభాగాల్లో కూడా వృద్ధి కనబడింది. 2023తో పోలిస్తే ఆకట్టుకునే విధంగా వృద్ధి చెందింది.

Maruti SuzukiSales Growth In December 2024

2024 నాలుగో త్రైమాసికంలో దేశీయ విక్రయాలు 4,06,983 యూనిట్ల నుంచి 4,31,020 కు చేరుకున్నాయి. ఇది ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే 5.91 శాతం వృద్ధి. ఇదే సమీక్ష కాలంలో ఎగుమతులు కూడా పెరిగాయి. 99,220 వాహనాలను ఇతర దేశాలకు రవాణా చేయడం జరిగింది. ఇది దాదాపు 38.22 శాతం పెరుగుదల. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు పెరగడానికి ప్రధాన కారణం ఆల్టో, స్విఫ్ట్ వంటి కార్లకు డిమాండ్ ఉండటం.

మారుతీ సుజుకీ లైట్ కమర్షియల్ వెహికల్ (LCV) విభాగం డిసెంబర్ 2024లో గణనీయంగా వృద్ధి చెందింది. ఈ సమయంలో విక్రయాలు 40.37 శాతం పెరిగి 2,406 యూనిట్లకు చేరుకున్నాయి. అదే గత ఏడాది ఇవి 1,714 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. సరుకు రవాణా ఇటీవల కాలంలో బాగా పెరగడంతో వీటి సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనబడింది.

Maruti Suzuki Sales Growth

మారుతీ బ్రెజ్జా, ఎర్టిగా వంటి కార్లు 55,651 యూనిట్ల అమ్మకాలను సాధించాయి. అదే ఎకో వంటి వ్యాన్‌లు 11,678 యూనిట్ల అమ్మకాలతో డిమాండ్‌ను కొనసాగించాయి. మారుతీ సుజుకీ నాల్గవ త్రైమాసికంలో మొత్తం అమ్మకాలు 5,66,213 యూనిట్లుగా ఉన్నాయి. ఇది గత ఏడాది ఇదే కాలంలో 5,01,207 యూనిట్లుగా నమోదయ్యాయి. ఏడాది ప్రాతిపదికన కంపెనీ సేల్స్ 13 శాతం పెరగడం గమనార్హం.

More from DriveSpark

Article Published On: Thursday, January 2, 2025, 18:11 [IST]
English summary
Maruti suzuki india reports passenger vehicles sales 24 18 percent growth in december 2024
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+